newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

కింగ్స్ఎలెవ‌న్ పంజాబ్‌కు షాక్‌.. మాక్స్‌వెల్ దూరం..!

13-02-202013-02-2020 09:13:40 IST
Updated On 13-02-2020 16:15:42 ISTUpdated On 13-02-20202020-02-13T03:43:40.634Z13-02-2020 2020-02-13T03:43:38.469Z - 2020-02-13T10:45:42.354Z - 13-02-2020

కింగ్స్ఎలెవ‌న్ పంజాబ్‌కు షాక్‌.. మాక్స్‌వెల్ దూరం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్‌-2020 సీజ‌న్ ముంగిట‌ కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్‌కు షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు హార్డ్‌హిట్ట‌ర్, కీల‌క ఆట‌గాడు మాక్స్‌వెల్.. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌ల‌కు దూరం కానున్నాడు.

బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) 2019-20 సమయంలో మ్యాక్స్‌వెల్‌ ఎడమ మోచేయికి గాయం అయింది. ప‌రిశీలించిన డాక్ట‌ర్లు.. శ‌స్త్ర‌చికిత్స అవ‌స‌రం అని తెలిపారు. దీంతో గురువారం త‌న మోచేతి గాయానికి స‌ర్జ‌రీ చేయించుకోనున్న‌ట్లు చెప్పాడు ఈ ఆస్ట్రేలియా హార్డ్ హిట్ట‌ర్. ఈ కారణంగా ఇప్పటికే దక్షిణాఫ్రికాతో సిరీస్‌ కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టు నుంచి మాక్స్‌వెల్ త‌ప్పుకున్నాడు. అత‌డి స్థానంలో డీఆర్క్‌ షార్ట్ ను ఎంపిక చేశారు సెల‌క్ట‌ర్లు..

కాగా.. స‌ర్జ‌రీ త‌రువాత మాక్స్‌వెల్ కోలుకోవ‌డానికి క‌నీసం 6 నుంచి 8 వారాల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని డాక్ట‌ర్లు చెప్పారు. ఐపీఎల్‌-13వ సీజన్ మార్చి చివ‌రి వారంలో ప్రారంభంకానుడంతో.. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ల‌కు మ్యాక్సి అందుబాటులో ఉండ‌డు. టోర్నీ మ‌ధ్య‌లో ఈ ఆట‌గాడు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. గత ఏడాది చివర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ రూ. 10.75 కోట్లకి వేలంలో ఈ ఆట‌గాడిని సొంతం చేసుకుంది.

ఇటీవల ముగిసిన బిగ్‌బాష్ లీగ్‌లో పరుగుల వరద పారించిన మాక్స్‌వెల్.. స‌ర్జ‌రీ త‌రువాత ఎలా రాణిస్తాడు అన్న‌దానిపై ప్ర‌స్తుతం కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ జ‌ట్టులో ఆందోళ‌న నెల‌కొని ఉంది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle