newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క్రికెట్‌కు పునర్జన్మ నిచ్చిన ఇంగ్లండ్, విండీస్ తొలి టెస్టు

15-07-202015-07-2020 07:52:19 IST
Updated On 15-07-2020 09:37:59 ISTUpdated On 15-07-20202020-07-15T02:22:19.260Z15-07-2020 2020-07-15T02:22:16.435Z - 2020-07-15T04:07:59.396Z - 15-07-2020

క్రికెట్‌కు పునర్జన్మ నిచ్చిన ఇంగ్లండ్, విండీస్ తొలి టెస్టు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా ప్రమాద సమయంలో అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఇంగ్లండ్ తొలి అడుగును విజయవంతంగా వేసింది. చాలామంది క్రికెట్ దిగ్గజాలు వ్యతిరేకిస్తున్నా, వెస్టిండీస్‌తో తొలి టెస్టును ఇంగ్లండ్‌ ఘనంగా నిర్వహించింది. అయితే ఇంగ్లండ్‌ బోర్డు సాహసం ఇతర దేశాలకు కూడా స్ఫూర్తినిస్తుందా ఆ దేశం తరహాలో ఇతర బోర్డులు కూడా నిర్వహించడం సాధ్యమేనా వేచి చూడాలి. ఏది ఏమైనా దాదాపు ఆరు నెలల తర్వాత క్రికెట్ ఆటకు పునర్జన్మ నిచ్చిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టుపై విండీస్ సాధించిన అద్భుత విజయం క్రికెట్‌పై మళ్లీ ఆశలు చిగురింపజేసింది.

‘వాస్తవికంగా ఆలోచిస్తే నా దృష్టిలో బయో బబుల్‌ వాతావరణంలో టెస్టు మ్యాచ్‌ నిర్వహించడం సాధ్యం కాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆట మధ్యలో ఎవరికైనా కరోనా సోకినట్లు తెలిస్తే ఏం చేస్తారు. మ్యాచ్‌ను మధ్యలో రద్దు చేస్తారా’... కొద్ది రోజుల క్రితం భారత మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చేసిన వ్యాఖ్య ఇది. అయితే ఇప్పుడు దీనిని తప్పుగా నిరూపిస్తూ వెస్టిండీస్‌తో తొలి టెస్టును ఇంగ్లండ్‌ ఘనంగా నిర్వహించింది. 

స్టేడియం పరిసరాల్లో ఎంపిక చేసిన కొద్ది మందికే ప్రవేశం, వారికి మళ్లీ మళ్లీ కోవిడ్‌–19 పరీక్షలు, సోషల్‌ డిస్టెన్సింగ్, ప్రతీ రోజు ఆటగాళ్ల హెల్త్‌ రిపోర్ట్‌లు, బౌండరీ వద్ద శానిటైజర్లు, ఆడేటప్పుడు మినహా ప్రతీ సమయంలో మాస్క్‌లు తప్పనిసరి... ఇలా కొత్త కొత్త నిబంధనల మధ్య సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్, విండీస్‌ ఆటగాళ్లు తలపడ్డారు. ఇతరులు ఎవరికీ ప్రవేశం లేకుండా తమ చుట్టూ ఒక వలయం ఏర్పరచుకొని (బయో బబుల్‌) ఒక సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా తరహాలో ఉన్నట్లు క్రికెటర్లు తమ పరిధిలో తొలి టెస్టు ఆడారు. మైదానంలో ప్రేక్షకులు లేకపోవడమే నిరాశ తప్ప అదృష్టవశాత్తూ ఆటగాళ్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఆందోళనకరమైన ఘటనలూ జరగలేదు. ఇదే జోరుతో మిగిలిన రెండు టెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది.  

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ తర్వాత పాకిస్తాన్‌తో కూడా ఇదే తరహాలో ఇంగ్లండ్‌ స్వదేశంలో సిరీస్‌ ఆడనుంది. ఇప్పటికే పాక్‌ జట్టు ఇంగ్లండ్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా, ఏర్పాట్లన్నీ కోవిడ్‌–19 నిబంధనల ప్రకారమే పూర్తయ్యాయి కూడా. అంతర్జాతీయ జట్లను చూస్తే ఇంగ్లండ్‌కు ప్రస్తుత జూలై–ఆగస్టు అసలైన క్రికెట్‌ సీజన్‌. దీన్ని చేజార్చుకుంటే ఇంగ్లండ్‌ బోర్డు ఆర్థికపరంగా భారీ నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి దేశంలో కరోనా వ్యాప్తి ఉన్నా సరే...  ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్న విండీస్, పాక్‌ బోర్డులకు ఆశ చూపి ఇంగ్లండ్‌ సిరీస్‌లు ఆడిస్తోంది. సమర్థ నిర్వహణలో ప్రసారకర్తలు స్కై న్యూస్‌ పాత్ర కూడా ఇందులో చాలా ఉంది.

ఇంగ్లండ్‌–విండీస్‌ సిరీస్‌ ముగిసిన తర్వాతే బయో బబుల్‌ వాతావరణంపై ఒక అంచనాకు రాగలమని క్రికెట్‌ విశ్లేషకులు భావించారు. ప్రస్తుతానికి ఇతర బోర్డులేవీ ఈ తరహా ఆలోచనతో ఉన్నట్లు కనిపించడం లేదు. అదనపు ఖర్చుతోపాటు అదంతా ఎంతో ఓర్పు, శ్రమతో కూడుకున్న వ్యవహారంగా ఎక్కువ దేశాలు భావిస్తున్నాయి. ఇంగ్లండ్‌కు సరి జోడిలాంటి ఆస్ట్రేలియా బోర్డు కూడా దీనిపై తొందరపడటం లేదు. ఎక్కువ జట్లతో ఇది సాధ్యం కాదు కాబట్టి ఆ దేశం టి20 ప్రపంచకప్‌ను వాయిదా వేయించేందుకే ఆసక్తి చూపించింది. ఆదాయం తెచ్చి పెట్టగలిగే భారత్‌ సిరీస్‌కు మాత్రం అలా ఆలోచిస్తోంది కానీ దానికి ఇంకా చాలా సమయముంది. దక్షిణాఫ్రికా బోర్డు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభంలో వారికి ఇది సాధ్యమే కాదు.  

కరోనా సమయంలో జరుగుతున్న క్రికెట్‌లో ప్రధానంగా బంతిపై సలైవా (ఉమ్మి)  వాడటంపై చాలా చర్చ జరిగింది. అయితే సౌతాంప్టన్‌ టెస్టు తర్వాత చూస్తే దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఏ బౌలర్‌ కూడా సలైవా లేకపోవడం వల్ల తాను స్వింగ్‌ చేయడానికి ఇబ్బంది పడినట్లు చెప్పలేదు. బహిరంగంగా కూడా తన అసంతృప్తిని ప్రదర్శించలేదు కాబట్టి అది సమస్య కాదనే ప్రస్తుతానికి అనుకోవచ్చు. అయితే అంపైరింగ్‌ తప్పిదాలపై మాత్రం మరోసారి దృష్టి పెట్టాల్సిందే.

కరోనా సమయంలో తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఈ టెస్టులో నలుగురు అంపైర్లు కూడా ఇంగ్లండ్‌వారే పని చేశారు. యాదృచ్ఛికమే కావచ్చేమో గానీ మొత్తం 22 రివ్యూలలో 11 రివ్యూలు అంపైర్లు తప్పు చేసినట్లు తేల్చాయి. వీటిలో ఎక్కువ భాగం ఇంగ్లండ్‌కు అనుకూలంగా ఇచ్చినవే. మొత్తంగా చూస్తే కరోనా విరామం తర్వాత జరిగిన తొలి టెస్టు గురించి పెద్దగా ఫిర్యాదులేమీ రాలేదు. కాబట్టి మున్ముందు ఎలా జరగవచ్చో చెప్పలేకపోయినా... ప్రస్తుతానికి క్రికెట్‌ తడబాటు లేకుండా మొదలైనట్లే.

ఇతర దేశాల సంగతి ఎలా ఉన్నా భారత్‌లో మాత్రం ఇప్పటికిప్పుడు క్రికెట్‌ తిరిగి రావడం చాలా కష్టం. దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ తీవ్రంగా పెరిగిపోతున్న సమయంలో క్రికెట్‌ అంటే జనం నుంచే మొదట నిరసన కనిపించవచ్చు. ఐపీఎల్‌పై బోర్డు ఎన్ని ఆశలు పెట్టుకుంటున్నా... అది అంత సులువు కాదు. ఇక ఇంగ్లండ్‌లాగా బయో బబుల్‌ తరహాలో అంటే అసాధ్యమనే చెప్పవచ్చు. గతంలోనే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చెప్పినట్లు కరోనా సమయంలో ఆటల నిర్వహణలో విదేశీ తరహా క్రమశిక్షణను మనం ఇక్కడ ఆశించలేం. చిన్న పొరపాటు ఏ స్థాయిలో జరిగినా అది మొత్తానికే నష్టం కలిగించవచ్చు. ఎలా చూసినా ఆస్ట్రేలియాలోనే భారత్‌ తమ తదుపరి సిరీస్‌ ఆడే అవకాశాలే ఎక్కువ.

మరోవైపు కరోనా వైరస్‌ ఉధృతి తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు పేసర్లు రివర్స్‌ స్వింగ్‌ను మర్చిపోవాలని భారత మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌- వెస్టిండీస్‌ మధ్య ముగిసిన తొలి టెస్టులో జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌ను పరిశీలిస్తే తన వ్యాఖ్యలు అర్థమవుతాయని ఇర్ఫాన్‌ అన్నాడు. ‘ఉమ్మి రివర్స్‌ స్వింగ్‌కు దోహదపడుతుంది. ప్రస్తుతం ఉమ్మిపై నిషేధం ఉండడంతో ఏదైన ఇతర వస్తువుతో బంతిని రివర్స్‌ స్వింగ్‌ అయ్యేలా చేసేందుకు అనుమతి ఇవ్వాలి’ అని పఠాన్‌ కోరాడు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle