newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

కోహ్లీ రికార్డు గల్లంతు.. స్మిత్ మరో ఘనత

10-09-201910-09-2019 17:42:15 IST
2019-09-10T12:12:15.079Z10-09-2019 2019-09-10T12:12:12.738Z - - 15-09-2019

కోహ్లీ రికార్డు గల్లంతు.. స్మిత్ మరో ఘనత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆసిస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల టెస్టుల్లో నంబర్‌ వన్‌ ర్యాంకును దక్కించుకున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని వెనక్కినెట్టేశాడు. తాజాగా ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ ఈ ఘనత సాధించాడు. యాషెస్‌ సిరీస్‌లో స్మిత్‌ ఇప్పటివరకూ 671 పరుగులు సాధించి రికార్డు బ్రేక్ చేశాడు. సుమారు 135 సగటుతో పరుగుల దాహం తీర్చుకున్నాడు. ఈ క్రమంలోనే విరాట్‌ కోహ్లిని అధిగమించాడు స్మిత్‌.

మూడు టెస్టుల సిరీస్‌ పరంగా కానీ మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత కానీ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్‌ మూడో స్థానాన్ని ఆక్రమించాడు. అదే సమయంలో కోహ్లితో పాటు పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు మహ్మద్‌ యూసఫ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. 2006-07 సీజన్‌లో వెస్టిండీస్‌తో  జరిగిన మూడు టెస్టు సిరీస్‌లో యూసఫ్‌ 665  పరుగులు సాధించాడు. ఇక 2017-18 సీజన్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో కోహ్లి 610 పరుగులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా స్మిత్ ఈ రికార్డుని చెరిపేసి తన పేరిట సరికొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle