newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కొత్త జెర్సీలతో రంగంలోకి దిగిన ముంబై టీమ్

31-08-202031-08-2020 11:56:43 IST
Updated On 31-08-2020 12:22:02 ISTUpdated On 31-08-20202020-08-31T06:26:43.179Z31-08-2020 2020-08-31T06:26:38.589Z - 2020-08-31T06:52:02.177Z - 31-08-2020

కొత్త జెర్సీలతో రంగంలోకి దిగిన ముంబై టీమ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020 కోసం 10 రోజుల క్రితమే అబుదాబికి వెళ్లిన ముంబై ఇండియన్స్‌ ఆదివారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా తమ ఆటగాళ్లకు కొత్త సర్‌ప్రైజ్‌ ఇచ్చింది ముంబై ప్రాంచైజీ. 13వ సీజన్‌ కోసం ముంబై ఆటగాళ్లకు కొత్త జెర్సీలు అందించింది. ఆదివారం ఆ జెర్సీలనే ధరించి ప్రాక్టీస్‌ చేశారు. బ్లూ, ఆరెంజ్‌ రంగుల్లో రూపొందించిన ఆ కొత్త జెర్సీలు ఆటగాళ్లకి మరింత వన్నె తెచ్చాయి.

కొత్త జెర్సీ ఆవిష్కరణను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఒక పాట రూపంలో విడుదల చేసి.. దాన్ని ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. ఇక అభిమానులెవరైనా ఆ జెర్సీలను కొనాలంటే.. ప్రీఆర్డర్‌ బుకింగ్‌ కోసం ఓ లింక్‌ను కూడా పోస్టు చేసింది. కావాలంటే మీరూ బుక్‌ చేసుకోవచ్చు అని కాప్షన్ ఇచ్చింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హర్దీక్‌ పాండ్యా, జస్‌ప్రీత్‌ బూమ్రా కొత్త జెర్సీతో ఉన్న చిత్రాలను ముంబై ఇండియన్స్‌ అధికారిక ట్విట్టర్‌లో పెట్టింది. చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కరోనా వైరస్ నేపథ్యంలో అబుదాబిలో కఠిన నిబంధనల ప్రకారం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముంబై, కోల్‌కతా జట్లు బీసీసీఐని సంప్రదించిచాయి. ఇప్పటికే పలుమార్లు కరోనా పరీక్షలు చేసుకున్న తమకు ప్రాక్టీస్‌ చేసుకునే అనుమతులు ఇప్పించాలని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ను కోరాయి. 

గవర్నింగ్‌ కౌన్సిల్‌, ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు కలిసి స్థానిక అధికారులను సంప్రదించాయి. దీంతో ఆదివారం నుంచి ఆ రెండు జట్లూ ఔట్‌డోర్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముంబై ఆటగాళ్లు ఆదివారం కొత్త జెర్సీలతో సాధన చేశారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ మినహా అన్ని జట్లు సన్నాహాలను ప్రారంభించాయి. ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీజన్‌ కోసం కఠోరంగా శిక్షణ చేస్తున్నాయి. 

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆంక్షల కారణంగా ఎక్కువ మంది భారతీయ ఆటగాళ్లు తమ ఇళ్లకే పరిమితమయిన నేపథ్యంలో తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు తీవ్రంగా సాధన చేస్తున్నారు. ముంబై ఆటగాళ్లు మహేళ జయవర్ధనే నేతృత్వంలోని కోచింగ్‌ సిబ్బంది ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. కిరన్‌ పొలార్డ్‌, క్రిస్‌ లిన్‌ సహా మరికొందరు విదేశీ ఆగగాళ్లు ఆలస్యంగా జట్టుతో కలువనున్నారు.

ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్‌లో నాలుగు సార్లు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ముంబై మొదటిసారి 2013లో టైటిల్‌ను సాధించింది. అనంతరం 2015, 2017, 2019లో టైటిల్‌ విజేతగా నిలువగా అవతరించింది. ఈ నాలుగు ట్రోఫీలు రోహిత్ శర్మ సారథ్యంలోనే సాధించడం విశేషం. ఈ సారి కూడా ట్రోఫీ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.

 

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle