newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క్రికెట్ కాదు... స్కూల్స్, పరీక్షలే ఇప్పుడు ముఖ్యం

26-04-202026-04-2020 18:33:22 IST
Updated On 26-04-2020 18:52:02 ISTUpdated On 26-04-20202020-04-26T13:03:22.194Z26-04-2020 2020-04-26T13:03:08.569Z - 2020-04-26T13:22:02.935Z - 26-04-2020

క్రికెట్ కాదు... స్కూల్స్, పరీక్షలే ఇప్పుడు ముఖ్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవును... క్రికెట్ పోటీల కంటే పిల్లల భవిష్యత్తుకి సంబంధించి మధ్యలో ఆగిపోయిన పరీక్షలు, జరగాల్సిన పరీక్షలు ముఖ్యం అంటున్నారు విద్యావేత్తలు. ఇప్పుడు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్. కరోనా మహమ్మారి నియంత్రణలోకి వచ్చిన తరువాత క్రికెట్‌ కంటే విద్యాసంస్థలు తెరిచేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని టీమిండియా మాజీ సారథి కపిల్‌దేవ్‌ తెలిపాడు. ఎలాంటి క్రీడలు లేకుండా ప్రపం చం నిలిచిపోయింది. అయితే క్రీడారంగం వేచి ఉండగలదని 61ఏళ్ల భారత మాజీ కెప్టెన్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తను విశాల దృక్పథంతో ఆలోచిస్తు న్నాను అని పాఠశాలలు, కళాశాలల కు వెళ్లలేకపోతున్న పిల్లల గురించి తను ఆందోళన చెందుతున్నట్టు తెలిపాడు. 

విద్యార్థులు మన భావితరమని కపిల్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో తన అభిప్రాయం వ్యక్తపరిచాడు. ఐపీఎల్ మ్యాచ్ లు, ప్రత్యక్ష ప్రసారాల గురించి ఆందోళన పడడం కంటే స్కూల్స్ మొదట తెరవాలని తను కోరుకుంటున్నట్టు తెలిపాడు. క్రికెట్‌, ఫుట్‌బాల్‌ క్రమకమంగా జరుగుతాయని, పాకిస్థాన్‌ మాజీ స్పీడ్‌స్టర్‌ షోయ్‌బ్‌ అక్తర్‌ సూచించిన విధంగా నిధుల సేకరణకు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌కు తను అనుకూలంగాలేనని దిగ్గజ ఆల్‌రౌండర్‌ పునరుద్ఘాటించారు. భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్‌ను తిరిగి ప్రారంభించాలని పాకిస్థాన్‌ చిత్తశుద్ధితో కోరుకుంటే ఆ దేశం ముందుగా సరిహద్దువద్ద భారత వ్యతిరేక కార్యకలాపాలను నిలిపివేయాలని సూచించాడు.

ఆ డబ్బును ఉన్నత కారణాలకు ఉపయోగించాలని కోరాడు. మ్యాచ్‌లు ఆడటం ప్రస్తుతానికి ప్రాధాన్యంకాదు. మీకు డబ్బు అవసరమైతే మీరు సరిహద్దులో భారత్‌ వ్యతిరేక కార్యకలాపాలు ఆపాలని ఆ డబ్బును ఆస్పత్రులు, పాఠశాలలు నిర్మించడానికి ఖర్చుచేయాలని కపిల్‌ కోరాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కపిల్ అభిప్రాయాన్ని విద్యావేత్తలే కాదు క్రీడాప్రముఖులు కూడా సమర్దిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle