newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కోహ్లీని జట్టులోంచి తీసేశారు.. ఇందుకా..!

24-05-202024-05-2020 09:16:30 IST
2020-05-24T03:46:30.072Z24-05-2020 2020-05-24T03:46:28.270Z - - 12-04-2021

కోహ్లీని జట్టులోంచి తీసేశారు.. ఇందుకా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సమీప భవిష్యత్తులో కూడా కోహ్లీ సరసన నిలబడే స్థాయి కలిగిన క్రికెటర్ ప్రపంచ క్రికెట్‌లోనే లేడని అందరూ అంగీకరిస్తున్న వేళ... కోహ్లీకి అంత సీన్ లేదని చెప్పి కోహ్లీ అభిమానులనే కాకుండా, భారత్ క్రికెట్ అభిమానులను కూడా నిర్ఘాంతపరిచాడు ఒక ఆసీస్ మాజీ స్పిన్నర్. తాను ఎంపిక చేసిన వరల్డ్‌ ఎలెవన్‌ జట్టులో కోహ్లి చాన్స్‌ లేదని చెప్పేశాడు. దీనికి బలమైన కారణం కూడా చూపించాడతను. గత 15 టెస్టుల్లో కోహ్లీ 31 పరుగులను నాలుగు సార్లు మాత్రమే సాధించాడని, తన ఫామ్ అలా ఉంటే తాను ఎంపిక చేసిన జట్టులో ఎలా స్థానం కల్పిస్తానని ఎదురు ప్రశ్నంచాడు ఆ ఆసిస్ మాజీ స్పిన్నర్. ఇప్పుడీ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది.

వాస్తవానికి అంతర్జాతీయ క్రికెట్‌లో గతం సచిన్‌ టెండూల‍్కర్‌ది అయితే, ప్రస్తుత శకం విరాట్‌ కోహ్లిది. ఇది కాదనలేని వాస్తవం. కోహ్లి ఇప్పటివరకూ సాధించిన గణాంకాలే అతను ఎంత విలువైన ఆటగాడో తెలియజేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో కూడా కోహ్లి లేని భారత జట్టును ఊహించడం చాలా కష్టం. ఏ దిగ్గజ క్రికెటర్లు తమ ఫేవరెట్‌ జట్లను ప్రకటించినా అందులో కోహ్లికి స్థానం ఖాయం. కానీ తన వరల్డ్‌ ఎలెవన్‌ జట్టులో కోహ్లి చాన్స్‌ లేదంటున్నాడు ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌. ఇక్కడ నలుగురు భారత క్రికెటర్లకు చోటిచ్చి అందులో కోహ్లిని ఎంపిక చేయలేదంటే ఇంకా చిత్రంగా ఉంది. 

తాజాగా హాగ్‌ ప్రకటించిన తన వరల్డ్‌ టెస్టు ఎలెవన్‌ జట్టులో కోహ్లికి చోటివ్వలేదు. రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌లను ఎంపిక చేసిన హాగ్‌.. అజింక్యా రహానే, మహ్మద్‌ షమీలకు అవకాశం కల్పించాడు. ఓపెనర్లగా మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌లను తీసుకున్న హాగ్.. మిడిల్‌ ఆర్డర్‌లో రహానేకు చాన్స్‌ ఇచ్చాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో భారత్‌ నుంచి షమీకి చోటిచ్చాడు. ఆసీస్‌ నుంచి నలుగురి క్రికెటర్లను ఎంపిక చేసుకున్నాడు. అందులో లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, ప్యాట్‌ కమిన్స్‌, నాధన్‌ లయాన్‌లు తీసుకున్నాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌ నుంచి బాబర్‌ అజామ్‌కు అవకాశం ఇవ్వగా, దక్షిణాఫ్రికా నుంచి డీకాక్‌ను ఎంపిక చేశాడు. న్యూజిలాండ్‌ నుంచి నీల్‌ వాగ్నర్‌ను తీసుకున్నాడు. 

అసలు కోహ్లిని తన జట్టులోకి ఎందుకు తీసుకోలేదనే దానిపై హాగ్‌ వివరణ ఇచ్చాడు. ‘కోహ్లిని తన వరల్డ్‌ ఎలెవన్‌ టెస్టు జట్టులో తీసుకోలేకపోవడంపై ప్రతీ ఒక‍్కరూ ప్రశ్నించే అవకాశం ఉంది. కోహ్లి గత 15 టెస్టు ఇన్నింగ్స్‌ చూడండి. కేవలం నాలుగుసార్లు మాత్రమే 31 పరుగులు మించి చేశాడు. ప్రస్తుత కోహ్లి ఫామ్‌ను దృష్టిలో పెట్టుకునే నా జట్టులో చోటు కల్పించలేదు. మయాంక్‌ కవర్‌ డ్రైవ్స్‌ అంటే నాకు ఇష్టం. ఫ్రంట్‌ ఫుట్‌లో మయాంక్‌ ఆడే షాట్స్‌ కూడా బాగుంటాయి. చాలా నిలకడైన క్రికెటర్‌. రోహిత్‌ శర్మను ఎంపిక చేయడానికి చాలా ఆలోచించా. భారత్‌లో టెస్టు క్రికెట్‌లో రోహిత్‌ సుమారు 90పైగా సగటు కల్గి ఉన్నాడు. అందుచేత రోహిత్‌కు నా తుది జట్టులో చోటు దక్కింది. ఆఫ్‌ సైడ్‌, లెగ్‌ సైడ్‌లలో రోహిత్‌ కచ్చితమైన షాట్లు ఆడతాడు’ అని హాగ్‌ తెలిపాడు.

ఆసీస్ తరపున 7 టెస్టులు, 123 వన్డేలు, 15 ట్వంటీ20లు ఆడిన హాగ్ వరుసగా 17, 156, 7 వికెట్లు తీసి రిటైరయ్యాడు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle