facebooktwitteryoutubeinstagram

ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1046,"2":1105,"3":289,"4":33}

Narendra Modi
1060
Rahul Gandhi
1116
Mayawati
299
Mamata Banerjee
38
BITING NEWS :
*రజనీకాంత్ అభిమానులకు శుభవార్త... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని రజనీకాంత్‌ ప్రకటన *రాహుల్‘న్యాయ్’ బ్యానర్లపై ఈసీ సీరియస్.. నోటీసులు జారీ* ఒకే వేదికపై బద్ధ శత్రువులు... ములాయం, మాయావతి *మే తెలంగాణలో పరిషత్ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్.. 6న మొదటి విడత, మే 10న రెండో విడత, మే 14న మూడో విడత పోలింగ్‌ *సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... తన శాపం వల్లే ఐపీఎస్‌ ఆఫీసర్ హేమంత్‌ కర్కరే మరణించారన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ *రాహుల్‌ గాంధీపై బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ పరువునష్టం దావా * ముగిసిన రెండో విడత పోలింగ్... 68 శాతం పోలింగ్ నమోదు *హైదరాబాద్ లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు

కోహ్లీ గుట్టు విప్పిన చీఫ్ సెలెక్టర్

24-01-201924-01-2019 18:14:00 IST
2019-01-24T12:44:00.654Z24-01-2019 2019-01-24T12:43:50.503Z - - 20-04-2019

కోహ్లీ గుట్టు విప్పిన చీఫ్ సెలెక్టర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెరముందు విరాట్ కోహ్లీ వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలుసు! మైదానంలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను కృంగదీయడానికి అప్పుడప్పుడు కోపగించుకుంటాడే తప్ప... సాధారణ సమయాల్లో చాలా సరదాగా ఉంటాడు. ప్రత్యర్థులతోనూ స్నేహంగా మెలుగుతాడు. మరి... తెరవెనుక కోహ్లీ అసలు రూపం ఏంటి? కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతడిలో గర్వం పెరిగిందా? అంటే అవునని అంటున్నారు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. జట్టు ఎంపిక విషయంలో కోహ్లీ మొండిగా వ్యవహరిస్తాడని, తాను చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రవర్తిస్తాడని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టు ఎంపిక విషయంలో తాను అతడి ఆధిపత్య అనుభవాన్ని ఎదుర్కొన్నానని ఆయనన్నారు.

‘‘ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టును సెలెక్ట్ చేసేటప్పుడు నా అభిప్రాయాన్ని సెలెక్షన్ కమిటీ సభ్యులు, కోహ్లీ వ్యతిరేకించారు. ఆ టూర్‌లో యువ ఆటగాళ్ళకు అవకాశం ఇవ్వాలని నేను భావించాను. కానీ... దీన్ని వాళ్ళు తిరస్కరించారు. ప్రపంచకప్‌కు ముందు జట్టులో ఇలాంటి ప్రయోగాలు చేయడం మంచిది కాదన్నారు. సీనియర్లనే ఎంపిక చేయాలని వారు డిమాండ్ చేయడంతో నేను తలొగ్గాల్సి వచ్చింది. ముఖ్యంగా కోహ్లీనే సీనియర్ల ఎంపిక కోసం పట్టుబట్టాడు’’ అని ప్రసాద్ తెలిపారు. అయితే... యువ క్రికెటర్స్‌ని కాదని జట్టులో స్థానం కల్పించిన ఇద్దరు ఆటగాళ్ళు ఆ టూర్‌లో విఫలం కావడంతో వాళ్ళు తమ పొరపాటును అంగీకరించారన్నారు. తాను అనుకున్నట్టే హనుమ విహారి, మయాంక్ అగర్వాల్ ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతంగా రాణించారని ప్రసాద్ గుర్తు చేశారు. తమ తప్పు తెలుసుకున్న కోహ్లీ, కమిటీ సభ్యులు ఆ తర్వాత పశ్చాత్తాపం చెందారని చెప్పుకొచ్చారు.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle