newssting
BITING NEWS :
*ప్రధాని మోదీని కలిసిన వైఎస్ఆర్సీఎల్పీ నేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సమస్యలపై చర్చ, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం * వాల్డ్ కప్ వార్మప్ మ్యచ్ లో టీమిండియా పేలవ ప్రదర్శన, న్యూజీల్యాండ్ చేతిలోఓటమి * నరేంద్ర మోదీని పీఎం ఎలక్ట్ గా నియమించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ * రాష్ట్రపతి కోవింద్ కు కొత్త ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ * ఎవరెస్ట్ పర్వతంపై ఈ వారం మరణించిన పర్వతారోహకుల సంఖ్య 10కి చేరిక * తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా సమర్పించిన సీఈఓ జీకే ద్వివేది

కపిల్ శర్మ షోలో సైనా-కశ్యప్ ఏం చేశారు?

16-05-201916-05-2019 17:46:42 IST
Updated On 16-05-2019 18:05:12 ISTUpdated On 16-05-20192019-05-16T12:16:42.791Z16-05-2019 2019-05-16T12:16:39.989Z - 2019-05-16T12:35:12.814Z - 16-05-2019

కపిల్ శర్మ షోలో సైనా-కశ్యప్ ఏం చేశారు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ఇండియన్ వుమెన్ ప్లేయర్‌ సైనా నెహ్వాల్. పెళ్ళయ్యాక భర్త కశ్యప్ పారుపల్లితో కలిసి ఆమె వివిధ ప్రాంతాలు తిరుగుతోంది. తాజాగా ఆమె కపిల్ శర్మ షోలో సందడి చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సహచర ఆటగాడు పారుపల్లి కశ్యప్‌తో కలిసి ‘కపిల్ శర్మ షో’లో ప్రత్యక్షం అయ్యింది.

పారుపల్లి కశ్యప్‌తో మ్యారేజ్ తర్వాత పూర్తిగా స్టైల్ మార్చేసిన సైనా నెహ్వాల్... ఆటతీరులోనూ, డ్రెస్సింగ్ స్టైల్‌లోనూ తేడా కనిపిస్తోంది. గతంలో కనిపించిన తీరుకి భిన్నంగా ఆమె స్టయిల్ మార్చేసింది. ఈషోలో ఈ జంట సరదా కబుర్లతో ఆద్యంతం రక్తికట్టించారు. ఒలింపిక్స్ లో ఈసారి ఎలాగైనా బంగారుపతకం సాధించేందుకు కఠోర శ్రమ చేస్తున్నానని సైనా చెప్పుకొచ్చింది. 

కపిల్ శర్మ షోలో తాను పాల్గొంటున్నానంటూ చెబుతూ కపిల్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది సైనా నెహ్వాల్. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ షోకి ఆమె సంప్రదాయబద్ధంగా హాజరైంది. గత ఏడాది డిసెంబర్‌లో సైనా-కాశ్యప్ జంట ఒక్కటయిన సంగతి తెలిసిందే. ఈ జంట 2005 నుంచి పుల్లెల గోపీచంద్ దగ్గర బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకున్నారు.


స్టార్ షట్లర్‌గా ఎదిగిన నెహ్వాల్.. 20 మేజర్ టైటిళ్లను ఖాతాలో వేసుకుంది. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో కశ్యప్ స్వర్ణం సాధించాడు. ఒకానొక దశలో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో అతడు ఆరోస్థానానికి చేరుకున్నాడు. గతంలో  దీపికా పల్లికల్-దినేశ్ కార్తీక్, ఇశాంత్ శర్మ-ప్రతిమా సింగ్, గీతా ఫోగట్-పవన్ కుమార్, సాక్షి మాలిక్-సత్యవ్రత్‌లు క్రీడల నేపథ్యంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సైనా-కశ్యప్ జోడి కూడా వీరి సరసన చేరింది. కపిల్ శర్మ షోలో వీరిద్దరూ ఏం మాట్లాడారో ఈ వీకెండ్ సోనీ టీవీలో మీరూ చూడవచ్చు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle