newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

కోవిడ్ 19 ఎఫెక్ట్... బంతికి మెరుపులు ఎలా?ఎంఎస్కే ఏమన్నారంటే?

17-05-202017-05-2020 19:35:03 IST
2020-05-17T14:05:03.425Z17-05-2020 2020-05-17T14:04:35.658Z - - 01-06-2020

కోవిడ్ 19 ఎఫెక్ట్... బంతికి మెరుపులు ఎలా?ఎంఎస్కే ఏమన్నారంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. దీని ప్రభావం వల్ల అంతర్జాతీయ క్రికెట్ పోటీలు కూడా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్ వినూత్నంగా నిర్వహిస్తున్న ‘స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ .. ఫీల్డ్ గురించి ఇంటి నుంచి’ అనే షోలో అనేక విషయాలు ప్రస్తావించారు మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కె ప్రసాద్.  మ్యాచ్ లలో ఉపయోగించే బంతి విషయంలో కొన్ని మార్పులు అవసరం అంటున్నారు ప్రసాద్.  బాల్ ట్యాంప‌రింగ్‌ను చ‌ట్టబ‌ద్ధం చేయాల‌నే ప్ర‌తిపాద‌నను ప‌రిశీలిస్తున్నారు. అయితే అంపైర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో బంతిని పాలిష్ చేసేందుకు అనుమ‌తిలిచ్చే యోచ‌న‌లో ఉంది.

ఐపీఎల్ 2020 అసలు ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది అర్థం కాని సందిగ్ధ పరిస్థితి నెలకొంది. కరోనా వేళ బంతి నుంచి స్వింగ్‌ రాబట్టడం కోసం ఉమ్ము (స‌లైవా), చెమట ఉపయోగించడం క్రికెట్లో సర్వసాధారణం. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ దెబ్బతో ఇకపై ఇలా చేయాలంటే భయపడాలి. వైరస్ లక్షణాలున్న వ్యక్తి బంతిపై ఉమ్మితే.. మ్యాచ్‌లో పాల్గొన్న వాళ్లందరికీ కరోనా సోకే అవకాశం ఉంటుంది.  ఈ నేపథ్యంలో మళ్లీ క్రికెట్‌ మొదలయ్యాక బౌలర్లు, ఫీల్డర్లు బంతిని ఈ తరహాలో పాలిష్‌ చేయాలంటే కష్టమే. దీనిపై నిషేధాజ్ఞలు కూడా విధించొచ్చని భావిస్తున్నారు.

కరోనా వైరస్ తగ్గిన అనంతరం క్రికెట్ బాల్ మెరుపు ఎలా మార్చాలనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ ఆడుతున్నప్పుడు క్రికెటర్ల ఆలోచనలు, ప్రవర్తన ఆటతీరులో మార్పులు అవసరం అని కొందరు క్రీడాపండితులు, ఆటగాళ్ళు అభిప్రాయపడుతున్నారు.  మైదానంలో వున్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, ప్రోటోకాల్ ఎలా వుండాలనేదానిపై చర్చ అవసరం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అదేపనిగా మ్యాచ్ లలో ఉమ్మును ఉపయోగించడం ప్రమాదం కావడంతో.. అందుకోసం ఉప్పు కాగితం లాంటివి లేదా లాలాజలం ఉపయోగపడే ద్రావణం లాంటివి అనుమతించవచ్చని అంటున్నారు. 'పరిమిత ఓవర్ల క్రికెట్లో ఉపయోగించే తెల్ల బంతితో వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ.. టెస్టుల్లో మాత్రం దీర్ఘ కాలం ఉమ్ము వాడకుండా బంతి నుంచి స్వింగ్‌ రాబట్టడం కష్టం’’ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలనేదానిపై చర్చ అవసరం అంటున్నారు. 

కోవిడ్ 19 నుంచి బయటపడడం ఇప్పుడు అందరి ముందున్న పెద్ద సవాల్, బాల్ ట్యాంపరింగ్ ఎంత నిషేధమో... కొన్ని పాతపద్ధతులు కూడా పాటించడం అంత శ్రేయస్కరం కాదు. పాట్ జేమ్స్ కమిన్స్ లాంటి ఫాస్ట్ బౌలర్లు కూడా ఈ విధానంపై అభ్యంతరం తెలుపుతున్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ బ్లాగ్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో పాట్ కమిన్స్ బాల్ మెరవడం, స్వింగ్ చేయడంపై మాట్లాడాడు. బంతిని నిరంతరం మెరిసేలా చేయడాన్ని పూర్తిగా నిషేధించడాన్ని తాను సమర్ధించనన్నాడు. దీనికి మరో ప్రత్యామ్నాయం అవసరం. స్టార్ స్పోర్ట్స్ లో ఈ కార్యక్రమం ప్రతి శనివారం రాత్రి 7గంటలకు ప్రసారమవుతోంది. బంతి మెరుపు కోసం లెదర్‌ మాయిశ్చరైజర్, మైనం, షూ పాలిష్‌ కొంత వరకు మెరుగ్గా ఫలితమిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

‘ఖేల్‌రత్న’కు రోహిత్‌ శర్మ పేరు సిఫారసు చేసిన బీసీసీఐ

‘ఖేల్‌రత్న’కు రోహిత్‌ శర్మ పేరు సిఫారసు చేసిన బీసీసీఐ

   10 hours ago


స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్?

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్?

   14 hours ago


అది విషాదాన్ని దాచుకున్న నవ్వు.. ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిపై సంగక్కర వివరణ

అది విషాదాన్ని దాచుకున్న నవ్వు.. ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిపై సంగక్కర వివరణ

   30-05-2020


ఎప్పుడు రిటైర్ అవ్వాలో ధోనీకి బాగా తెలుసు.. కిర్‌స్టన్ సపోర్ట్

ఎప్పుడు రిటైర్ అవ్వాలో ధోనీకి బాగా తెలుసు.. కిర్‌స్టన్ సపోర్ట్

   29-05-2020


ధోనీ సింగిల్స్ తీస్తే భారత్ ఎలా గెలుస్తుంది.. బెన్ స్టోక్స్

ధోనీ సింగిల్స్ తీస్తే భారత్ ఎలా గెలుస్తుంది.. బెన్ స్టోక్స్

   28-05-2020


క్రికెట్ ఫ్యాన్స్‌కి షాక్.. టీ20.. 2022కి వాయిదా

క్రికెట్ ఫ్యాన్స్‌కి షాక్.. టీ20.. 2022కి వాయిదా

   27-05-2020


 క్రికెట్‍‌ ఆటను ఫినిష్ చేసింది ఐసీసీనే.. షోయబ్ తీవ్ర ఆరోపణలు

క్రికెట్‍‌ ఆటను ఫినిష్ చేసింది ఐసీసీనే.. షోయబ్ తీవ్ర ఆరోపణలు

   27-05-2020


హాకీ మాంత్రికుడు, ధ్యాన్‌చంద్‌తో సమానుడు బల్బీర్ సింగ్ ఇకలేరు

హాకీ మాంత్రికుడు, ధ్యాన్‌చంద్‌తో సమానుడు బల్బీర్ సింగ్ ఇకలేరు

   26-05-2020


మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్.. మాయ చేస్తున్న డేవిడ్ వార్నర్

మహేష్ మైండ్ బ్లాక్ సాంగ్.. మాయ చేస్తున్న డేవిడ్ వార్నర్

   26-05-2020


బంతిపై ఉమ్మి వేయడంపై నిషేధం తాత్కాలికమే.. ఐసీసీ చీఫ్ అనిల్ కుంబ్లే వివరణ

బంతిపై ఉమ్మి వేయడంపై నిషేధం తాత్కాలికమే.. ఐసీసీ చీఫ్ అనిల్ కుంబ్లే వివరణ

   25-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle