క్రికెట్ ఫ్యాన్స్ కి నిరాశే.. టీమిండియా ఆసీస్ టూర్ లేనట్టే?
30-03-202030-03-2020 09:07:45 IST
2020-03-30T03:37:45.129Z30-03-2020 2020-03-30T03:37:31.964Z - - 22-04-2021

క్రీడాప్రేమికులు ఎక్కువగా చూసేది క్రికెట్ నే.ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ మ్యాచ్ జరిగినా... క్రికెట్ ఫ్యాన్స్ అక్కడ వాలిపోతారు. లేదంటే తమ మొబైల్స్ లో మ్యాచ్ లు చూస్తుంటారు. తాజాగా కరోనా దెబ్బకు ఐపీఎల్ రద్దయింది. ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన రద్దయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2వేలకి పైగా చేరాయి. ఆర్ధిక వ్యవస్థలో జవసత్వాలు నింపేందుకుగాను ఆస్ట్రేలియా దాదాపు రూ.2.9 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. దీని కింద చిన్న చిన్న పరిశ్రమలు, స్వచ్చంద సంస్థలకు రాయితీలు అందజేస్తారు. ఆస్ట్రేలియా చరిత్రలోనూ తొలిసారిగా సామాజిక భద్రత ప్రయోజనాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. దీనిపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఆదివారం నిర్వహించారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాలో కరోనా కారణంగా 18 మంది మరణించగా, కేసులు 5వేలకు చేరువలో వున్నాయి. కరోనా కారణంగా వీసా నిబంధనలు కఠినతరం చేశారు. దీంతో ఆస్ట్రేలియాకు ఆరునెలల వరకూ విదేశీయుల్ని దేశంలోకి అనుమతించకూడదని నిర్ణయించుకుంది ఈ నిర్ణయం క్రికెట్ మ్యాచ్ లపై పడనుంది. ఆస్ట్రేలియా గడ్డపై అక్టోబరులో భారత్ పర్యటన వుంది. దీంతో ఆ పర్యటన జరగకపోవచ్చని అంటున్నారు. అక్టోబరులో టీ20 వరల్డ్‌కప్‌కి ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ.. అప్పటిలోపు కరోనా వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ టోర్నీ షెడ్యూల్‌పైనా ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా రివ్యూ చేయనుంది. ఈ టోర్నీ కంటే ముందు ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టనున్న భారత్, ఇంగ్లాండ్ జట్లు.. అక్కడ ఆస్ట్రేలియాతో కలిసి ముక్కోణపు టీ20 సిరీస్‌ను ఆడాల్సి ఉంది. కానీ.. ఆరు నెలల పాటు వీసాల్ని రద్దు చేస్తే..? ఈ ట్రై సిరీస్ జరగడం సందేహమే. ఇక ఈ ఏడాది డిసెంబరు - 2021 జనవరిలోనూ ఆస్ట్రేలియాలో ఓ నాలుగు టెస్టుల సిరీస్‌ని భారత్ ఆడాలి. అప్పటి వరకూ పరిస్థితి ఎలా వుంటుందో చూడాలంటున్నారు.

RCBvsRR: బెంగళూరు వరుస విజయాలకు రాజస్థాన్ బ్రేక్ వెయ్యగలదా?
5 hours ago

చెన్నై సూపర్ కింగ్స్ ను టెన్షన్ పెట్టగా.. చివరికి..!
13 hours ago

CSK vs KKR: ధోని కెప్టెన్సీ ముందు KKR నిలిచేనా?
21-04-2021

SRH లక్ష్యం 120 ఛేదించేనా తడబడేనా?
21-04-2021

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్..
21-04-2021

ధోని తల్లిదండ్రులకు కరోనా..!
21-04-2021

రోహిత్ శర్మకు భారీ జరిమానా..!
21-04-2021

DC vs MI: ముంబై బౌలింగ్ ధాటికి.. ఢిల్లీ బ్యాటమెన్ నిలవగలరా..!
20-04-2021

రాజస్థాన్ ను చిత్తు చేసిన చెన్నై
20-04-2021

CSK vs RR : చెన్నై తో తలబడనున్న రాజస్థాన్.. గెలుపెవరిది?
19-04-2021
ఇంకా