newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘కరోనా’ కోసం క్రీడాకారుల సాయం.. విరుష్క జోడీ ఎంతిచ్చారో తెలుసా?

31-03-202031-03-2020 19:21:57 IST
2020-03-31T13:51:57.301Z31-03-2020 2020-03-31T13:51:49.854Z - - 22-04-2021

‘కరోనా’ కోసం క్రీడాకారుల సాయం.. విరుష్క జోడీ ఎంతిచ్చారో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశమంతా ఏకమయిన కరోనా వైరస్ పై పోరాటం చేస్తోంది. అందరూ తమవంతు సాయం చేస్తున్నారు. కరోనాతో మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. క్రీడాకారులు, రాజకీయనేతలు భారీగా విరాళాలిచ్చి ప్రభుత్వానికి తమవంతు చేయూతనిస్తున్నారు. అనుష్క, విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమని కలచి వేస్తున్నాయని భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అతని భార్య బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ అన్నారు.

కరోనాపై పోరు కోసం అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. పీఎం–కేర్స్‌ ఫండ్, మహారాష్ట్ర ముఖ్య మంత్రి సహాయనిధి కోసం ఈ జంట నిధులు అందించనున్నట్లు ప్రకటించారు. అయితే తాము ఎంత మొత్తం విరాళంగా ఇస్తున్నది మాత్రం వారిద్దరు గోప్యంగా ఉంచారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరు రూ. 3 కోట్లు విరాళం ఇచ్చారని తెలిసింది. ‘అనుష్క, నేను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. మేం అందించే ఈ సహాయం కొంతమందికైనా ఊరట కలిగిస్తుందని నమ్ముతున్నాం. కరోనా సృష్టిస్తోన్న విలయం చూస్తుంటే  మా హృదయం తరుక్కుపోతుంది’ అని కోహ్లి ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. వీరి సాయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఈ జంటతో పాటు క్రికెటర్లు, క్రీడాకారులు ముందుకొచ్చారు. రోహిత్ శర్మ తన ఉదారత చాటుకున్నాడు. భారత్ మళ్లీ యథాతథ స్థితికి రావాలని, కరోనా భయం పోవాలని కోరుకున్నాడు.  కోవిడ్‌-19 బాధితులను, పేదలను ఆదుకునేందుకు తన వంతుగా రూ.80 లక్షలు విరాళం ఇచ్చినట్టు తెలిపారు. పీఎం కేర్స్‌కు రూ.45 లక్షలు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.25 లక్షలు, ఫ్రీ ఇండియా స్వచ్ఛంద సంస్థకు, వెల్ఫేర్‌ ఆఫ్‌ స్ట్రే డాగ్స్‌కు రూ. 5 లక్షల చొప్పున రోహిత్‌ సాయం చేశారు.

ఇటు భారత మహిళల వన్డే క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హైదరాబాద్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ రూ. 5 లక్షలు పీఎం–కేర్స్‌ ఫండ్‌కు... రూ. 5 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందించారు. మరో మహిళా క్రికెటర్‌ పూనమ్‌ యాదవ్‌ రూ. 2 లక్షలు, భారత్ టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సత్యన్‌ రూ. లక్షా 25 వేలు విరాళంగా ప్రకటించాడు. దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్, రాజ్యసభ ఎంపీ హోదాలో తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది.  కామన్వెల్త్‌ గేమ్స్‌ చాంపియన్‌ 18 ఏళ్ల టీనేజ్‌ షూటర్‌ మను భాకర్‌ లక్ష రూపాయల విరాళం అందించాడు. సచిన్‌ టెండూల్కర్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ రూ.50 లక్షల చొప్పున పీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle