newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

కోహ్లీ ప్రపంచ రికార్డు...

11-01-202011-01-2020 08:15:22 IST
2020-01-11T02:45:22.953Z11-01-2020 2020-01-11T02:43:59.983Z - - 09-07-2020

కోహ్లీ ప్రపంచ రికార్డు...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రికార్డుల మీద రికార్డులను బ్రేక్ చేస్తున్న కింగ్ కోహ్లీ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. పూణే వేదికగా శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్‌గా అత్యంత వేగంగా 11 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 169 మ్యాచ్ లలోనే కోహ్లీ 11 వేల పరుగులు చేయడం విశేషం. వరల్డ్ వైడ్ గా చూస్తే ఈ జాబితాలో కోహ్లీ ఆరవ స్థానంలో చేరాడు.

ఈ జాబితాలో పాంటింగ్‌, స్మిత్, అలెన్ బోర్డర్, ఫ్లెమింగ్, ధోని ముందు వరుసలో ఉన్నారు. పాంటింగ్15,440 పరుగులు చేయగా, గ్రేమ్‌ స్మిత్‌ 14, 878 పరుగులు చేశాడు. ఇక ఫ్లెమింగ్‌ 11, 561 పరుగులు చేయగా, ధోని 11, 207 పరుగులు సాధించాడు. టీమిండియా పరంగా చూస్తే ధోని మొదటి స్థానంలో ఉండగా కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. 

శ్రీలంకతో జరిగిన చివరి టీ20 బుమ్రాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్ లో బుమ్రా 1 వికెట్ తీయడంతో టీ20లలో అత్యధిక వికెట్స్ తీసిన ఇండియా బౌలర్ గా బుమ్రా నిలిచాడు. ఈ జాబితాలో బుమ్రా(53), అశ్విన్, చాహల్(52), భువనేశ్వర్ కుమార్(41), కుల్దీప్ యాదవ్(39), పాండ్య(38) వికెట్లతో తరువాతి స్థానాలలో ఉన్నారు. ఈ మ్యాచ్ లో గెలుపుతో టీమిండియా మరో రికార్డు నెలకొల్పింది. టీ20లలో శ్రీలంకపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 19 మ్యాచ్ లు జరగగా 13 మ్యాచ్ లు టీమిండియా గెలుపొందింది. 

 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle