newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కత్రినా కైఫ్ స్పిన్ బౌలింగ్ అంటూ ఫోటోను షేర్ చేసిన అశ్విన్

17-09-202017-09-2020 17:31:44 IST
2020-09-17T12:01:44.986Z17-09-2020 2020-09-17T12:00:57.103Z - - 10-04-2021

కత్రినా కైఫ్ స్పిన్ బౌలింగ్ అంటూ ఫోటోను షేర్ చేసిన అశ్విన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రవి చంద్రన్ అశ్విన్ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ ఉంటాడు. తన ఖాతాల ద్వారా చాలా విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా అశ్విన్ తన ఇంస్టాగ్రామ్ లో ఓ మీమ్ ను అభిమానులతో పంచుకున్నాడు. ఆ మీమ్ లో హీరోయిన్ కత్రినా కైఫ్ ఉండడం విశేషం. ఇంతకూ కత్రినా కైఫ్ ఆ పోస్టులో ఉండడానికి కారణం ఏమిటంటే.. 'ఆఫ్-స్పిన్నర్ల బౌలింగ్ యాక్షన్' పోస్టులో కత్రినా ఉంది.

కత్రినా కైఫ్ ఆఫ్ స్పిన్ వేయడం ఏమిటని అనుకోవచ్చు.. కత్రినా డ్యాన్స్ చేస్తూ ఉండగా.. ఆమె చేతిలో ఒక బంతిని పెట్టారు. దీంతో ఆమె కూడా ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేస్తూ ఉన్నట్లుగా అనిపించింది. ఈ నవ్వులు తెప్పించే పోస్టును అశ్విన్ పోస్టు చేసాడు.

ఆఫ్ స్పిన్ వేసే బౌలర్లు అంటూ అందులో అశ్విన్, గ్రేమ్ స్వాన్, రమేష్ పవార్ లు బౌలింగ్ యాక్షన్ వేస్తూ ఉన్నారు. అలా కత్రినా కైఫ్ కూడా ఆఫ్ స్పిన్ యాక్షన్ లో నిలబడి ఉంది.  

గత రెండు సీజన్లలో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన రవి చంద్రన్ అశ్విన్ ఈ ఏడాది ఢిల్లీ కేపిటల్స్ కు ఆడబోతూ ఉన్నాడు. అశ్విన్ 139 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడగా 125 వికెట్లు తీశాడు. 26.43 యావరేజ్.. 6.79 ఎకానమీ రేటు నమోదు చేశాడు అశ్విన్. ఢిల్లీ కేపిటల్స్ తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో మంచి మంచి ఆటగాళ్లను ఈ ఏడాది జట్టు లోకి తీసుకుంది. అశ్విన్ తో పాటూ అజింక్య రహానే, మార్కస్ స్టోయినిస్ లను కూడా జట్టులోకి తీసుకుంది. ఢిల్లీ సెప్టెంబర్ 20న కింగ్స్ లెవెన్ పంజాబ్ తో మొదటి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ మొదలు కాబోతోంది.  లాస్ట్ గ్రూప్ మ్యాచ్ లో భాగంగా అబుదాబీ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో నవంబర్ 2న తలపడనుంది.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle