newssting
BITING NEWS :
*ఇవాళ గురుపూర్ణిమ.. చంద్రగ్రహణం **దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

కెప్టెన్సీకి క్రెడిట్‌ కూడా దక్కని దురదృష్టవంతుడు ది వాల్.. గంభీర్

25-06-202025-06-2020 08:26:31 IST
Updated On 25-06-2020 11:46:40 ISTUpdated On 25-06-20202020-06-25T02:56:31.590Z25-06-2020 2020-06-25T02:56:28.088Z - 2020-06-25T06:16:40.695Z - 25-06-2020

కెప్టెన్సీకి క్రెడిట్‌ కూడా దక్కని దురదృష్టవంతుడు ది వాల్.. గంభీర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత క్రికెట్‌ను అత్యంత ప్రభావితం చేసిన క్రికెటర్లలో రాహుల్‌ ద్రవిడ్‌ ముందు వరుసలో ఉంటాడని మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్‌గా ద్రవిడ్‌ తనదైన ముద్ర వేసిన విషయాన్ని గంభీర్‌ గుర్తు చేశాడు. కానీ ద్రవిడ్‌కు దక్కాల్సిన క్రెడిట్‌ చాలా తక్కువ అన్నాడు. మనం ఎ‍ప్పుడూ సౌరవ్‌ గంగూలీ, ఎంఎస్‌ ధోనిలా గురించి మాత్రమే మాట్లాడుతున్నామని, ద్రవిడ్‌ సేవల్ని విస్మరించారన్నాడు. 

జట్టు కోసం ఏమీ చేయడానికైనా ద్రవిడ్‌ సిద్ధంగా ఉండేవాడనే విషయాన్ని గంభీర్‌ ప్రస్తావించాడు. అటు కీపర్‌గా, ఇటు బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గా కూడా ఎన్నో విజయాల్ని అందించాడన్నాడు. సచిన్‌ టెండూల్కర్‌ తరహాలోనే ద్రవిడ్‌ అత్యున్నత ఆటగాడన్నాడు. 

కాకపోతే సచిన్‌ నీడలో ద్రవిడ్‌ ప్రతిభ వెలుగులోకి రాలేదనే విషయం వాస్తవమన్నాడు. ఓవరాల్‌గా చూస్తే ద్రవిడ్‌కు దక్కాల్సిన గౌరవం దక్కలేదని గంభీర్‌ చెప్పుకొచ్చాడు.  ‘ నా వన్డే అరంగేట్రం సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలో జరగ్గా, నా టెస్టు అరంగేట్రం ద్రవిడ్‌ సారథ్యంలో జరిగింది. ద్రవిడ్‌ జట్టుకు చేసిన సేవలు అమోఘం. గంగూలీ విజయవంతమైన సారథి అయినా ద్రవిడ్‌కు తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాడు. 

ద్రవిడ్‌ సారథిగా కూడా గొప్ప విజయాల్నే చూశాడు. ఓపెనర్‌గా, కీపర్‌గా ఇలా బహుముఖ పాత్రలో ద్రవిడ్‌ అలరించాడు. కానీ తగిన గుర్తింపు రాలేదు. సచిన్‌ నీడలో ఆడటం కూడా ద్రవిడ్‌కు గుర్తింపు రాకపోవడానికి ఒక కారణం.  కానీ సచిన్‌ తరహా క్రికెటర్‌ ద్రవిడ్‌. ఇక గంగూలీ వైట్‌బాల్‌ క్రికెట్‌లో అత్యంత ప్రభావం చూపిన కెప్టెన్‌. కానీ భారత క్రికెట్‌లో ఓవరాల్‌గా రాహుల్‌ ద్రవిడే ప్రభావంతమైన కెప్టెన్‌’ అని గంభీర్‌ పేర్కొన్నాడు. 

వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ల్లో ద్రవిడ్‌ కెప్టెన్సీలో విజయాలే అతని సారథ్యానికి అద్దం పడతాయన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, ఇప్పుడు విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్ల గురించి తలుచుకుంటే మనందరి మనస్సుల్లో వచ్చే పేర్లు ఇవేమరి. కానీ ఈ దిగ్గజాల సరసన నిలబడే స్థాయి ఉన్నప్పటికీ మనం ఒకరి పేరు ఎందుకోగానీ మర్చిపోతుంటాం. అతడే రాహుల్ ద్రావిడ్. 

కుడి చేతి బ్యాట్స్‌మన్ అయిన రాహుల్ తన కెరీర్‌లో 79 వన్డేలు ఆడితే 42 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. 33 మ్యాచ్‌లలో భారత్ ఓడిపోయింది. విజయాల శాతం 56 శాతం. ఇక 25 టెస్టు మ్యాచుల్లో కెప్టెన్ గా 8 మ్యాచులు గెలిపించాడు. 6 మ్యాచ్‌లు కోల్పోయాడు.  ఇక్కడా విన్నింగ్ శాతం 32 శాతం.

 

మరో భారీ స్టేడియం.. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రయత్నం

మరో భారీ స్టేడియం.. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రయత్నం

   an hour ago


పేస్ బౌలింగే ఆయుధం.. వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ వ్యూహం

పేస్ బౌలింగే ఆయుధం.. వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ వ్యూహం

   2 hours ago


కోహ్లీని పొరపాటుగా కూడా కవ్వించం.. ఆసీస్ బౌలర్ల వరసపాట

కోహ్లీని పొరపాటుగా కూడా కవ్వించం.. ఆసీస్ బౌలర్ల వరసపాట

   8 hours ago


ఫిక్సింగ్ రచ్చ.. మహిందానంద ట్విస్ట్

ఫిక్సింగ్ రచ్చ.. మహిందానంద ట్విస్ట్

   8 hours ago


క్రికెట్ పోటీలకు బయో సెక్యూర్ పాలసీయే శరణ్యమా?

క్రికెట్ పోటీలకు బయో సెక్యూర్ పాలసీయే శరణ్యమా?

   04-07-2020


రిటైరై మమ్మల్ని బతికించాడు.. లేకుంటే బలయ్యేవాళ్లం.. కుల్దీప్ సంచలన వ్యాఖ్య

రిటైరై మమ్మల్ని బతికించాడు.. లేకుంటే బలయ్యేవాళ్లం.. కుల్దీప్ సంచలన వ్యాఖ్య

   04-07-2020


విరాట్ ఎంట్రీతో పెరిగిన ఆటగాళ్ళ ఫిట్ నెస్ లెవల్స్

విరాట్ ఎంట్రీతో పెరిగిన ఆటగాళ్ళ ఫిట్ నెస్ లెవల్స్

   03-07-2020


శశాంక్‌ మనోహర్ భారత క్రికెట్‌ను ఘోరంగా దెబ్బతీశారు! శ్రీనివాసన్‌ తీవ్ర విమర్శ

శశాంక్‌ మనోహర్ భారత క్రికెట్‌ను ఘోరంగా దెబ్బతీశారు! శ్రీనివాసన్‌ తీవ్ర విమర్శ

   03-07-2020


సచిన్ నన్ను ప్రమోట్ చేస్తే చాపెల్ మీద పడతారేంటి.. ఇర్ఫాన్ ప్రశ్న

సచిన్ నన్ను ప్రమోట్ చేస్తే చాపెల్ మీద పడతారేంటి.. ఇర్ఫాన్ ప్రశ్న

   02-07-2020


రోహిత్ శర్మకు ఆసిస్ బౌలర్లతో పరీక్షేనా?

రోహిత్ శర్మకు ఆసిస్ బౌలర్లతో పరీక్షేనా?

   02-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle