newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క్రికెట్ పోటీలకు బయో సెక్యూర్ పాలసీయే శరణ్యమా?

04-07-202004-07-2020 11:08:21 IST
Updated On 04-07-2020 12:23:51 ISTUpdated On 04-07-20202020-07-04T05:38:21.291Z04-07-2020 2020-07-04T05:37:43.847Z - 2020-07-04T06:53:51.184Z - 04-07-2020

క్రికెట్ పోటీలకు బయో సెక్యూర్ పాలసీయే శరణ్యమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూనే ఉంది. ఇప్పటికీ వైరస్‌ ప్రభావం ఏ దేశంలోనూ తగ్గకపోవడంతో.. ఇక అది తమ జీవన విధానంలో భాగంగానే ప్రజలు భావిస్తున్నారు. వైరస్‌కు వ్యాక్సిన్‌ వచ్చే వరకూ ప్రతీ పనిని వాయిదా వేయడం కష్టసాధ్యంగా మారిన క్రమంలో ఎక్కువ శాతం మంది జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక క్రీడా ఈవెంట్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 

క్రీడలు జరగాలంటే తప్పనిసరిగా ప్రేక్షకులు ఉండాలి. అయితే ఇప్పటికిప్పుడు మైదానాల్లో ప్రేక్షకులు ఉండడం అసాధ్యం. దీంతో ఇక నుంచి క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగే వేదికల్లో బయో సెక్యూర్‌ విధానాన్ని అవలంభించాలని అన్ని బోర్డులు చూస్తున్నాయి.

కరోనా వైరస్ కారణంగా‌ దాదాపు నాలుగు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరగడం లేదు. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టారు. మరికొన్ని దేశాల్లో మాత్రం సాధన చేసేందుకూ అనువైన పరిస్థితులు లేవు. అయితే ఇంగ్లండ్‌ క్రికెట్ బోర్డు వెస్టిండీస్‌ జట్టుతో బయో సెక్యూర్ వాతారణంలో సిరీస్ ఆడించేందుకు సిద్దమయింది. 

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బయో సెక్యూర్‌ వాతావరణంలో సౌతాంప్టన్‌ వేదికగా జులై 8 నుంచి తొలి మ్యాచ్‌ ఆరంభం కాబోతోంది. బంతిపై ఉమ్మి రాయడం నిషేధం, సంబరాలపై ఆంక్షల నేపథ్యంలో సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.

క్రికెటర్లకు ఒకరినుంచి మరొకరికి వైరస్‌ సోకకుండా లేదా అసలు వైరస్‌ ఉనికే లేకుండా ఉంచేందుకు బయో సెక్యూర్‌ వాతావరణం సృష్టిస్తున్నారు. దీంతో మ్యాచులు జరిగే ప్రాంతంలో వైరస్‌ ఉండదని ఐసీసీ, ఈసీబీ భావిస్తోంది. ఈ వాతావరణాన్ని సృష్టించేందుకు ఈసీబీ కట్టుదిట్టంగా ప్రణాళిక రూపొందించింది. 

మూడు వేదికల్లో జరగాల్సిన సిరీస్‌ను రెండింటికే పరిమితం చేసింది. స్టేడియాలకు అనుబంధంగా హోటళ్లు ఉన్నాయి. అక్కడి ఇతరులు రాకుండా నిబంధనలు జారీ చేశారు. క్రికెటర్లు సైతం బయటకు వెళ్లకుండా నిఘా ఉంటుంది. పర్యాటక వెస్టిండీస్‌ జట్టు, మ్యాచ్‌ అధికారులు, బ్రాడ్‌కాస్టర్లు, ఇతర సిబ్బంది సైతం ఈసీబీ నిబంధనలు పాటించి మూడు వారాలు క్వారంటైన్‌లో ఉన్నారు.

ఆటగాళ్లు మ్యాచుల్లో ఒకరినొకరు ముట్టుకోకూడదు. సంబరాలు చేసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే జరుగుతున్న సన్నాహక మ్యాచుల్లో ఇంగ్లండ్ క్రికెటర్లు ఈ పద్ధతులు పాటిస్తున్నారు. వికెట్లు తీసినప్పుడు మోచేతి సంబరాలు చేసుకుంటున్నారు. బంతిపై ఉమ్మితో రుద్దడం లేదు. జేమ్స్ అండర్సన్‌ వంటి పేసర్లు ఎక్కువగా హ్యాండ్‌ శానిటైజర్లు వాడారు. ఇలా క్రికెట్‌ మ్యాచ్‌ బయో సెక్యూర్‌ వాతావరణంలో జరిపేందుకు చూస్తున్నారు. నియమనిబంధనలతో జూలై 8వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది.

బయో సెక్యూర్‌ విధానం సాధ్యమేనా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఇంగ్లండ్‌ వంటి దేశాల్లో దీనికి అనుకూలంగా ఉన్నా.. వేరే దేశాల్లో మాత్రం ఇది కష్టమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న క్యాలెండర్‌ ప్రకారం అందరికీ అది సాధ్యపడదని అంటున్నారు. ఆటగాళ్లను హోటళ్ల నుంచి బయటకు వెళ్లకుండా చేయడం వరకూ ఓకే కానీ, క్రికెట్‌ స్టేడియాలకు ఆనుకుని హోటళ్లు అన్ని చోట్ల ఉండవు కదా అంటున్నారు. ఇతరులను హోటళ్లకు అనుమతి లేకుండా చేయాలంటే అందుకు అయ్యే ఖర్చులను క్రికెట్‌ బోర్డులే భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రేక్షకులు లేకండా క్రికెట్‌ టోర్నీలు నిర్వహించి బోలెడంత నష్టం చూడటానికి సిద్ధమైన బోర్డులు.. అదనపు ఖర్చును భరించడం అంటే తలకు మించిన భారమే అవుతుంది.

 

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle