newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

కొత్త సంచలనం ఠాకూర్‌ తిలక్‌ వర్మ గురించి తెలుసా?

03-12-201903-12-2019 12:50:15 IST
2019-12-03T07:20:15.803Z03-12-2019 2019-12-03T07:20:11.811Z - - 06-12-2019

కొత్త సంచలనం ఠాకూర్‌ తిలక్‌ వర్మ గురించి తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమ్‌ సెలక్షన్‌లో రాజకీయాలు ఎక్కువ అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) నుండి ఓ సాధారణ మధ్య తరగతి కుర్రాడు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడంటే మీరు నమ్ముతారా? కానీ ఇది జరిగింది. హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ ఠాకూర్‌ తిలక్‌ వర్మ భారత అండర్‌ - 19 ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికయ్యాడు. టోర్నీలో తిలక్‌  వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌గా దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.  దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 9 నుంచి అండర్‌-19 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నీ జరగనుంది. దాని కోసం బీసీసీఐ భారత కుర్ర జట్టును ప్రకటించింది. 

దేశవాళీల్లో గత కొన్ని రోజులుగా స్థిరంగా రాణిస్తున్న హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ 17 ఏళ్ల తిలక్‌ వర్మకు ఈ జట్టులో చోటు సంపాదించాడు. జనవరిలో ఆంధ్రతో మ్యాచ్‌లో తొలి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడిన తిలక్‌ 6 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు, మూడు టీ20లు ఆడాడు. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌ అయిన తిలక్‌.. ఆఫ్‌ స్పిన్ బౌలింగ్‌ కూడా వేస్తాడు.  హైదరాబాద్‌ క్రికెట్‌ లీగ్స్‌లో భారీ స్కోర్లతో అదరగొట్టాడు.

అయితే ఠాకూర్‌ తిలక్‌వర్మ రెండేళ్ల క్రితం వరకు ఎవరికీ తెలియదు. 2017 హెచ్‌సీఏ లీగ్స్‌లో తొలిసారి తిలక్‌ పేరు వినిపించింది. గంటల తరబడి బ్యాటింగ్‌ చేస్తుండటం.. భారీ పరుగులు తీస్తుండటంతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అలా అండర్‌-16 జట్టుకు ఎంపికయ్యాడు. తొలిసారి అఖిల భారత విజయ్‌ మర్చంట్‌ అండర్‌-16 క్రికెట్‌ టోర్నీలో ఆడాడు. ఈ టోర్నలో తిలక్‌ 690 పరుగులతో రాణించాడు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. 

ఆ తర్వాత ఏడాది మొయినుద్దౌలా గోల్డ్‌కప్‌ టోర్నీ. రంజీ ఛాంపియన్‌తో పోటీకి దిగుతున్న జట్టులో 15 ఏళ్ల కుర్రాడిని ఎంపిక చేస్తారా  అంటూ చాలామంది వ్యతిరేకించారు. అందలో హెచ్‌సీఏ పెద్దలు కూడా ఉన్నారు. అయినా సెలెక్షన్‌ కమిటీ తిలక్‌ను ఎంపిక చేసింది. అనుకున్నట్లే రాణించాడు కూడా. గతేడాది రంజీ ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ 20 ట్రోఫీలో అడుగుపెట్టిన తిలక్‌, ఇటీవల జరిగిన విజయ్‌ హజారే వన్డే టోర్నీలోనూ దిగాడు.

Image result for do you know about new u-19 guy takhur tilak varma

ఇటీవల జరిగిన అండర్‌-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై సెంచరీతో అదరగొట్టాడు. ఆ తర్వాత జరిగిన ఛాలెంజర్‌ ట్రోఫీలో ఇండియా-బి తరఫున ఆడి మెప్పించాడు.  అలా సీనియర్‌, అండర్‌-19 విభాగాల్లో నిలకడగా రాణిస్తూ వచ్చిన తిలక్‌కు ఊహించినట్లే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కింది.

ఠాకూర్‌ తిలక్‌ తండ్రి చిరుద్యోగి. కుమారుడిలో ప్రతిభను చిన్నతనంలోనే గుర్తించిన తల్లిదండ్రులు తిలక్‌ను క్రికెట్‌ వైపు నడిపించారు. అలా  పదేళ్ల వయసులోనే కోచ్‌ సలాం దగ్గర శిక్షణలో చేరాడు. సలాం చాంద్రాయణ గుట్టలో ఉండేవారు. అతని అకాడమీ ఏమో లింగంపల్లిలో ఉండేది. దీంతో తిలక్‌ సలాంతో కలసి రోజూ 80 కిలోమీటర్లు ప్రయాణించేవాడు. ప్రోత్సహించారు. అలా తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్‌ మార్గనిర్దేశనంలో ఠాకూర్‌ ఈ స్థాయికి చేరి.. జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 

Image result for do you know about new u-19 guy takhur tilak varma

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle