newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క్రికెటర్ షమీని టెన్షన్ పెడుతున్న భార్య ..బోల్డ్ పిక్‌తో రచ్చరచ్చ

04-06-202004-06-2020 11:22:38 IST
Updated On 04-06-2020 12:11:35 ISTUpdated On 04-06-20202020-06-04T05:52:38.112Z04-06-2020 2020-06-04T05:52:14.425Z - 2020-06-04T06:41:35.736Z - 04-06-2020

క్రికెటర్ షమీని టెన్షన్ పెడుతున్న భార్య ..బోల్డ్ పిక్‌తో రచ్చరచ్చ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో  టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ పేదవారికి తన వంతుగా సాయం చేస్తున్నాడు. కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో క్రికెటర్లకు కావాల్సినంత విశ్రాంతి దొరికింది. దీంతో సోషల్‌ మీడియా బాట పట్టారు చాలామంది క్రికెటర్లు. తమకు నచ్చిందో ఏదో చేసేస్తూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పంచుకునే పనిలోపడ్డారు. కరోనా తెచ్చిన కష్టంతో ఊరుబాట పట్టిన వలస కూలీల కోసం తన వంతు సాయాన్ని అందిస్తున్నాడు. మాస్క్‌లు, ఆహారాన్ని అందజేస్తున్నాడు. అయితే క్రికెటర్ షమీకి మాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది భార్య హసీన్ జహాన్.

షమీ భార్య హసీన్ జహాన్ సోషల్ మీడియా వేదికగా మరోసారి షమీపై తీవ్రమయిన ఆరోపణలు గుప్పించింది. షమీతో కలిసి అర్ధనగ్నంగా దిగిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన హసీన్.. ‘‘నీకేం లేనప్పుడు నన్ను ఆరాధించావు. ఇప్పుడు నీకు అన్నీ ఉన్నాయి. నేనే మలినం అయిపోయా. అబద్దం మాటున దాగిన నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ సెన్సేషనల్ పోస్టు చూసిన నెటిజన్లు ఆమెపై తీవ్రంగా మండిపడుతున్నారు. షమీని మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదని, కరోనా కాలంలో షమీ నలుగురికి సహాయం చేస్తుంటే.. అతని కెరీర్‌ను మరింతగా దెబ్బతీసేందుకు ఇలాంటి నాటకాలు అడుతున్నావా అంటూ విమర్శిస్తున్నారు. తాము షమీకే మద్దతు ఇస్తామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి ఫోటోలు షమీకి కొత్త కాదు. కానీ అంతగా స్పందించడు. 2018లో హ‌సీన్ జ‌హాన్ త‌న భ‌ర్త ష‌మీపై వ్య‌భిచారం, గృహ‌హింస‌, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు చేస్తూ పోలీస్ స్టేష‌న్‌లో కేసులు పెట్టింది. అయితే వాటికి ఆధారాలు లేవ‌ని చెప్పి ష‌మీపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. దీంతో ష‌మీ ఎప్ప‌టిలాగే క్రికెట్ ఆడుతున్నాడు. అయిన‌ప్ప‌టికీ ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు ష‌మీని కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేయ‌డం, పోస్టులు పెట్ట‌డం చేస్తోంది. అందులో భాగంగానే ఆమె ఈ పోస్టును తాజాగా త‌న ఇన్‌స్టా ఖాతాలో ఉంచింది.

2018లో మూడు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని.. అప్పుడు క్రికెట్ గురించి కూడా ఆలోచించలేదని షమీ చెప్పాడు. అతనిపై అనేక కేసులు పెట్టింది హసీన్ జహాన్.  అందుకే అంటారు మనవాళ్ళు... అర్థం చేసుకునే భార్యలేకపోతే అంతకుమించిన నరకం లేదని. ఇంటిపోరు ఇంతింతకాదయా విశ్వదాభిరామ వినురవేమ అని ఎప్పుడో వేమన నీతివాక్యాలు చెప్పారు. 

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ

కంటిలోని నలుసు కాలిముల్లు

ఇంటిలోని పోరు ఇంతింతగాదయా

విశ్వరాభిరామ వినురవేమ  వేమన పద్యం షమీకి బాగా నప్పుతుందేమో. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle