newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

కోహ్లీలాంటి నిబద్ద క్రికెటర్‌ను ఎక్కడా చూడలేదు.. బ్యాటింగ్ కోచ్ రాధోర్

29-06-202029-06-2020 12:26:50 IST
Updated On 29-06-2020 13:47:08 ISTUpdated On 29-06-20202020-06-29T06:56:50.607Z29-06-2020 2020-06-29T06:56:46.611Z - 2020-06-29T08:17:08.752Z - 29-06-2020

కోహ్లీలాంటి నిబద్ద క్రికెటర్‌ను ఎక్కడా చూడలేదు.. బ్యాటింగ్ కోచ్ రాధోర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత క్రికెట్‌ శకంలో సచిన్‌ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగానిగా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. తన దూకుడైన ఆటతీరుతో ఎన్నో ఇన్నింగ్స్‌లు గెలిపించిన కోహ్లికి రెండో ఇన్నింగ్స్‌ మాట వినగానే పూనకం వచ్చేస్తుంది. అతను చేసిన సెంచరీల్లో ఎక్కువభాగం రెండో ఇన్నింగ్స్‌లో వచ్చినవే. ఒక ఆటగాడిగానే గాక టీమిండియా కెప్టెన్‌గాను సమర్థవంతంగా తన పాత్రను పోషిస్తున్నాడు. 

పరిస్థితులకు తగ్గట్టుగా ఒక్కోసారి దూకుడుగా, కొన్నిసార్లు డిఫెన్స్‌ మోడ్‌ ఆడే కోహ్లి మైదానంలో ఉన్నప్పుడు అక్కడి వాతావరణాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంటాడు. తాజాగా టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోర్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌ చాటింగ్‌లో మాట్లాడుతూ కోహ్లి సక్సెస్‌కు గల కారణాలను పంచుకున్నాడు. అదేంటో అతని మాటల్లోనే విందాం..

కోహ్లి ఏ మ్యాచ్‌నైనా నిజాయితీగా ఆడటానికే ప్రాధాన్యతనిస్తాడు. ప్రపంచంలోనే బెస్ట్‌ ప్లేయర్‌గా నిలవాలనే తాపత్రయంతో చాలా కష్టపడుతుంటాడు. ఆ నిబద్ధతే ఈరోజు కోహ్లిని ఉన్నత స్థానంలో నిలిపింది. ఒక్కసారి మైదానంలోకి దిగాడంటే ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదని భావించే కోహ్లి బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడటానికే ప్రయత్నిస్తాడు. 

అన్నింటికంటే  కోహ్లికున్న అనుకూలతలే అతని అతిపెద్ద బలం అని ఎప్పటికి నమ్ముతా. అతను ఎప్పుడు ఒకే డైమన్షన్‌ ఆటతీరును ప్రదర్శించడు. పరిస్థితులను బట్టి మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చివేస్తాడు. ఫార్మాట్‌కు తగ్గట్టుగా ఆటశైలిని మార్చుకుంటాడు. అందుకు ఉదాహరణ.. ఐపీఎల్‌ 2016.. ఈ సీజన్‌లో కోహ్లి నాలుగు సెంచరీలు బాదాడు.. అందులో 40 సిక్సర్లు ఉన్నాయి. 

అంత దూకుడుగా ఆడిన కోహ్లి ఐపీఎల్‌ తర్వాత జరిగిన విండీస్‌ సిరీస్‌లో మాత్రం తన దూకుడైన ఆటతీరును ప్రదర్శించకుండానే అక్కడ ఆడిన మొదటి మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో మెరిశాడు. అందుకే కోహ్లి ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్లలో ఒకడిగా నిలిచాడు.' అంటూ రాథోర్‌ ప్రశంసలు కురిపించాడు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle