newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

కోహ్లిని విసిగిస్తే... ఫలితం ఇలాగే ఉంటాది

07-12-201907-12-2019 17:50:32 IST
2019-12-07T12:20:32.316Z07-12-2019 2019-12-07T12:20:27.708Z - - 11-08-2020

కోహ్లిని విసిగిస్తే... ఫలితం ఇలాగే ఉంటాది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఔట్ చేయడానికి విండీస్ వీరులు చాలా రకాలుగా ప్రయత్నించారు. అయినప్పటికి వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. భారత కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ 94 నాటౌట్( 50 బంతుల్లో 6పోర్లు, 6 సిక్సర్లు)  విజృంభించడంతో తొలి టీ20లో భారత్ 208 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. 

208 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా ఆరంభంలోనే రోహిత్ శర్మ (8) వికెట్ చేజార్చుకుంది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆరంభంలో  ఆచితూచి ఆడాడు. తొలి 20 బంతుల్లో 20పరుగులు మాత్రమే చేసిన విరాట్...వెస్టిండీస్ టీమ్ ఎప్పుడైతే అతడిపై కవ్వింపులకి దిగిందో అప్పటి నుంచి గేర్లు మార్చడం మొదలెట్టేశాడు.

విరాట్ ను విసిగించారు....

ఫాస్ట్ బౌలర్ విలియమ్స్ తొలుత వికెట్ల మధ్య పరుగు తీస్తున్న విరాట్ కోహ్లికి అడ్డుపడే ప్రయత్నం చేశాడు. కోహ్లీ నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరుగెత్తుకుంటూ వస్తుండగా.. విలియమ్స్ ఉద్దేశపూర్వకంగానే రెండు సార్లు పిచ్‌‌పై అడ్డంగా పరుగెత్తుతూ విరాట్ కోహ్లీని ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో.. కోహ్లీ స్వయంగా ఫీల్డ్ అంపైర్‌కి పదే పదే ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. కానీ.. విలియమ్స్ తీరు మాత్రం మారలేదు. విలియమ్స్‌కి తోడు.. విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ కూడా కోహ్లీని అసహనానికి గురిచేసే ప్రయత్నం చేశాడు. బౌలింగ్ సమయంలో బంతి విసరబోతూ.. ఆఖరి క్షణంలో నిలిపివేయడం, శ్రేయస్ అయ్యర్ వికెట్ పడగొట్టిన టైమ్‌లో కోహ్లీ వైపు తిరిగి పొలార్డ్ చూపించిన రియాక్షన్‌ అతిగా అనిపించాయి.

నాటి 'టిక్‌'ల లెక్క సరిపోయింది...

2017లో విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టిన విలియమ్స్ జేబులో నుంచి నోట్‌బుక్ తీసి టిక్ మార్క్ చేసి సంబరాలు చేసుకున్నాడు. కాగా తొలి టీ20లో  విలియమ్స్‌ 16వ ఓవర్లో రెండో బంతిని అతని తలపై నుంచి కోహ్లి నేరుగా బౌండరీకి తరలించాడు. ఆ తర్వాతి బంతిని లాంగాన్‌లో కళ్లు చెదిరే సిక్సర్‌‌గా మలిచాడు. సిక్స‌ర్ కొట్టిన త‌ర్వాత కోహ్లి అదే నోట్‌బుక్‌ స్ట‌యిల్‌లో ఆ మూమెంట్‌ను ఎంజాయ్ చేశాడు. జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీసి మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మ్యాచ్‌ అనంతరం విరాట్‌ మాట్లాడుతూ... తొలి అర్థభాగంలో తన బ్యాటింగ్ ను ఎవరూ అనుకరించవద్దని, చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేసినట్లు చెప్పాడు. ఓపెనర్ రాహుల్ పై భారం పడకూడదని 140 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయాలని బావించి తరువాత గేరు మార్చానని తెలిపాడు. ఇక నోట్ బుక్ గురించి వివరిస్తూ గత వెస్టిండీస్‌ పర్యటనలో తనని ఔట్‌ చేసినపుడు విలియమ్స్‌ చేసిన సెలబ్రేషన్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఇలా బదులిచ్చినట్లు వ్యాఖ్యానించాడు. 

Image result for kesrick williamson and kohli notebook


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle