‘ఖేల్‌రత్న’కు రోహిత్ శర్మ పేరు సిఫారసు చేసిన బీసీసీఐ
31-05-202031-05-2020 14:48:41 IST
2020-05-31T09:18:41.197Z31-05-2020 2020-05-31T09:18:39.250Z - - 17-04-2021

ఒకే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం కోసం నామినేట్ అయ్యాడు. భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీ) సిఫారసు చేసింది. ఇషాంత్ శర్మ, శిఖర్ ధావన్, మహిళా క్రికెటర్ దీప్తి శర్మ పేర్లను ‘అర్జున అవార్డు’ కోసం బీసీసీఐ నామినేట్ చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి 2019 సంవత్సరానికి ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు పొందిన 33 ఏళ్ల రోహిత్... ఒకే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ టి20ల్లో నాలుగు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా నిలిచిన రోహిత్ టెస్టు అరంగేట్రంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశాడు. ఓవరాల్‌గా రోహిత్ ఇప్పటివరకు 224 వన్డేలు, 108 టి20 మ్యాచ్‌లు, 34 టెస్టులు ఆడాడు. కాగా 2010లో అరంగేట్రం చేసిన శిఖర్ ధావన్ 136 వన్డేలు, 61 టి20 మ్యాచ్‌లు, 34 టెస్టులు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 31 ఏళ్ల ఇషాంత్ శర్మ భారత్ తరఫున 97 టెస్టులు ఆడి 297 వికెట్లు... 80 వన్డేలు ఆడి 115 వికెట్లు తీశాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల ఆల్‌రౌండర్ దీప్తి శర్మ భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు (188 పరుగులు) చేసిన మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. దీప్తి వన్డేల్లో 64 వికెట్లు, టి20ల్లో 53 వికెట్లు పడగొట్టింది. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే లక్షణమే ఐపీఎల్లో రోహిత్ శర్మను విజయవంతమైన కెప్టెన్‌గా నిలుపుతోందని భారత దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. దక్కన్ చార్జర్స్ తరఫున తొలిసారి ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రోహిత్ విజయవంతమైన కెప్టెన్‌గా ఎదిగిన తీరును లక్ష్మణ్ గుర్తు చేసుకున్నాడు. ‘చార్జర్స్‌కు ఆడినప్పుడు రోహిత్ యువ ఆటగాడు. మ్యాచ్ మ్యాచ్‌కూ, ప్రతీ విజయానికి అతని ఆత్మవిశ్వాసం స్థాయి పెరిగిపోయేది. యువకులకు మార్గనిర్దేశం చేస్తూ రోహిత్ ప్రధాన ఆటగాళ్ల గ్రూపులోకి చేరిపోయాడు. ఒత్తిడిని అధిగమి స్తూ బ్యాటింగ్ చేసిన ప్రతి సారీ అతను ఆటగాడిగా ఎదిగాడు. అందుకే రోహిత్ విజయవంతమైన కెప్టెన్ అయ్యాడు’ అని లక్ష్మణ్ వివరించాడు. కెప్టెన్‌గా రోహిత్ ముంబై ఇండియన్స్‌కు ఇంతవరకు 4 టైటిళ్లు అందించాడు. ఖేల్ రత్న అవార్డుకు గాను 2016 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 మధ్యకాలాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఈ కాలంలోనే రోహిత్ శర్మ టి20 లో నాలుగ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గానూ, వన్డేల్లో 8 సార్లు 150 పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గాను చెరిగిపోని రికార్డులు సాధించాడు. ఇకపోతే 2017 ప్రారంభం నుంచి మూడేళ్లలో రోహిత్ 18 వన్డే సెంచరీలు సాధించాడు. కాగా కెరీర్లో ఇంతవరకు 28 వన్డే సెంచరీలు బాదిన రోహిత్ అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాట్స్మన్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. 2019 వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన రోహిత్ శర్మ ఒకే వన్డే ప్రపంచ కప్‌లో అయిదు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సాధించాడు. అలాగే భారతీయ మైదానాల్లో అత్యధిక సిక్సర్లుసాధించిన మహేంద్ర సింగ్ ధోనీని సైతం రోహిత్ శర్మ అధిగమించాడు. గత సంవత్సరం టెస్టుల్లో ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన రోహిత్ టెస్ట్ ఓపెనర్‌గా వరుసగా రెండు ద్విశతకాలు సాధించిన రికార్డును కూడా తన కైవసం చేసుకున్నాడు.

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?
14 hours ago

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్
15-04-2021

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే
15-04-2021

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
15-04-2021

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
15-04-2021

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ
15-04-2021

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!
15-04-2021

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!
15-04-2021

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
14-04-2021

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
14-04-2021
ఇంకా