newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

కరోనా వేళ.. వెస్టిండీస్ టీం సాహసం

08-07-202008-07-2020 10:47:27 IST
Updated On 08-07-2020 12:29:27 ISTUpdated On 08-07-20202020-07-08T05:17:27.640Z08-07-2020 2020-07-08T05:17:20.895Z - 2020-07-08T06:59:27.861Z - 08-07-2020

కరోనా వేళ.. వెస్టిండీస్ టీం సాహసం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా గత మార్చి నుంచి నిలిచిపోయిన అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ ఇవాళ్టి నుంచి ప్రారంభంకాబోతోంది. ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ.. సాహసోపేతంగా అక్కడికి వెళ్లిన వెస్టిండీస్ జట్టు.. సౌథాంప్టన్ వేదికగా ఈరోజు తొలి టెస్టులో ఆతిథ్య దేశంతో ఢీకొట్టబోతోంది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు టెస్టులు జరగనుండగా.. సిరీస్‌ని పూర్తి బయో- సెక్యూర్ వాతావరణంలో ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహిస్తోంది.

నెల రోజుల ముందే ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన వెస్టిండీస్ జట్టు.. కరోనా పరీక్షలు చేయించుకుని 14 రోజులు క్వారంటైన్‌లో ఉంది. ఆ తర్వాత కూడా బయో- సెక్యూర్ వాతావరణంలోనే ప్రాక్టీస్ చేస్తోంది. ఇరు జట్ల క్రికెటర్లే కాదు.. టీమ్ సహాయ సిబ్బంది, మ్యాచ్ అధికారులు కూడా ఈ క్వారంటైన్ ఫాలసీని పాటిస్తూ బయో- సెక్యూర్ వాతావరణంలోనే గత నెల రోజులుగా గడుపుతున్నారు. 

ఈ సిరీస్ మిగిలిన క్రికెట్ దేశాలకి మార్గదర్శిగా ఉండబోతోంది. మ్యాచ్ ముంగిట కూడా క్రికెటర్లతో పాటు అంపైర్లకి కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి.. నెగటివ్ అని తేలితేనే ఆటలోకి అనుమతిస్తారు.

భారత కాలమాన ప్రకారం సౌథాంప్టన్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఆ తర్వాత జులై 16న మాంచెస్టర్‌లో రెండో టెస్టు, 24 నుంచి అదే వేదికలో మూడో టెస్టు జరగనుంది. తొలి టెస్టు మ్యాచ్‌కి ఇంగ్లాండ్ టీమ్ రెగ్యులర్ కెప్టెన్ జో రూట్ దూరమవగా.. అతని స్థానంలో బెన్‌స్టోక్స్ టీమ్‌ని నడిపించనున్నాడు. తన భార్య ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండాలని ఆశించిన రూట్.. తొలి టెస్టుకి దూరమయ్యాడు. రెండో టెస్టు మ్యాచ్‌కి ముందు కనీసం 7 రోజులు అతను క్వారంటైన్‌లో ఉండి.. కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

కరోనా వైరస్ కారణంగా బంతిపై ఉమ్ము రాయడాన్ని ఐసీసీ నిషేధించడంతో.. బంతి నుంచి పేసర్ల ఎలా స్వింగ్ రాబడతారు..? వికెట్ పడిన సమయంలో క్రికెటర్లు హైఫై స్థానంలో ఎలా సంబరాలు చేసుకుంటారు..? మైదానంలో మునుపటిలా ఆటగాళ్లు షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకుంటారా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి ఈరోజు సమాధానం దొరకబోతోంది. కరోనా మహమ్మారి వీరవిహారం వేళ వెస్టిండీస్ జట్టు ఆటగాళ్ళు చేసిన సాహసంపై అంతా చర్చించుకుంటున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle