newssting
BITING NEWS :
*దిశ ఘటన మరువక ముందే మరో విషాదం... ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి*హైదరాబాద్‌ టీ-20లో టీమిండియా ఘన విజయం.. వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టిన భారత జట్టు *హైదరాబాద్‌: ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ.. నిందితుల మృతహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలన్న హైకోర్టు... 9న ఉదయం 10.30 గంటలకు విచారణ *కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.*నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారింది: వైకాపా నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి*చింతపల్లిలో దారుణం.. కుక్కలకు బలయిన శిశువు *కర్నూలు: ఉల్లి కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన*ఇవాళ జార్ఖండ్ లో రెండవ విడత పోలింగ్ *దిశ నిందితులు కరుడుగట్టిన నేరస్తులు : సీపీ సజ్జనార్

గంగూలీ 2024 వరకు... సెలక్టర్లు ఇంటికి

02-12-201902-12-2019 12:18:27 IST
2019-12-02T06:48:27.185Z02-12-2019 2019-12-02T06:48:22.188Z - - 07-12-2019

గంగూలీ 2024 వరకు... సెలక్టర్లు ఇంటికి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వచ్చిన కొద్ది రోజుల్లో భారత క్రికెట్‌లో ఆసక్తికరమైన మార్పులు తీసుకొస్తున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ.. ఇప్పుడు బీసీసీఐ రాజ్యాంగంలోనూ మార్పులు తెచ్చాడు. దీని కారణంగా ఇంతకుముందు అనుకున్నట్లుగా గంగూలీ అధ్యక్ష పదవి తొమ్మిది నెలలుకే ముగియదు. అంతా అనుకున్నట్లు జరిగితే గంగూలీని బీసీసీఐ బాస్‌గా గంగూలీ  2024 వరకు ఉంటాడు. గంగూలీ, ఇతర ఆఫీస్‌ బేరర్ల పదవీకాలాలను త్వరగా ముగించే ‘తప్పనిసరి విరామం’ నిబంధనను మార్చాలని ఆదివారం జరిగిన ఏజీఎంలో బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు బీసీసీఐ రాజ్యాంగ సవరణకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరనుంది. 

ఎందుకు 9 నెలలు

బీసీసీఐ ప్రస్తుత  రాజ్యాంగం ప్రకారం ఆఫీసు బేరర్లు రాష్ట్ర సంఘంలో గానీ, బీసీసీఐలో గానీ, రెండింట్లో కలిపి గానీ ఆరేళ్లు పూర్తి చేస్తే మూడేళ్ల విరామం కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో రాష్ట్ర, బీసీసీఐలో పదవులు స్వీకరించకూడదు. బెంగాల్‌ క్రికెట్‌ సంఘంలో వరుసగా ఐదేళ్ల మూడు నెలలు పదవులు స్వీకరించిన గంగూలీ ఈ నిబంధన ప్రకారం తొమ్మిది నెలల్లోనే బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలి.  ఈ నేపథ్యంలో తప్పనిసరి విరామం నిబంధనను మార్చడానికి సుప్రీంకోర్టు అనుమతి కోరింది.  

ఐసీసీకి జై షా

సుప్రీం సవరణకు అనుమతిస్తే ఏడాది లోపే పదవీకాలం ముగియనున్న జై షా కూడా పొడిగింపుకు అర్హుడవుతాడు. దీంతోపాటు ఐసీసీ నిర్వహించే ముఖ్య కార్యనిర్వహణ అధికారుల కమిటీ సమావేశానికి బీసీసీఐ తరఫున కార్యదర్శి జై షాను పంపించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. బీసీసీఐలో పరిపాలకుల కమిటీ ఉన్నప్పుడు ఐసీసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారుల కమిటీ సమావేశానికి బోర్డు తరఫున సీఈవో రాహుల్‌ జోహ్రి వెళ్లేవాడు. అయితే ఐసీసీ బోర్డు సమావేశాలకు ఎవరు హాజరు కావాలనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కొత్త వాళ్లు వస్తారు

ఆఫీసు బేరర్ల పదవీకాలం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏజీఎం సెలక్టర్ల విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో పదవీ కాలం ముగిసిన చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌తోపాటు గగన్‌ ఖోడా పదవి నుంచి దిగిపోతారు. సెలక్టర్లు పదవీకాలానికి మించి పదవుల్లో ఉండడం వీలు కాదని గంగూలీ తేల్చి చెప్పాడు. ప్రసాద్‌, గగన్‌ ఖోడా 2015లో నియమితులవ్వగా,  జతన్‌ పరాంజపె, శరన్‌దీప్‌ సింగ్‌, దేవాంగ్‌ గాంధీ 2016లో వచ్చారు. అంటే కొత్త సెలక్టర్లు త్వరలో వస్తారు. అయితే ఈ సారి ఏటా సెలక్టర్లను నియమించకుండా పదవీకాలాన్ని నిర్ణయిస్తామని గంగూలీ చెప్పాడు. 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle