కోహ్లీని పొగడటంలో వరుసకడుతున్న పాక్ క్రికెటర్లు
14-06-202014-06-2020 10:51:54 IST
Updated On 14-06-2020 11:04:57 ISTUpdated On 14-06-20202020-06-14T05:21:54.598Z14-06-2020 2020-06-14T05:20:27.857Z - 2020-06-14T05:34:57.917Z - 14-06-2020

పాకిస్తాన్ క్రికెట్లో ఇప్పుడు సరికొత్త భజన మొదలైంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎందుకు ప్రపంచంలోనే అతి గొప్ప కేప్టెన్ అయ్యాడు అంటూ పాక్ పాతతరం క్రికెటర్లు, కొత్తతరం క్రికెటర్లు వరుస విశ్లేషణలకు దిగుతుడటం కాస్త ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రస్తుత శకంలో కోహ్లినే గ్రేట్ ప్లేయర్ అంటూ పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసిస్తే.. కవర్ డ్రైవ్ షాట్లలో కోహ్లిని మించిన మరో బ్యాట్స్‌మన్ ఉండడని పాక్ వన్డే కెప్టెన్ బాబర్ అజామ్ కొనియాడాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అమీర్ సొహైల్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత క్రికెట్ శకంలో కోహ్లినే గ్రేట్ ప్లేయర్ అంటూ కొనియాడాడు. విరాట్ కోహ్లి ఆట ఎప్పుడూ చూడమచ్చటగా ఉంటుందని, అతను చూపరులను ఇట్టే ఆకర్షిస్తాడని ప్రశంసించాడు. తమ శకంలో తమ దిగ్గజ ఆటగాడు జావెద్ మియాందాద్ ఆట ఎంత ఆకర్షణీయంగా ఉండేదో అదే తరహా ఆట కోహ్లిలో ఉందంటూ పోల్చాడు. తన యూట్యూబ్ చానలె్లో మాట్లాడిన అమీర్ సొహైల్.. జావెద్ మియాందాద్‌కు కోహ్లికి చాలా దగ్గర పోలికలున్నాయన్నాడు. ప్రపంచ క్రికెట్లో వీరిద్దరూ పెద్ద ఆటగాళ్లైనా వ్యక్తిగతంగా మాత్రమే సక్సెస్ ఎక్కువగా అయ్యారన్నాడు. ఓవరాల్‌గా చూస్తే జట్టుకు మాత్రం వీరి ప్రదర్శన పూర్తి స్థాయిలో ఉపయోగపడలేదన్నాడు. ప్రధానంగా మియాందాద్, కోహ్లిలు మేజర్ టోర్నీల్లో విఫలమైన సందర్భాన్ని సొహైల్ పరోక్షంగా ప్రస్తావించాడు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్ర గురించి, గొప్పదనం గురించి చెప్పాలంటే తొలుత వినిపించే పేరు మియాందాద్దేనని అభిప్రాయపడ్డాడు. మియాందాద్ తన ఆట తీరుతో పాకిస్తాన్ క్రికెట్‌ను ఉన్నత శిఖరంలో నిలబెట్టాడనేది కాదనలేని వాస్తవమన్నాడు. దీనిలో భాగంగా అతనితో ఆడిన సందర్భాల్ని సొహైల్ గుర్తు చేసుకున్నాడు. మియాందాద్‌తో కలిసి ఎన్నో భాగస్వామ్యాల్లో పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. అతని నుంచి చాలా విషయాలను నేర్చుకోవడమే కాకుండా ఎంతో స్ఫూర్తి పొందానని సొహైల్ తెలిపాడు. అలానే కోహ్లి ద్వారా అనేక మంది యువ క్రికెటర్లు స్పూర్తి పొందుతున్నారన్నాడు. ఇప్పటికే గ్రేట్ ప్లేయర్ ట్యాగ్‌ను సంపాదించుకున్న కోహ్లి ఎంతో మందికి ఆదర్శమన్నాడు.అయితే కోహ్లి ఎలా గ్రేట్ ప్లేయర్ అయ్యాడనే విషయాన్ని కూడా సొహైల్ విశ్లేషించాడు. కోహ్లిలో దూకుడు, బ్యాటింగ్‌లో ఆకట్టుకునే నైజం జట్టులో భాగమైపోయాయన్నాడు. ఆటే జీవితం అనే విషయాన్ని కోహ్లి తొందరగా తెలుసుకున్నాడు కాబట్టి ఆ గేమ్ అతన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టిందన్నాడు. సాధ్యమైనంతవరకూ ప్రొఫెషనల్ కెరీర్‌ను వ్యక్తిగత జీవితాన్ని దూరంగా ఉంచుతాడు కాబట్టే కోహ్లి గ్రేట్ ప్లేయర్‌గా ఎదిగాడన్నాడు. కోహ్లీలా ఆడాలి. రికార్డులు సృష్టించాలి.. పాక్ వన్డే కెప్టెన్ బాబర్ అజామ్ టీమిండియా సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ అజామ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కవర్ డ్రైవ్ షాట్లలో కోహ్లిని మించిన మరో బ్యాట్స్‌మన్ ఉండడని ప్రశంసించాడు. హర్ష బోగ్లే హోస్ట్‌గా క్రిక్ బజ్ నిర్వహించిన లైవ్ షోలో పాల్గొన్న అజామ్ కోహ్లిని ఆకాశానికి ఎత్తాడు. ‘ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒకరు. అతనితో పోల్చి చూసుకుంటే నేను చాలా వెనకబడి ఉన్నాను. నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి. నేను పాకిస్తాన్ తరుపున కోహ్లిలా ఆడాలి.. మ్యాచ్‌లను గెలిపించాలి.. రికార్డులను సృష్టించాలి’ అంటూ బాబర్ పేర్కొన్నాడు. ‘ఓపెనర్‌గా బరిలోకి దిగితే చివరి బంతి ఆడేవరకు ప్రయత్నం చేయాలి. అలా చేస్తే బ్యాటింగ్‌లో అన్ని దశలను చూస్తావు. అంతేకాకుండా చివరి బంతి వరకు ఆడితే పరుగులు సాధించడమే కాకుండా జట్టుకు కూడా అవసరమైన మంచి స్కోర్‌ను అందిస్తావు, సహచర బ్యాట్స్‌మన్‌కు సహకారం అందిస్తావు’ అని తన కోచ్ తరుచూ పేర్కొనేవాడని, దాని అర్థం ఇప్పుడిప్పుడే అర్థం అవుతందని బాబర్ వివరించాడు. ఇక అండర్-19 సమయంలో తొలిసారి రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయాబ్ అక్తర్‌ను కలిశానని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో అతడి బౌలింగ్‌ను కూడా ఎదుర్కొన్నానని, అది మర్చిపోలేని అనుభూతి అని పేర్కొన్నాడు. ఇక బాబర్ అజామ్‌ను పాకిస్తాన్ కోహ్లి అని అక్కడి అభిమానులు పిలిచే విషయం తెలిసిందే. కేవలం అభిమానులే కాకుండా తాజా, మాజీ క్రికెటర్లు సైతం కోహ్లితో ఈ బ్యాట్స్‌మన్‌ను పోల్చడం విశేషం.

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
5 hours ago

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
7 hours ago

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
13-04-2021

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
12-04-2021

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను
12-04-2021

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!
12-04-2021

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
11-04-2021

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
11-04-2021

IPL 2021: అతడే మా తురుపుముక్క.. హర్షల్‌పై కోహ్లీ ప్రశంసలు
11-04-2021

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
10-04-2021
ఇంకా