newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కన్నీరు మున్నీరైన ధోనీ.. రైనా చెప్పింది నిజమేనా?

19-08-202019-08-2020 15:56:58 IST
Updated On 19-08-2020 18:59:30 ISTUpdated On 19-08-20202020-08-19T10:26:58.786Z19-08-2020 2020-08-19T10:26:53.064Z - 2020-08-19T13:29:30.547Z - 19-08-2020

కన్నీరు మున్నీరైన ధోనీ.. రైనా చెప్పింది నిజమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రికెట్‌ అభిమానులను షాక్‌కు గురిచేస్తూ టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ, వెటరన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆగస్టు 15న ఇద్దరూ తమ రిటైర్మెంట్లను ప్రకటించారు. ధోనీ ప్రకటన చేసిన వెంటనే రైనా కూడా వీడ్కోలు ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ధోని రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని తెలిసే దానికనుగుణంగానే ఆటకు వీడ్కోలు పలికేందుకు తాను సిద్దమయ్యాయని రైనా వెల్లడించాడు. రిటైర్మెంట్‌ ప్రకటన అనంతరం ఇద్దరం అప్యాయంగా కౌగిలించుకున్నామని, కన్నీళ్లు కూడా పెట్టుకున్నామని ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా చెప్పాడు. 

'చెన్నై చేరుకోగానే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నాకు తెలుసు. దీంతో నేను కూడా సిద్దమయ్యా. నేను, పియూష్ చావ్లా, దీపక్ చాహర్, కరణ్ శర్మ చార్టెడ్ ప్లేన్‌లో రాంచీ చేరుకున్నాం. అక్కడ ధోని, మోనూ సింగ్‌ను పిక్ చేసుకున్నాం. మా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇద్దరం ఆప్యాయంగా కౌగిలించుకున్నాం. వెక్కివెక్కి ఏడ్చాం. అనంతరం నేను, పియూష్, రాయుడు, కేదార్ జాదవ్, కరన్ అంతా కూర్చొని మా కెరీర్, వ్యక్తిగత విషయాల గురించి రాత్రంతా మాట్లాడుకున్నామ'ని రైనా చెప్పుకొచ్చాడు.

అయితే ధోనీ గుడ్‌బై గురించి నాకు ముందే తెలుసు. నేను కూడా దానికి సిద్ధమయ్యా. ఇక రిటైర్మెంట్‌ నిర్ణయం ప్రకటించాక భావోద్వేగాలను నియంత్రించుకోలేక కన్నీటి పర్యంతమయ్యాం. ఆ తర్వాత నేను, చావ్లా, రాయుడు, కేదార్‌ జాదవ్‌, కరణ్‌ కూర్చుని కెరీర్‌, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఆ రాత్రంతా పార్టీ చేసుకున్నాం. ప్రతీ క్రికెటర్‌కు ఇలాంటి రోజొకటి వస్తుంది’ అని రైనా వెల్లడించాడు.

క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు తామిద్దరం ఆగస్టు 15వ తేదీనే ఎంచుకోవడానికి గల కారణాన్ని కూడా రైనా వివరించాడు. ‘మేం ముందుగానే ఆ రోజును నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మహీ జెర్సీ నెంబర్‌ 7. నా సంఖ్య 3. రెండూ కలిపితే 73 వస్తుంది. అలాగే దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈసారికి 73 ఏళ్లు నిండుతాయి. అందుకే ఇంతకంటే మంచి రోజు లేదని భావించాం’ అని రైనా చెప్పాడు.

దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకొన్న రోజు రాత్రి భారత క్రికెట్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ‘మిస్టర్‌ కూల్‌’ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్‌ ధోనీ తన సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ను ముగిస్తున్నట్టు ప్రకటించగా.. కొద్దిసేపటికే అతడి ప్రియ మిత్రుడు సురేశ్‌ రైనా కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాడు. అయితే తమ నిర్ణయాలకు ముందు.. తర్వాత ఏం జరిగిందో రైనా వివరించాడు. ధోనీ వీడ్కోలు గురించి తనకు ముందే తెలుసన్నాడు. అలాగే ఆ రోజు రాత్రి ఆప్యాయంగా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నామని తెలిపాడు.

సుమారు ఏడు నెలల విరామంతో ధోని, రైనాలిద్దరు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టారు. భారత జట్టుతో పాటు ఐపీఎల్‌లో చెన్నై జట్టు సభ్యులుగా వీరిద్దరి మధ్య ఎంతో ఆత్మీయత ఉంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ఐపీఎల్‌లో మాత్రం ఈ చెన్నై జోడీ తమ సత్తా చూపేందుకు సిద్ధమవుతోంది.

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   12 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   16 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   a day ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14-04-2021


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle