newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కెప్టెన్సీ విషయంలో ధోనికి-కోహ్లీకి తేడాలు ఏమిటో చెప్పిన గంభీర్

14-09-202014-09-2020 19:10:44 IST
2020-09-14T13:40:44.488Z14-09-2020 2020-09-14T13:32:23.009Z - - 19-04-2021

కెప్టెన్సీ విషయంలో ధోనికి-కోహ్లీకి తేడాలు ఏమిటో చెప్పిన గంభీర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ మొదలవ్వడానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఎంతో బలంగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే టోర్నమెంట్ మొదలవుతుందో ఆట తీరు వేరేగా ఉంటుంది. రెండు మూడు సీజన్లు మినహా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గొప్ప ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ఇప్పటి వరకూ టైటిల్ ను కూడా అందుకోలేకపోయింది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. తమ జట్టు గొప్పగా ఉందని.. ఈ సీజన్ లో తప్పకుండా రాణిస్తుందని వెల్లడించాడు. కానీ టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రం వేరే విధంగా చెబుతూ ఉన్నాడు.  

విరాట్‌ కోహ్లికి జట్టు ఎంపిక గురించి పెద్దగా అవగాహన లేదని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. అసలు తన అత్యుత్తమ జట్టు ఎలా ఉండాలో కోహ్లి తెలియని సందర్భాలు చాలానే ఉన్నాయని గతం గురించి గుర్తు చేశాడు. తాను ఆర్సీబీతో హ్యాపీగా ఉన్నానని కోహ్లీ అంటాడు కానీ తుది జట్టులోని పదకొండు మంది ఆటగాళ్ల గురించి ఎప్పుడైనా కసరత్తు చేశాడా అని ప్రశ్నించాడు.  ఆర్సీబీ బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంటే సరిపోతుందనే కోహ్లి ఎప్పుడూ భావిస్తాడని.. అదే ఆ జట్టు కొంప ముంచుతోందని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు గంభీర్.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్‌ ధోని కనీసం ఆరు-ఏడు మ్యాచ్‌ల వరకూ ఆటగాళ్లపై నమ్మకం ఉంచి వారినే కొనసాగిస్తూ ఉంటుందని, కోహ్లి కెప్టెన్సీలోని ఆర్సీబీ మాత్రం చాలా తొందరగా ఆటగాళ్లను మార్చేస్తూ ఉంటుందని చెప్పాడు. సీఎస్‌కే సక్సెస్‌ కావడానికి, ఆర్సీబీ వైఫల్యం చెందడానికి కారణం ఇదేనని గంభీర్‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ మ్యాచ్‌కు క్రికెటర్లను మారుస్తూ ఉంటే వారిలో నిలకడ పోతుందన్నాడు. ఈ ఐపీఎల్‌లోనైనా ఆరు-ఏడు మ్యాచ్‌ల వరకూ ఆర్సీబీ ఆటగాళ్లను మార్చకుండా ఉండి నిలకడ కోసం ప్రయత్నించాలన్నాడు.

గంభీర్ చెప్పింది చాలా వరకూ నిజమేనని అభిప్రాయ పడుతున్నారు క్రికెట్ విశ్లేషకులు. కోహ్లీ తన జట్టు టాప్ ఆర్డర్ మెరుపులు మెరిపిస్తే చాలని అనుకుంటూ ఉంటాడని.. అదే బౌలర్లు ఆఖరి నాలుగు ఓవర్లలో 60 పరుగులు సమర్పిస్తే మ్యాచ్ కోల్పోయే అవకాశాలు ఉంటాయన్నది గ్రహించే లోపు టోర్నీ కూడా ముగిసిపోతుందని పలువురు చెప్పుకొచ్చారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle