newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కెప్టెన్ రనౌట్‌తో ముగిసిన సన్‌రైజర్స్ 'బౌల్డ్' గేమ్

22-09-202022-09-2020 06:57:09 IST
Updated On 22-09-2020 06:57:03 ISTUpdated On 22-09-20202020-09-22T01:27:09.255Z22-09-2020 2020-09-22T01:25:49.409Z - 2020-09-22T01:27:03.465Z - 22-09-2020

కెప్టెన్ రనౌట్‌తో ముగిసిన సన్‌రైజర్స్ 'బౌల్డ్' గేమ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోటి ఆశలు రేపిన కెప్టెన్ రెండో ఓవర్‌లోనే రనౌట్ అయి అనూహ్యంగా వెనుతిరగడంతో మొదలైన సన్ రైజర్స్ జట్టు పతనం చివరి ఓవర్ దాకా కొనసాగింది. ఐపీఎల్‌-13లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు దెబ్బకు సాధారణ స్కోరును సైతం ఛేదించలేక సన్ రైజర్స్ జట్టు చతికిలబడింది. ఒత్తిడిని జయించలేకపోయిన సన్ రైజర్స్ జట్టు కుప్పగూలితే మరోవైపు చాలా కాలం తర్వాత అదే ఒత్తిడిని జయించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 10 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సునీల్ గవాస్కర్ రెండు రోజుల క్రితం చెప్పినట్లే ఆర్సీబీజట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ తేలిపోగా యజ్వేంద్ర చాహల్ అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పి ఆర్సీబీకి తొలి విజయాన్ని అందించాడు.

దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని జయించిన ఆర్సీబీ 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ తన మ్యాజిక్‌ బౌలింగ్‌తో అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఒకే ఓవర్‌లో వరుస బంతుల్లో బెయిర్‌ స్టో(61) ను బౌల్డ్‌ చేసిన చహల్‌.. ఆ తర్వాత బంతికి విజయ్‌ శంకర్‌(0) బౌల్డ్‌ చేశాడు. 16వ ఓవర్‌లో మూడు, నాలుగు బంతుల్లో చహల్‌ వికెట్లు సాధించి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. బెయిర్‌ స్టో నీట్‌గా ఆడుతున్న సమయంలో చహల్‌ ఇచ్చిన బ్రేక్‌తో ఆర్సీబీలో ఉత్సాహం వచ్చింది. 

అదే సమయంలో సన్‌రైజర్స్‌ ఢీలా పడింది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్‌ శంకర్‌ తొలి బంతికే వికెట్‌ ఇవ్వడం సన్‌రైజర్స్‌ను కష్టాల్లోకి నెట్టింది. అంతకుముందు మనీష్‌ పాండే(34)ను సైతం చహల్‌ ఔట్‌ చేశాడు. చహల్‌ వేసిన స్లో బంతిని హిట్‌ చేయబోయి మనీష్‌ పాండే ఔటయ్యాడు.   ఇక ఐదో వికెట్‌గా ప్రియాం గార్గ్‌(12)ను శివం దూబే ఔట్‌ చేయడంతో ఆర్సీబీ 129 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. కాసేపటికి అభిషేక్‌ శర్మ(7) రనౌట్‌ కావడంతో రైజర్స్‌ తేరుకోలేకపోయింది. 

ప్రియాం గార్గ్‌ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రషీద్‌ ఖాన్‌ ఊపుమీద కనిపించాడు. వచ్చీ రావడంతోనే దూబే బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టాడు. కానీ 17 ఓవర్‌లో పరుగు కోసం యత్నించే క్రమంలో రషీద్‌ ఖాన్‌-అభిషేక్‌ పిచ్‌ మధ్యలో ఢీకొనడంతో ఇద్దరూ కింద పడిపోయారు. దాంతో అప్పటికే కీపర్‌ వద్దకు చేరిన బంతితో అభిషేక్‌ రనౌట్‌ అయ్యాడు. ఫలితంగా రైజర్స్‌ శిబిరంలో ఒత్తిడి మొదలైంది. ఓవరాల్‌గా గెలిచే అవకాశం ఉ‍న్న మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌ చేజార్చుకుంది. చహల్‌ మూడు వికెట్లతో సన్‌రైజర్స్‌ ఓటమిని శాసించాడు. అతనికి జతగా నవదీప్‌ సైనీ రెండు వికెట్లు సాధించాడు. 

18 ఓవర్‌లో భువనేశ్వర్‌ కుమార్‌(0), రషీద్‌ ఖాన్‌(6)లను బౌల్డ్‌ చేశాడు. దూబే వేసిన 19 ఓవర్‌లో మిచెల్‌ మార్ష్‌(0) ఔట్‌ కావడంతో ఎస్‌ఆర్‌హెచ్‌పై మరింత ఒత్తిడి పెరిగింది.  చివరి వికెట్‌గా సందీప్‌ శర్మ(9) ఔట్‌ కావడంతో సన్‌రైజర్స్‌ ఇంకా రెండు బంతులు ఉండగానే ఓటమి పాలైంది. సన్‌రైజర్స్‌ 153 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఐదుగురు సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు బౌల్డ్‌ కావడం గమనార్హం. వార్నర్‌(6) రెండో ఓవర్‌లోనే రనౌట్‌ కావడంతో సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్‌ మూడు వికెట్లు సాధించగా, సైనీ, దూబేలు తలో రెండు వికెట్లు సాధించారు. స్టెయిన్‌కు వికెట్‌ దక్కింది.

భారీ టార్గెట్ కంటే ఆర్సీబీ గెలుపే ఆశ్చర్యకరం

అంతకుముందు ఆర్సీబీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 164 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో  ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది . ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను కేరళ కుర్రాడు దేవదూత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌లు ఆరంభించారు. వీరిద్దరూ దాటిగా ఆడి ఆర్సీబీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా పడిక్కల్‌ దాటిగా బ్యాటింగ్‌ చేసి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా, ఫించ్‌ మాత్రం కాస్త  నెమ్మదిగా ఆడాడు. పడిక్కల్‌ 42 బంతుల్లో 8ఫోర్లతో 56 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఫించ్‌ దూకుడు పెంచే యత్నంలో అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. పడిక్కల్‌ను విజయ్‌శంకర్‌ బౌల్డ్‌ చేసిన స్వల్ప వ్యవధిలోనే ఫించ్‌ కూడా ఔటయ్యాడు. కోహ్లి(14) నిరాశపరచాడు. ఏబీడీ 30 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లతో 51 పరుగులు చేశాడు.  నటదూబే(7) ఆట మరీ పేలవంగా సాగింది ఆర్సీబీ నిర్ణీత 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. 

200 సిక్సుల జాబితాలో డివీలియర్స్

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తరపున ఆడి 200 సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలోకి తాజాగా దక్షిణ ఆఫ్రికా ఆటగాడు ఏబీ డెవిలియర్స్ చేరాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో కేవలం క్రిస్ గేల్ మాత్రమే ఉన్నాడు. గేల్ ఆర్‌సీబీ టీంలో ఉన్నప్పుడు మొత్తం 239 సిక్సులు బాదాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌తో ఏబీ డెవిలియర్స్ కూడా 200 సిక్సులు పూర్తిచేసి ఈ జాబితాలోకి వచ్చేశాడు. ఇక గేల్, డెవిలియర్స్ తర్వాత 190 సిక్సులతో విరాట్ కోహ్లీ 200 సిక్సుల చేరువలో ఉన్నాడు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle