newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క్రికెట్ ఫ్యాన్స్‌కి షాక్.. టీ20.. 2022కి వాయిదా

27-05-202027-05-2020 20:10:13 IST
Updated On 27-05-2020 20:11:34 ISTUpdated On 27-05-20202020-05-27T14:40:13.861Z27-05-2020 2020-05-27T14:40:01.267Z - 2020-05-27T14:41:34.969Z - 27-05-2020

క్రికెట్ ఫ్యాన్స్‌కి షాక్.. టీ20.. 2022కి వాయిదా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇది క్రికెట్ ప్రేమికులకు షాకింగ్, షేకింగ్ న్యూసే. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వరల్డ్ టీ20 2022కి వాయిదా పడినట్టు తెలుస్తోంది.  కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌-నవంబర్‌లో జరిగే అవకాశాలు కనుమరుగు కావడంతో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులలో ఈ మెగా టోర్నీ నిర్వహించడం కష్టమేనని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు .

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) గురువారం అన్ని దేశాల క్రికెట్‌ బోర్డులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. దీంతో ఈ సమావేశం తర్వాతనే టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉండటంతో ఈ సమావేశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం 2022లోనే టీ20 జరిగే అవకాశాలున్నాయి. ఈసమాచారం ప్రకారం అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను 2022కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సమయాన్ని ఐపీఎల్‌కు కేటాయించాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచకప్‌ నిర్వహణకు ఆసీస్‌ కరోనా నిబంధనలు ప్రతిబంధకంగా మారాయి. 

సెప్టెంబర్‌ లో తమ దేశానికి వచ్చేవారి  పర్యాటక వీసాలను ఆస్ట్రేలియా రద్దు చేయడం, సెప్టెంబర్‌ వరకు ఆసీస్‌లో లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో టోర్నీ ఏర్పాట్లు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మాజీ ఆటగాళ్లు సైతం ప్రపంచకప్‌ కంటే ఐపీఎల్‌ టోర్నీనే ఉత్తమమని భావిస్తుండడంతో ఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనిపై మరికొద్ది గంటల్లో నిర్ణయం వెలువడనుంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle