newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనాపై పోరాటానికి మేము సైతం..క్రీడా దిగ్గజాల భారీ సాయం

29-03-202029-03-2020 09:51:22 IST
2020-03-29T04:21:22.932Z29-03-2020 2020-03-29T04:20:10.643Z - - 11-04-2021

కరోనాపై పోరాటానికి  మేము సైతం..క్రీడా దిగ్గజాల భారీ సాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా ప్రపంచం ఇబ్బందుల పాలవుతోంది. అన్ని దేశాలూ ఈ వైరస్ ధాటికి విలవిల్లాడిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 31 వేలకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 6,62,674 చేరింది. అమెరికాలో శనివారం ఒక్క రోజే 19,187 కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,23,313 చేరడం ఆందోళన కలిగిస్తోంది. 

ఇదిలా ఉంటే కరోనాను ఎదుర్కొనేందుకు క్రీడాకారులు, సినిమా ప్రముఖులు, కంపెనీలు, ఇతర వ్యాపారసంస్థలు ముందుకు వస్తున్నాయి. ప్రపంచ టెన్నిస్‌ నంబర్‌వన్‌, సెర్బియా స్టార్ నోవాక్‌ జొకోవిచ్‌ భారీ విరాళం ప్రకటించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.  కరోనా వైరస్ పై పోరాడేందుకు ముందుకొచ్చాడు. ఇప్పటికే ఎంతోమంది క్రీడాకారులు తమ వంతు సహాయానికి సిద్ధం అయ్యారు.

జొకోవిచ్‌ సాయంగా 1.1 మిలియన్‌ డాలర్లు(రూ. 8.28 కోట్లు) విరాళాన్ని ప్రకటించాడు. ఆక్సిజన్‌ సిలిండర్లు, వైద్య పరికరాలు, శానిటరీ వస్తువులను కొనుగోలు చేయడానికి ఇంత మొత్తాన్ని సెర్బియా ప్రభుత్వానికి విరాళం ఇచ్చాడు. కరోనా వైరస్‌  విజృంభిస్తుండటంతో  దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి మార్బెల్లాలో గడుపుతున్న జొకో.. వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడాడు.  తన దేశంతో పాటు ప్రపంచంలో కరోనాతో బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశాడు. అంతా త్వరలోనే కోలుకోవాలని కోరుకుంటున్నానని ప్రకటించాడు.

ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 50 లక్షలు, ధోనీ లక్ష విరాళం ప్రకటించారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్, బార్సిలోనా ఫార్వర్డ్‌ ఆటగాడు లియోనల్‌ మెస్సీ, మాంచెస్టర్‌ సిటీ మేనేజర్‌ పెప్‌ గార్డియోలా  భారీ విరాళం ప్రకటించాడు. జోకోవిచ్ బాటలోనే రూ. 8.32 కోట్లు విరాళం ఇచ్చారు. ఇక మరో టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ..తన భార్య మిర్కాతో కలిసి రూ. 7 కోట్ల 86 లక్షలు  అందజేశాడు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle