newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

‘కార్తీక్ తప్పు వల్లే భారత్ ఓడింది’

11-02-201911-02-2019 17:34:16 IST
2019-02-11T12:04:16.651Z11-02-2019 2019-02-11T12:04:14.557Z - - 21-08-2019

‘కార్తీక్ తప్పు వల్లే భారత్ ఓడింది’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆత్మవిశ్వాసం ఉండడంలో తప్పు లేదు... కానీ అతివిశ్వాసం ఉంటే మాత్రం తీవ్రమైన పరిణామాల్ని ఎదుర్కోవలసి వస్తుంది. సరిగ్గా అలాంటి చేదు అనుభవాన్ని ఇప్పుడు భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ ఎదుర్కొంటున్నాడు. విధ్వంసకరమైన షాట్స్‌తో తన జట్టును గెలిపించగలననుకున్న కార్తీక్‌... ఆ విశ్వాసంతో ఒక పరుగు తీయకపోవడం అతని పాలిట శాపమైంది. యావత్ దేశాభిమానుల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొనే దౌర్భాగ్య పరిస్థితికి దిగజార్చింది.

ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టి20లో టీమిండియా కేవలం 4 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే! ఆ మ్యాచ్ ఓడిపోవడంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత్ కోల్పోవాల్సి వచ్చింది. అయితే... భారత్ ఓడిపోవడానికి కారణం చివరి ఓవర్లో దినేశ్ కార్తీక్ సింగిల్ తీయకపోవడం వల్లేనని విమర్శలు వెల్లువెత్తాయి. న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌతీ వేసిన చివరి ఓవర్‌లోని మూడో బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నప్పటికీ... ఆఫ్ పిచ్ దాటిన కృనాల్‌ను వారించి మరీ వెనక్కు పంపాడు.

కార్తీక్ చేసిన ఆ తప్పు వల్లే భారత్ పరాభావాన్ని ఎదుర్కోవలసి వచ్చిందంటూ క్రికెట్ అభిమానులు అతనిపై మండిపడుతున్నారు. ‘‘నువ్వేమైనా ధోనీ అనుకుంటున్నావా? ఎప్పుడు చూడు స్వప్రయోజనం కోసమే ఆడుతాడు’’ అంటూ కార్తీకపై ధ్వజమెత్తారు. సీనియర్ క్రికెటర్ హర్బజన్ సింగ్ కూడా కార్తీక్‌ని తప్పుపట్టాడు. చివరి ఓవర్లో కార్తీక్‌ సింగిల్‌ తీయకపోవడం ముమ్మాటికే తప్పేనని, ఆ తప్పు వల్లే భారత్ పరాజయం చవిచూసిందన్నాడు.

‘‘దినేష్ కార్తీక్ ఆ సింగిల్ తీయకపోవడం వల్లే భారత్‌ ఓడిపోయింది. కార్తీక్‌కు తనపై తనకు విశ్వాసం ఉండడం మంచిదే కానీ... అదే నమ్మకం ఇతరులపై కూడా ఉంచాలి. ముఖ్యంగా... అవతలివారు బాగా ఆడుతున్నప్పుడు వారికి ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి. నిదహాస్‌ ట్రోఫి ఫైనల్లో భారత జట్టును గెలిపించడం వల్ల కార్తీక్‌కు బెస్ట్ ఫినిషర్‌గా ట్యాగ్ వచ్చింది. కానీ అక్కడ బౌలర్ సౌర్య సర్కార్ కానీ, టిమ్ సౌతి కాదని గ్రహించాలి. అంతకుముందు సౌతీ ఓవర్‌లో కృనాల్ 18 పరుగుల రాబట్టాడు. ఆ సింగిల్‌ తీసి కృనాల్‌కు అవకాశం వచ్చి ఉంటే... పరిస్థితి మరోలా ఉండేది. ఏదేమైనా... కార్తీక్ తప్పు వల్ల టీమిండియా గెలుపు అవకాశాలను దెబ్బతీసింది’’ అని హర్భజన్ పేర్కొన్నాడు.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle