క్రికెట్ ఆటను ఫినిష్ చేసింది ఐసీసీనే.. షోయబ్ తీవ్ర ఆరోపణలు
27-05-202027-05-2020 10:38:14 IST
Updated On 27-05-2020 11:10:16 ISTUpdated On 27-05-20202020-05-27T05:08:14.380Z27-05-2020 2020-05-27T05:08:11.188Z - 2020-05-27T05:40:16.905Z - 27-05-2020

గత పదేళ్లకాలంలో క్రికెట్ ఆటను విజయవంతంగా నిర్మూలించివేసిన ఘనత అంతర్జాతీయ క్రికెట్ మండలికే దక్కుతుందని పాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ ఆరోపించారు. వైట్ బాల్ క్రికెట్ విధానంలోని కొన్ని పరిస్థితుల కారణంగా గత దశాబ్దకాలంగా క్రికెట్ కేవలం బ్యాట్స్మన్లకు మాత్రమే సంబంధించినదిగా మారిపోయిందని, బౌలింగ్ మెరుపులు ఇక్కడే మాయమైపోయాయని అక్తర్ దుయ్యబట్టారు. క్రిక్ ఇన్ఫో పాడ్ కాస్ట్ కోసం సంజయ్ మంజ్రేకర్‌తో తాజాగా సంభాషించిన షోయబ్ అక్తర్ కేవలం పదేళ్లలోపే క్రికెట్ ఆటలోని మజా కుప్పగూలిపోయిందని పేర్కొన్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లు వేగంగా బంతులు సంధించలేకపోతున్నారెందుకు అని సంజయ్ మంజ్రేకర్ సంధించిన ప్రశ్నకు అక్తర్ సమాధానమిచ్చారు. సంజయ్ నీకు ఒక పచ్చినిజం చెప్పొచ్చా. క్రికెట్ ఆటకు చరమగీతం పాడింది ఐసీసీనే. గత పదేళ్లకాలంలో సాక్షాత్తూ ఐసీసీనే క్రికెట్‌ను నిర్మూలించివేసిందని బహిరంగంగా ప్రకటిస్తున్నాను. ఐసీసీ పెద్దలు తామనుకున్న లక్ష్యం పూర్తి చేసినందుకు ప్రశంసించాల్సిందే మరి. మొత్తానికి మీరు అనుకున్నది సాధించేశారు అంటూ షోయబ్ అక్తర్ ఐసీసీ పెద్దలపై ధ్వజమెత్తారు. వన్డేల్లో ఔట్ సైడ్ సర్కిల్లో నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉంటున్నందున ఒక ఓవర్‌కు బౌన్సర్ల సంఖ్యను పెంచాల్సి ఉంటుందని లేకపోతే బ్యాట్స్‌మన్ ఇష్టారాజ్యంగా ఆట మారిపోతుందని అక్తర్ పేర్కొన్నారు. వన్డేల్లో ఓవర్‌కి ఒక్క బౌన్సర్ మాత్రమే సంధించాలని ఉన్న రూల్‌ని మార్చేయమని పదే పదే చెప్పాను. వన్డేల్లో రెండు కొత్త బంతులు అందుబాటులో ఉంటాయి. ఔట్ సైడ్‌లో నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. ఇలాంటి నిబంధనల కారణంగా గత పదేళ్లుగా క్రికెట్ ఆటలో నాణ్యత తగ్గిపోయిందా లేదా అనేది ఐసీసీ పెద్దల్నే అడగండి. వారే సమాధానం చెబుతారు అంటూ షోయబ్ విమర్శించాడు. సమకాలీన క్రికెట్లో షోయబ్ అక్తర్, సచిన్ టెండూల్కర్ తరహా పోటీల్ని ఎవరైనా చూడగలుగుతున్నారా అని అక్తర్ ప్రశ్నించాడు. సచిన్ టెండూల్కర్‌తో తాను ఎన్నడూ దూకుడుగా వ్యవహరించలేదని, ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అయిన సచిన్ అంటే తనకు అపారమైన గౌరవం ఉండేదని షోయబ్ చెప్పుకొచ్చారు. 2006 ప్రాంతంలో సచిన్‌కి టెన్నిస్ ఎల్బో సమస్య తీవ్రంగా ఉండేదని, కాబట్టి సచిన్ నేను సంధించే బంతులను హుక్ లేదా ఫుల్ చేయలేకపోయేవాడని అక్తర్ తెలిపాడు. అందుకనే సచిన్ నా బంతుల్ని బాదకుండా ఉండేందుకు పదే పదే తనకు బౌన్సర్లు సంధించేవాడినని అక్తర్ చెప్పుకొచ్చాడు. అలాగే ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్ మన్ అయిన విరాట్ కోహ్లీ.. వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, షేన్ వార్న్‌లు చెలరేగిపోతున్న దశలో వారి బౌలింగులో ఆడి ఉంటే తన సత్తా బయటపడేదని షోయబ్ వ్యాఖ్యానించాడు. పుల్ షాట్లను కొట్టడంలో కోహ్లీ బలహీనత తనకు తెలుసు కాబట్టే శరవేగంతో తాను సంధించే బంతులను కోహ్లీ అడలేకపోయేవాడని అక్తర్ చెప్పాడు. కొత్త బంతిని కోహ్లీ డ్రైవ్ చేసేలా ఊరించి తరచుగా ఔట్ చేసేవాడినని, ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆడర్సన్ బౌలింగ్‌లో కూడా కోహ్లీ తంటాలు పడేవాడని అక్తర్ చెప్పాడు.

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
11 hours ago

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
15 hours ago

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
a day ago

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
a day ago

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
13-04-2021

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
12-04-2021

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను
12-04-2021

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!
12-04-2021

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
11-04-2021

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
11-04-2021
ఇంకా