newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

కోహ్లీకి సమానంగా సింధు

09-02-201909-02-2019 11:50:54 IST
2019-02-09T06:20:54.244Z09-02-2019 2019-02-09T06:20:50.982Z - - 21-08-2019

కోహ్లీకి సమానంగా సింధు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో క్రికెట్‌కి ఎప్పటినుంచో తిరుగులేని క్రేజ్ ఉంది. ఎన్నో క్రీడలు ఉన్నా... అవేవీ క్రికెట్‌కి సమానంగా సరితూగడం లేదు. అందుకే... క్రికెటర్లతోనే భారీ స్థాయిలో వాణిజ్య సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకుంటుంటాయి. ఇతర క్రీడాకారులతోనూ డీల్స్ ఉంటాయి కానీ... క్రికెటర్లతో పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ... తొలిసారి షట్లర్ పివి సింధు ఆ తేడాల్ని చెరిపేసింది. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సమాన స్థాయిలో ఓ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది.

చైనాకు చెందిన క్రీడా పరికరాల సంస్థ ‘లి నింగ్‌’ ఆమెతో నాలుగేళ్లకు రూ.50 కోట్లతో ఓ కాంట్రాక్ట్ రాయించుకుంది. ప్రపంచంలో ఒక షట్లర్‌ కుదుర్చుకున్న అతి పెద్ద వాణిజ్య ఒప్పందాల్లో ఇది ఒకటి. 8 ఏళ్ల కాలానికి కోహ్లీ ఒక సంస్థతో రూ.100 కోట్ల డీల్ కుదుర్చుకుంటే... సింధు నాలుగేళ్ల కాలానికి ఒప్పందం కింద రూ.50 కోట్లు దక్కించుకోవడం విశేషం! ఈ లెక్కన కోహ్లి, సింధు ఇద్దరూ ఏడాదికి రూ.12.5 కోట్లు అందుకోబోతున్నారన్నమాట! 2016లో యోనెక్స్‌ సంస్థతో ఏడాదికి రూ.3.5 కోట్ల చొప్పున ఓ ఒప్పందం కుదుర్చుకున్న సింధు... ఇప్పుడు మూడేళ్ళ తర్వాత ఏకంగా రూ.50 కోట్లకు చేరుకోవడం ఆమె ఎదుగుదలకు నిదర్శనం!

2016 రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన నాటి నుంచి పివి సింధుకి దేశవ్యాప్తంగా తిరుగులేని ఆదరణ దక్కింది. ఆ తర్వాత అదే జోరు కొనసాగిస్తూ ఎన్నో అద్భుత విజయాలు సాధించడంతో... ఆమె బ్రాండ్ వాల్యూ అమాంతంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమెతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భారీ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న ఏడో క్రీడాకారిణిగా ఫోర్ట్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్న సింధు... ఇకపై మరిన్ని శిఖరాల్ని అవరోధిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

మరోవైపు... హైదరాబాదీ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌తో ఇదే సంస్థ (లి నింగ్) నాలుగేళ్ళ కాలానికి రూ.35 కోట్లతో ఒప్పందం చేసుకుంది. అలాగే పారుపల్లి కశ్యప్‌కు రెండేళ్లకు రూ.8 కోట్లు, సుమీత్‌ రెడ్డి-మను అత్రి జోడీకి తలో రూ.4 కోట్లు చెల్లించేలా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle