newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్.. సారథి ద్రావిడ్

05-08-202005-08-2020 08:17:34 IST
Updated On 05-08-2020 08:49:14 ISTUpdated On 05-08-20202020-08-05T02:47:34.709Z05-08-2020 2020-08-05T02:46:57.944Z - 2020-08-05T03:19:14.478Z - 05-08-2020

కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్.. సారథి ద్రావిడ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్, టీమిండియా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) ఏర్పాటు చేయనుంది. దేశంలో క్రికెట్‌ పునరుద్ధరణలో భాగంగా రాష్ట్ర సంఘాలకు పంపిన ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌ఓపీ)లో బీసీసీఐ ఈ విషయం పేర్కొంది. ద్రవిడ్‌ నేతృత్వంలో పరిశుభ్రత అధికారి, బీసీసీఐ ఏజీఎం (క్రికెట్‌ ఆపరేషన్స్‌) సభ్యులుగా ఉండే టాస్క్‌ఫోర్స్‌.. ఎన్‌సీఏలో శిక్షణను పర్యవేక్షిస్తుంది.

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్ని స్పష్టంగా, క్రమం తప్పకుండా ఆటగాళ్లకు తెలియజేయడం.. క్రికెటర్లు నిబంధనల్ని కచ్చితంగా పాటించేలా చూడటం టాస్క్‌ఫోర్స్‌ విధులు. ఎన్‌సీఏలో శిక్షణ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు, సహాయక.. పరిపాలన సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.ఎస్‌ఓపీలో పేర్కొన్న నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాల్ని కచ్చితంగా పాటిస్తానంటూ ఎన్‌సీఏకు రాకముందే ఆటగాళ్లు సమ్మతి పత్రాన్ని అందజేయాలని ఎస్‌ఓపీలో బీసీసీఐ పేర్కొంది.

కరోనా మహమ్మారి కారణంగా నాలుగు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆగిపోయిన విషయం తెలిసిందే. మార్చిలో జరగాల్సిన ఐపీఎల్‌-2020 సైతం వాయిదా పడింది. ఆసియా కప్‌, ప్రపంచకప్‌ వాయిదా పడటంతో సెప్టెబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు లీగ్‌ను యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ సమాయత్తమైంది. 

2019-20 దేశవాళీ సీజన్‌ మార్చిలోనే ముగిసింది. సాధారణంగా ఆగస్టులో మళ్లీ మొదలవుతుంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ సారి సీజన్‌ను కుదించే అవకాశం ఉంది. ప్రస్తుతం నిర్వహించే ట్రైనింగ్ క్యాంప్స్‌లో పాల్గొనే ఆటగాళ్లు కరోనా రిస్క్‌ను అంగీకరిస్తూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. 

ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసేవరకు అనారోగ్య సమస్యలు ఉన్నవారు, 60 ఏళ్లకు పైబడిన వ్యక్తులు శిబిరాలకు రాకుండా నిషేధం విధించింది. క్రికెటర్లు ఇంటి నుంచి స్టేడియానికి, అట్నుంచి శిబిరానికి వెళ్లేటప్పుడు కఠిన నియమాలు పాటించాల్సి ఉంటుందని తెలిపింది.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle