newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క్రీడా పద్మాలు.. క్రీడాకారులకు అత్యున్నత అవార్డులు

26-01-202026-01-2020 10:00:12 IST
2020-01-26T04:30:12.089Z26-01-2020 2020-01-26T04:30:04.786Z - - 14-04-2021

క్రీడా పద్మాలు.. క్రీడాకారులకు అత్యున్నత అవార్డులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం క్రీడాకారుల ప్రతిభను గుర్తించింది.  మహిళా స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌కు రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్‌’ అందుకోనుంది. తెలుగుతేజం పీవీ సింధుకి మరో పురస్కారం దక్కింది.  భారత ప్రభుత్వం ప్రపంచ చాంపియన్‌ సింధును మూడో అత్యున్నత పౌరపురస్కారం ‘పద్మభూషణ్‌’ అవార్డుకు ఎంపిక చేసింది. కేంద్రం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల జాబితాలో మొత్తం ఎనిమిది మంది క్రీడాకారులు వున్నారు.

పద్మ అవార్డులు అందుకోనున్న వారిలో మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్, భారత మహిళల హాకీ కెప్టెన్‌ రాణి రాంపాల్, పురుషుల హాకీ మాజీ కెప్టెన్‌ ఎం.పి.గణేష్, స్టార్‌ షూటర్‌ జీతు రాయ్, మహిళల ఫుట్‌బాల్‌ మాజీ సారథి ఒయినమ్‌ బెంబెం దేవి, ఆర్చర్‌ తరుణ్‌దీప్‌ రాయ్‌లు వున్నారు. వీరిని కేంద్రం  ‘పద్మశ్రీ’ పురస్కారాలకు ఎంపిక చేసింది. 

పీవీ సింధుకి 2015లో పద్మశ్రీ దక్కింది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో రన్నరప్‌గా నిలిచిన తెలుగుతేజం ఖాతాలో ఇప్పటికే 5 ప్రపంచ చాంపియన్‌ షిప్‌ పతకాలున్నాయి. 2019లో జరిగిన  ఈవెంట్‌లో బంగారు పతకం నెగ్గిన సింధు కెరీర్‌లో రెండేసి చొప్పున రజత, కాంస్య పతకాలు సాధించింది. గతంలోనే  పద్మశ్రీ (2006), పద్మభూషణ్‌ (2013)లు అందుకున్న మణిపూర్‌ బాక్సర్, రాజ్యసభ ఎంపీ మేరీకోమ్‌ తాజాగా ‘పద్మవిభూషణ్‌’ పురస్కారానికి ఎంపికైంది.

స్పోర్ట్స్‌లో ఈ అవార్డుకు ఎంపికైన నాలుగో వ్యక్తి మేరీ కోమే కావడం విశేషంగా చెబుతున్నారు. గతంలో మాజీ చెస్‌ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్, దివంగత పర్వతారోహకుడు ఎడ్మండ్‌ హిల్లరి (న్యూజిలాండ్‌), క్రికెట్‌ ఎవరెస్ట్‌ సచిన్‌ టెండూల్కర్‌లు మాత్రమే పద్మవిభూషణ్‌ అందుకున్నారు. 41 ఏళ్ల జహీర్‌ఖాన్‌ అద్భుత క్రీడాకారుడు. 2011 వన్డే ప్రపంచకప్‌ సాధించిన టీమిండియా సభ్యుడు. 92 టెస్టుల్లో 311, 200 వన్డేల్లో 282 వికెట్లు తీశాడు. 25 ఏళ్ల భారత కెప్టెన్‌ రాణి రాంపాల్‌ 241 మ్యాచ్‌లలో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. మొత్తం మీద క్రీడాకారులను కేంద్రం సముచిత రీతిన సత్కరిస్తోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle