newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కోచ్‌గా పదవీకాలం సంతృప్తికరం.. ముగింపు మెరుగ్గా ఉంటే బాగుండేది.. కుంబ్లే

24-07-202024-07-2020 08:07:44 IST
2020-07-24T02:37:44.235Z24-07-2020 2020-07-24T02:37:39.840Z - - 15-04-2021

కోచ్‌గా పదవీకాలం సంతృప్తికరం.. ముగింపు మెరుగ్గా ఉంటే బాగుండేది.. కుంబ్లే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్న దిగ్గజ క్రికెటర్లలో అనిల్ కుంబ్లేకే అగ్రస్థానం అని తప్పక చెప్పదు. టీమిండియా జట్టు కెప్టెన్‌గానే కాకుండా ప్రధాన కోచ్‌గా కూడా తనదైన ముద్ర వేసిన కుంబ్లే కోచ్‌గా తన ముగింపు అలా ముగిసి ఉండాల్సింది కాదని, మరింత మెరుగైన స్థితిలో తాను తప్పుకుని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాడు.

తాజాగా జింబాంబ్వే మాజీ క్రికెటర్‌ పొమ్మి మాంగ్వా నిర్వహించిన ఆన్‌లైన్‌ సెషన్‌లో తన కోచ్‌ పదవిపై కుంబ్లే స్పందించారు. టీమిండియాకు ప్రధాన కోచ్‌గా తన పాత్రను సమర్ధవంతంగా నిర్వహించానని, కానీ తన కోచ్‌ పదవిని చివర్లో ఇంకా మెరుగ్గా నిర్వహిస్తే బాగుండేదని తెలిపాడు.

నేను టీమిండియా ప్రధాన కోచ్‌గా పనిచేసిన ఏడాది కాలం మా జట్టు చాలా బాగా ఆడింది. అందులో నా పాత్ర కూడా కొంత ఉండటం సంతోషకరం. కాబట్టి ఎలాంటి ఫిర్యాదులు లేవు. అయితే కోచ్‌గా నా చివరి రోజులు మరింత బాగా ఉండాల్సిందనే విషయం నాకు తెలుసు. కానీ నేను బాధపడటం లేదు.  తప్పుకునేందుకు సరైన సమయమని కోచ్‌కు అనిపిస్తే తప్పుకోవడమే మంచిది. నాకు భారత కోచ్‌గా అవకాశం రావడం, సంవత్సరంపాటు జట్టు ఆటగాళ్లతో గడపడం అద్భుతం. అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి మరోసారి డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకోవడం గొప్ప అనుభూతి అని కుంబ్లే వ్యాఖ్యానించాడు. 

కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో ఆడిన 17 టెస్టులో 1 మాత్రమే ఓడిన భారత్‌... చాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌కు చేరింది. కానీ కెప్టెన్‌ కోహ్లితో విభేదాల కారణంగా కుంబ్లే అర్ధాంతరంగా తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో విభేదాలు కారణంగానే కుంబ్లే తన పదవిని అర్థాంతరంగా వదులుకోవాల్సి వచ్చిందని పలువురు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్‌లో కూడా కుంబ్లే కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు మెంటార్‌గా కుంబ్లే వ్యవహరించాడు. కేవలం కెప్టెన్‌గా, కోచ్‌గా మాత్రమే కాకుండా తన బౌలింగ్‌ నైపుణ్యంతో టీమిండియాకు ఎన్నో చారిత్రాత్మక విజయాలను కుంబ్లే అందించాడు.

కోచ్‌గా తన పనితీరుపై జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి భిన్నాభిప్రాయాలు ఉండటం కారణంగా 2017లో టీమిండియా ప్రధాన కోచ్‌ పదవినుంచి అనిల్ కుంబ్లే అర్థాతరంగా తప్పుకున్నాడు. 2017 జూన్‌లో 50 ఓవర్ల ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అనూహ్యంగా పరాజయం పొందడంతో కుంబ్లే సంవత్సర పదవీకాలం అవమానకరంగా ముగిసిపోయింది. కోహ్లీ విభేదించిన కారణంగానే కుంబ్లే పదవి నుంచి తప్పుకున్నాడని అప్పట్లో వార్తలువచ్చాయి.

2017లో టీమిండియా ప్రధాన కోచ్‌గా పదవికి రాజీనామా చేసిన తర్వాత కుంబ్లే ఐపీఎల్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుకు కోచ్‌గా పనిచేశారు. 

 

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   3 minutes ago


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   an hour ago


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   5 hours ago


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   8 hours ago


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   21 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14-04-2021


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14-04-2021


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle