కోహ్లీ ఆటలు నావద్ద కుదరవ్.. విండీస్ బౌలర్
14-09-202014-09-2020 14:48:53 IST
Updated On 14-09-2020 14:53:58 ISTUpdated On 14-09-20202020-09-14T09:18:53.430Z14-09-2020 2020-09-14T09:18:50.769Z - 2020-09-14T09:23:58.392Z - 14-09-2020

ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభం కాకముందే నెట్ ప్రాక్టీసులో బంతులను విరగబాదుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పదే పదే రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు విండీస్ పాస్ట్ బౌలర్ కెస్రిక్ విలియమ్స. విరాట్ కోహ్లినా అయితే నాకేంటి అనేలాగా వీరంగమాడుతున్నాడీ విండీస్ బౌలర్. గతంలో కోహ్లిని ఔట్ చేసిన సందర్భాలని గుర్తుచేసుకుంటూ అతన్ని ఔట్ చేయడం తనకు చాలా ఈజీ అంటున్నాడు కెస్రిక్ విలియమ్స్. ఎక్కువగా మీడియా దృష్టిని ఆకర్షించడానికి విలియమ్స్ ఇలా కామెంట్లు చేస్తున్నా అవి కాస్త హాస్యాస్పదంగానే ఉంటున్నాయి. తాజాగా కోహ్లి గురించి ఆంగ్ల వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కెస్రిక్ మాట్లాడుతూ కోహ్లీ అంటే చాలామంది బౌలర్లకు నిద్రపట్టకపోవచ్చు కానీ కోహ్లిని ఔట్ చేయడానికి నాకు ఒక్క బాల్ చాలు అంటూ సవాల్ చేశాడు. కోహ్లికి బౌలింగ్ చేయడం కష్టం అనుకుంటున్నారా.. నాకైతే కాదు. కోహ్లి టాలెంటెడ్ ప్లేయర్ అన్నది నిజమే... కానీ కోహ్లి గురించి నాకు ఎటువంటి ఆందోళన లేదు. ప్రత్యర్ధి స్థానంలో కోహ్లి ఉన్నాడు అనే ఆలోచనే ఎప్పుడూ రాదు అంటూ ధీమా వ్యక్తం చేశాడు. చాలామందికి కోహ్లి ఉన్నాడంటే నిద్రపట్టకపోవచ్చు. నాకైతే అటువంటి భయం లేదు. హ్యాపీగా నిద్రపోతా. కోహ్లిని ఔట్ చేయడానికి నాకు ఒక్క బాల్ చాలు. అతనిపై పైచేయి సాధించడమే నాకు తెలిసిన విషయం. కోహ్లి వంటి దూకుడుగల ప్లేయర్‌కు సరైన పోటీ ఇవ్వకపోతే అప్పుడు అతని నుంచి భారీ స్కోర్లు వస్తాయి. నేను కోహ్లికి గట్టి పోటీ ఇవ్వడానికే సమాయత్తమవుతా అని కెస్రిక్ విలియమ్స్ తెలిపాడు. ఏడాది క్రితం విండీస్‌తో జరిగిన టీ20 సీరీస్‌లో ఆ జట్టు పేసర్ కెస్రిక్ బౌలింగ్‌లో సిక్సర్ బాదాక విరాట్ కోహ్లి.. నోట్‌బుక్‌లో టిక్ పెడుతున్నట్టుగా సంబరాలు జరుపుకోవడం అందరిలోనూ ఆసక్తిని రేపింది. నిజానికది కెస్రిక్ విలియమ్స్ ట్రేడ్‌మార్క్ శైలి. 2017 విండీస్ పర్యటనలో కోహ్లిని ఔట్ చేసిన తర్వాత కెస్రిక్ విలియమ్స్ ఇదే తరహాలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీన్ని బాగా గుర్తుపెట్టుకున్న కోహ్లి.. గతేడాది భారత పర్యటనకు విండీస్ వచ్చిన సమయంలో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20ల్లో ధీటుగా బదులిచ్చాడు. ఆ మ్యాచ్‌లో విలియమ్స్ బౌలింగ్‌ను టార్గెట్ చేసి మరి ఆడిన విరాట్.. అతని తలపై నుంచి నేరుగా ఓ బంతిని బౌండరీకి తరలించాడు. ఆ వెంటనే లాంగాన్‌లో కళ్లు చెదిరే సిక్స్ కొట్టి అదే నోట్ బుక్ స్టైల్‌తో సంబరాలు జరుపుకున్నాడు. అయితే ఐపీఎల్ 2020 వేలంలో విలియమ్స్‌ని ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో వీరిద్దరి మధ్య పోటీని తిలకించాలంటే కాస్త సమయం పట్టేటట్టుంది. విండీస్‌తో భారత్ మళ్లీ ఆడేంతవరకు కోహ్లీ, క్రెసిక్ విలియమ్స్ మధ్య పోటీకోసం ఎదురుచూడవలసి ఉంటుంది. అయితే ఎప్పుడు తలపడినా సరే కోహ్లీని ఔట్ చేయడానికి తనకు ఒక్క బంతి చాలంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు విలియమ్స్. కోహ్లీకి బౌలింగ్ వేసే క్షణం కోసం నేను కచ్చితంగా ఎదురు చూస్తుంటాను. నన్ను ఎప్పుడు చూసినా సరే విలియమ్స్‌ని బీట్ చేయడానికే వెళుతున్నా అని కోహ్లీ అనవచ్చు. కానీ చిట్టచివరికి తేలేది ఏమిటంటే,, క్రికెట్ అంటే క్రికెట్టే. ఈ దిగ్గజ ప్లేయర్‌ని ఔట్ చేయడానికి ఒక్కటంటే ఒక్క బంతి చాలు. అలాంటి బంతిని మళ్లీ అతడికి సంధిస్తాను అంటూ బీరాలు పోయాడు క్రెసిక్. క్రికెటర్‌గా మంచి పోటీలో పాల్గొనాలనే ఉంటుంది. కోహ్లీ లాంటి దూకుడు ఆటగాడితో తలపడటం కంటే మించింది ఏముంటుంది? ఒక ఫాస్ట్ బౌలర్‌గా నా శక్తిసామర్థ్యాలన్నింటినీ ప్రదర్శించి కోహ్లీని అడ్డుకోవడానికే చూస్తాను అని క్రెసిక్ ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు.

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
5 hours ago

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
7 hours ago

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
13-04-2021

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
12-04-2021

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను
12-04-2021

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!
12-04-2021

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
11-04-2021

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
11-04-2021

IPL 2021: అతడే మా తురుపుముక్క.. హర్షల్‌పై కోహ్లీ ప్రశంసలు
11-04-2021

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
10-04-2021
ఇంకా