newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా బారినపడ్డ బంగ్లా మాజీకెప్టెన్.. క్రికెటర్లను వదలని మహమ్మారి

21-06-202021-06-2020 09:55:48 IST
2020-06-21T04:25:48.562Z21-06-2020 2020-06-21T04:25:42.121Z - - 12-04-2021

కరోనా బారినపడ్డ బంగ్లా మాజీకెప్టెన్.. క్రికెటర్లను వదలని మహమ్మారి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు ఈ వైరస్ బారిన పడి మృత్యువాత పడుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ మాజీ కెప్టెన్, పార్లమెంటు సభ్యుడు‌ మష్రాఫ్‌ మోర్తాజాకు కరోనా వైరస్ సోకింది. మోర్తాజా కుటుంబసభ్యులు ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం మోర్తాజా‌ హోంక్వారంటైన్లో ఉన్నారని తెలిపారు. "నా సోదరుడికి రెండు రోజులుగా జ్వరం వచ్చింది. అతనికి గత రాత్రి కరోనా పరీక్షలు చేశారు. ఈ రోజు కోవిడ్ పరీక్ష ఫలితం పాజిటివ్ గా వచ్చింది. దాంతో అతను ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు" అని మోర్తాజా సోదరుడు మోర్సాలిన్  తెలిపాడు. 

కెరీర్‌లో 220 వన్డేలు, 36 టెస్టులు, 54 టి20లు ఆడిన మోర్తాజా రిటైర్మెంట్ అనంతరం చిన్నవయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించాడు మోర్తాజా. ప్రస్తుతం అధికార పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారు. బంగ్లాదేశ్ లో కరోనా కేసులు లక్ష మార్కును దాటేశాయి. బంగ్లాదేశ్‌లో ఇప్పటివరకు 1,05,000 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇందులో 43,000 మంది కోలుకోగా, 1,300 మంది మరణించారు.

 బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ ఇంట మరోసారి కరోనా వైరస్ రచ్చరేపుతోంది. గంగూలీ అన్నయ్య, వారి కుటుంబసభ్యులైన బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి స్నేహాశిష్‌ భార్యకు కరోనా పాజిటివ్‌ సోకింది. గంగూలీ కుటుంబీకులు నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని పరీక్షించగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.

ప్రస్తుతం వీరు ఓ ప్రయివేట్‌ నర్సింగ్‌ హోమ్‌లో చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు పాకిస్తాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది కూడా ఇంతకుముందే కరోనా బారినపడినట్టు ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని తనే స్వయంగా చెబుతూ తాను త్వరగా కోలుకునేలా అంతా ప్రార్ధనలు చేయాలన్నారు. రెండుమూడురోజుల నుంచి తనకు అసౌకర్యంగా ఉందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని ప్రకటించాడు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle