newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

కివీస్‌పై హ్యాట్రిక్ కొట్టిన భారత్

28-01-201928-01-2019 18:10:33 IST
2019-01-28T12:40:33.641Z28-01-2019 2019-01-28T12:40:31.948Z - - 21-08-2019

కివీస్‌పై హ్యాట్రిక్ కొట్టిన భారత్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆతిథ్య జట్టుపై జైత్రయాత్ర కొనసాగిస్తోంది. తొలి రెండు వన్డే మ్యాచ్‌లను సునాయాసంగా గెలిచిన భారత్... మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన మూడో వన్డేను సాధించింది. దీంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే ఐదు వన్డేల సిరీస్‌ను 3-0తో ఇండియా కైవసం చేసుకుంది. ముందు బౌలర్లు, ఆ తర్వాత బ్యాట్స్‌మన్‌లు సమిష్టిగా రాణించడంతో... కివీస్ జట్టు డీలా పడి, భారత్ చేతిలో ఓటమిపాలైంది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌ జట్టును భారత బౌలర్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. 59 పరుగులలోపే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ చేరడంతో... కివీస్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో వచ్చిన టామ్‌ లేథమ్‌, రాస్‌ టేలర్‌‌లు చేలరేగారు. ఆచితూచి ఆడుతూనే... భారీ షాట్స్‌తో భారత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 178 పరుగుల వద్ద లేథమ్ ఔట్ కావడంతో పరుగుల వేగం కాస్త తగ్గింది. ఓవైపు టేలర్ రాణిస్తుంటే... మరోవైపు వికెట్లు టపీటపీమని పడిపోవడంతో కివీస్‌ 243 పరుగులకు ఆలౌటైంది. షమి 3 వికెట్లు తీయగా... భువి, చాహల్‌, పాండ్య, కుల్‌దీప్‌‌లు రెండు చొప్పున వికెట్లు తీశారు.

ఇక 244 పరుగుల లక్ష్యంతో మైదానంలో దిగిన టీమిండియా మొదట్లో శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయి కాస్త ఖంగితున్నా... ఆ తర్వాత రోహిత్, కెప్టెన్ కోహ్లీల అద్భుత ప్రదర్శనతో కుదురుకుంది. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ... భారీ షాట్స్‌తో దుమ్ముదులిపారు. వీళ్ళు రెండో వికెట్‌కి 113 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఈ ఇద్దరూ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ కూడా నువ్వా నేనా అన్నట్లు పోటీపడి ఆడారు. దీంతో కోహ్లీసేన 43 ఓవర్లకే 7 వికెట్ల తేడాతో కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. 9 ఓవర్లలో 41 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన షమికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.

న్యూజిలాండ్ స్కోర్ : 243/10 (49 ఓవర్లు)
ఇండియా : 245/3 (43 ఓవర్లు)


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle