newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కోహ్లీని ఆర్సీబీ ఏనాడూ లెక్కపెట్టలేదు.. కప్పు ఎలా గెలుస్తాడు.. చోప్రా ధ్వజం

12-07-202012-07-2020 06:43:51 IST
2020-07-12T01:13:51.261Z12-07-2020 2020-07-12T01:13:48.599Z - - 17-04-2021

కోహ్లీని ఆర్సీబీ ఏనాడూ లెక్కపెట్టలేదు.. కప్పు ఎలా గెలుస్తాడు.. చోప్రా ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమ కెప్టెన్ విరాట్ కోహ్లీ కాళ్లూ చేతులు కట్టేసినందుకే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిందా? మహేంద్రసింగ్ ధోనీకి, రోహిత్ శర్మకు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల యాజమాన్యం పూర్తి స్వేచ్చను ఇచ్చినట్లుగా విరాట్ కోహ్లీకి ఆర్సీబీ యాజమాన్యం కూడా స్వేచ్ఛ ఇచ్చి ఉంటే జట్టు రాత మారి ఉండేదా.. అవునని ఢంకా భజాయించి చెబుతున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. పైగా జ‌ట్టు మేనేజ్‌మెంట్, టీంలోని ఆట‌గాళ్లు అత‌నికి స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతోనే ఐపీఎల్ కెప్టెన్‌గా కోహ్లి విఫ‌ల‌మ‌య్యాడ‌ని

టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ఎంత విజ‌య‌వంత‌మైన నాయ‌కుడ‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. కానీ ఐపీఎల్‌కు వ‌చ్చేస‌రికి మాత్రం కోహ్లి  కెప్టెన్‌గా తేలిపోతాడ‌నేది ఎన్నోసార్లు రుజువైంది. ఎందుకంటే  కోహ్లి రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్‌గా ఎంపికైన త‌ర్వాత ఒక్క‌సారి కూడా ఆ జ‌ట్టు క‌ప్పు గెల‌వ‌లేదు. అయితే ఇది కోహ్లి త‌ప్పు కాద‌ని.. జ‌ట్టు మేనేజ్‌మెంట్, టీంలోని ఆట‌గాళ్లు అత‌నికి స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతోనే కెప్టెన్‌గా కోహ్లి విఫ‌ల‌మ‌య్యాడ‌ని మాజీ క్రికెట‌ర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఆకాశ్ చోప్రా త‌న యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. 

'ఆర్‌సీబీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడానికి జట్టు మేనేజ్‌మెంటే కారణం. జ‌ట్టు కెప్టెన్‌గా ఉన్న‌ కోహ్లీ సలహాలను, సూచనలను జట్టు యాజమాన్యం పట్టించుకోదు. కనీసం ఆటగాళ్ల ఎంపికలో కూడా కోహ్లీ నిర్ణయాలకు విలువివ్వదు.  ఉదాహ‌ర‌ణ‌కు చైన్నై సూప‌ర్‌కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న ఎంఎస్ ధోని విజ‌య‌వంత‌మైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకోవ‌డానికి జ‌ట్టు మేనేజ్‌మెంట్‌తో పాటు జ‌ట్టులోని ఆట‌గాళ్లు స‌హ‌క‌రించ‌డమే కార‌ణం. కానీ కోహ్లి విష‌యంలో అలా జ‌ర‌గ‌లేదు.

అయితే జ‌ట్టుగా ఆర్‌సీబీ కూడా  ఏనాడు గొప్ప ప్రదర్శనలు చేయలేదు. ఒకటి, రెండేళ్లు కాదు.. ఎన్నో సీజన్లుగా ఇదే తీరు కొనసాగుతోంది. దీనికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా జట్టు ఎంపికలో సరైన ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం.. ప్రతి సీజన్‌లో ఆర్‌సీబీ జట్టులో ఏదో లోటు కనపడుతూనే ఉంటుంది. జట్టులో సరైన ఫాస్ట్ బౌలర్లు ఉండరు. 5, 6 స్థానాల్లో పటిష్ఠమైన బ్యాటింగ్ లైనప్ లేకపోవడం.ఇలా అనేక సమస్యలు ఆర్సీబీలో కనపడతాయి. ఈ సమస్యలపై ఆ జట్టు యాజమాన్యం ఎప్పుడూ దృష్టి సారించదు. దీనిపై కోహ్లీ నిర్ణయాలను కూడా యాజమాన్యం పరిగణలోకి తీసుకుంటుందని నేననుకోవడం లేదు. అందుకే కోహ్లి ఐపీఎల్‌లో ఓ ఫెయిల్యూర్ కెప్టెన్‌గా మిగిలిపోయాడు ' అంటూ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.

యాజమాన్యం జట్టును సరైనవిధంగా ఎంపిక చేసుకోలేకపోతే కెప్టెన్ నుంచి అద్భుతాలు ఆశించవద్దని చోప్రా అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్ల వేలం సమయంలో కోహ్లీ కూర్చుని ఆర్సీబీకి సలహా ఇవ్వలేడని, కెప్టెన్‌గా తనను స్వతంత్రంగా పనిచేయించినప్పుడు మాత్రమే ఎవరినుంచయినా ఫలితాలు ఆశించవచ్చని, ఈ విషయంలో ఆర్సీబీ ఏ సీజన్ లోనూ సరైన రీతిలో వ్యవహరించలేదని చోప్రా చెప్పాడు. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌కు తనక్కావలసిన ఆటగాళ్లకు సంబందించి నలుగురు పేర్లను యాజమాన్యానికి అందించే ఎంపిక చేసుకునేవాడని అలాంటి అవకాశమే కోహ్లీకి లేకుండా చశారని చోప్రా పేర్కొన్నారు.

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

   13 hours ago


IPL 2021: కింద మీద పడి  గెలిచిన రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   15-04-2021


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   15-04-2021


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15-04-2021


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   15-04-2021


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   15-04-2021


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   15-04-2021


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   15-04-2021


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle