newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కార్గిల్ వీరులకు క్రికెటర్ల సలాం .. జవాన్ల ధైర్యసాహసాలు అజరామరం

26-07-202026-07-2020 18:08:01 IST
Updated On 26-07-2020 18:08:51 ISTUpdated On 26-07-20202020-07-26T12:38:01.945Z26-07-2020 2020-07-26T12:37:36.895Z - 2020-07-26T12:38:51.992Z - 26-07-2020

కార్గిల్ వీరులకు క్రికెటర్ల సలాం .. జవాన్ల ధైర్యసాహసాలు అజరామరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కార్గిల్ విజయ్ దివాస్‌ను పురస్కరించుకొని ఆ యుద్ధంలో అసువులు బాసిన అమర జవాన్లకు భారత క్రికెటర్లు నివాళులు అర్పించారు. సోషల్ మీడియా వేదికగా త్రివిధ దళాల ధైర్య సాహసాలను స్మరించుకుంటూ వారి త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. 

1999లో మంచుకొండల మాటున ఉగ్రవాదుల ముసుగులో కశ్మీర్‌ను కబళించేందుకు పాక్ దుష్టపన్నాగానికి తెరతీయగా.. దీనికి భారత్ సైనికులు సింహాల్లా వారిపై లంఘించి దాయాదిని తరిమి తరిమి కొట్టారు.ఈ యుద్ధంలో అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ జరుపుకొంటున్నాం. నేటితో భారత ఆర్మీ కార్గిల్ యుద్ద విజయానికి 21 ఏళ్లు పూర్తయ్యాయి. 

ఈ సందర్భంగా భారత క్రికెట్ లోకం అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుంది. సలాం అంటూ వారి పాదాలకు పరిపరి దండాలు పెట్టింది.కార్గిల్‌ యుద్ధంలో మన భారత సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఎంతో స్ఫూర్తిదాయకం. మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి మనమెప్పుడూ రుణపడి ఉంటాం. - సచిన్‌ టెండూల్కర్‌

మనల్ని రక్షించిన అమర జవాన్లకు నివాళులు. అలాగే ఇప్పుడు కాపాడుతున్న సైనికులకు వందనం. మీరు ఉండటం వల్లే మేం ప్రశాంతంగా ఉన్నాం.- వీరేందర్‌ సెహ్వాగ్‌ అన్నారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా నాటి యుద్ధంలో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారత జవాన్లకు సెల్యూట్‌ చేస్తున్నా. వారి త్యాగాలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని యువరాజ్‌ సింగ్‌ అన్నారు. 

https://www.photojoiner.net/image/gjM8ym9k

రాత్రింబవళ్లు అహర్నిశలు మనల్ని కాపాడే భారత జవాన్ల ధైర్య సాహసాలకు సెల్యూట్‌. మీరు ఉండటం వల్లే మేం ఉన్నాం. -మహ్మద్‌ కైఫ్‌

‘నిజమైన హీరోలకు తమ జెర్సీల వెనుక పేర్లుండవు. అలాంటి వారు తమ దేశ పతాకాన్ని ధరిస్తారు.- గౌతం గంభీర్‌

‘భారత రక్షణ దళాల ధైర్య సాహసాలకు సెల్యూట్‌ చేస్తున్నా. దేశం కోసం పోరాడి ప్రాణాలొదిలిన వీరులకు వందనం. -విరాట్‌ కోహ్లీ

మనం జీవిస్తున్న ఈ రోజు కోసం వాళ్ల భవిష్యత్‌ను త్యాగం చేసిన అమరవీరులకు వందనం. -రిషభ్‌పంత్‌

‘మన దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన హీరోలను ఎప్పటికీ మరవకూడదు. భారత సైన్యం పట్ల గర్వంగా ఫీలవుతున్నా. జై హింద్‌ -అజింక్య రహానే

కార్గిల్‌లో 1999 మే-జూలై నెలల మధ్య ఈ యుద్ధం జరిగింది. నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు తెలియకుండానే ఆర్మీ చీఫ్ ముషారఫ్‌ భారత్‌తో యుద్ధానికి దిగాడు. ఎత్తయిన మంచు కొండ ప్రాంతాల్లో ఉగ్రవాదులతో కలిసి పాక్ సైనికులు భారత ఆర్మీపైకి దాడి ప్రారంభించారు. శత్రువులు ఎత్తులో ఉండటం వారికి అనుకూలంగా మారింది. దిగువన ఉండటం ప్రతికూలంగా మారడంతో.. భారతీయ సైనికులు ప్రాణాలకు తెగించి మరీ వారితో పోరాడారు.

యుద్ధంలో ఓటమి తప్పదని భావించిన పాక్.. జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరగా.. వెంటనే వెనుదిరిగాలను నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హెచ్చరించాడు. దీంతో వెనుదిరిగిన భారత సైన్యం మిగతా ఔట్ పోస్టుల్లోని పాకిస్థాన్ సైన్యాన్ని తరిమి కొట్టింది. జులై 26 నాటికి పాక్ ఆక్రమించిన ప్రాంతాలన్నింటినీ భారత సైన్యం తన గుప్పిట్లోకి తెచ్చుకోగలిగింది. సుమారు 73 రోజలపాటు సాగిన యుద్ధం అధికారిక లెక్కల ప్రకారం 527 మంది భారత సైనికులు వీరమరణం పొందారు.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle