newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కోహ్లీ అంటే చాలా గౌరవం.. కానీ భయపడను.. పాక్‌ యువపేసర్‌ షా

03-06-202003-06-2020 08:25:54 IST
Updated On 03-06-2020 09:35:24 ISTUpdated On 03-06-20202020-06-03T02:55:54.007Z03-06-2020 2020-06-03T02:55:52.361Z - 2020-06-03T04:05:24.571Z - 03-06-2020

కోహ్లీ అంటే చాలా గౌరవం.. కానీ భయపడను.. పాక్‌ యువపేసర్‌ షా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మైదానంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని పాకిస్థాన్‌ టీనేజ్‌ పేసర్‌ నసీమ్‌ షా అన్నాడు. ‘భారత్‌-పాక్‌ పోరు ఎప్పటికీ ప్రత్యేకమే. ఆ ఒక్క మ్యాచ్‌తో ఆటగాళ్లు హీరోలైనా, జీరోలైనా అవుతారు. భారత్‌పై ఆడే అవకాశమొస్తే నా దేశ అభిమానులు నిరాశ చెందేలా మాత్రం అస్సలు బౌలింగ్‌ చేయను. ఇక.. విరాట్‌ కోహ్లీ అంటే నాకు చాలా గౌరవం. కానీ, అతనికి బౌలింగ్‌ చేసేందుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడను. కచ్చితంగా అవుట్‌ చేసేందుకు ప్రయత్నిస్తా’ అని పాక్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 17 ఏళ్ల నసీమ్‌ పేర్కొన్నాడు. 

గతేడాది ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నసీమ్‌.. ఆ సిరీస్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా గుర్తిస్తుంటారు. అందుకే భారత కెప్టెన్‌తో తలపడటానికి పాకిస్తాన్ యువ పేసర్ నసీమ్ షా ఆత్రుతతో ఎదురుచూస్తున్నాడు. 2020 ఫిబ్రవరి 10న ఈ పాక్ టీనేజర్ ప్రపంచ రికార్డును సృష్టించాడు. రావల్పిండిలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా హ్యాట్రిక్ సాదించిన షా.. టెస్టు క్రికెట్ చరిత్రలో 16 సంవత్సరాల 359 రోజుల వయసులో హ్యాట్రిక్ తీసిన యువ బౌలర్‌గా చరిత్రెకెక్కాడు. ఇప్పుడు తన కెరీర్‌లో అతి పెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి షా ఎదురుచూస్తున్నాడు. ఆ సవాళ్లలో విరాట్ కోహ్లీ ఒకరు కావడం విశేషం.

పాకిస్తాన్ వెబ్ సైట్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో షా తన కెరీర్‌ గురించి పేర్కొన్నాడు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పటికైనా ప్రత్యేకమే. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచుల్లో అడేవారు ఒక్క రాత్రిలోనే హీరోలుగానూ, విలన్లుగానూ మారుతుంటారని షా చెప్పాడు. అయితే ఈ రెండు దేశాల మధ్య అరుదుగా మాత్రమే మ్యాచ్‌లు జరుగుతున్నాయని, బారత్‌తో తలపడే అవకాశం ఎప్పుడొచ్చినా దానికి తాను సిద్ధంగా ఉన్నానని షా చెప్పాడు.

భారత్‌తో పాకిస్తాన్ మ్యాచ్‌లు ఆడితే తాను సమర్థవంతంగానే బౌలింగ్ చేయగలననే నమ్మకం ఉందని, ఈ విషయంలో పాక్ అభిమానులను తలదించుకునేలా చేయనని షా హామీ ఇచ్చాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ అటగాడికి బౌలింగ్ చేయడం అంటే నిజంగానే సవాల్ అని, కానీ అక్కడినుంచి అసలు గేమ్ ప్రారంభమౌతుందని, అందుకే కోహ్లీతో, టీమిండియాతో తలపడే అవకాశం ఎప్పుడొచ్చినా సరే తాను సిద్ధంగా ఉన్నానని షా తెలిపాడు.

పాకిస్తాన్ నుంచి హ్యాట్రిక్ సాధించిన నాలుగో బౌలర్‌గా షా చరిత్ర సాధించాడు. మహమ్మద్ సమీ, అబ్దుల్ రజాక్, వసీమ్ అక్రమ్ తర్వాత స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్ తన కెరీర్‌లో రెండు సార్లు హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle