కంబళ స్టార్స్.. శ్రీనివాస గౌడ రికార్డు బ్రేక్ చేసిన నిషాంత్ శెట్టి
18-02-202018-02-2020 16:26:33 IST
Updated On 18-02-2020 16:26:31 ISTUpdated On 18-02-20202020-02-18T10:56:33.300Z18-02-2020 2020-02-18T10:44:37.241Z - 2020-02-18T10:56:31.384Z - 18-02-2020

కర్నాటకలో సంప్రదాయ పందెం కంబళలో రికార్డుల మోత మోగుతోంది. కంబళలో సత్తా చాటి దేశవ్యాప్తంగా ఇండియన్ ఉసేన్ బోల్ట్ అని పేరు తెచ్చుకున్న శ్రీనివాస గౌడ రికార్డు బద్దలైంది. శ్రీనివాస గౌడకు దీటుగా నిషాంత్ శెట్టి అనే అతను సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇటీవల శ్రీనివాసగౌడ 142.5 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకన్లలో చేరుకున్నాడు. తాజాగా నిషాంత్ శెట్టి 143 మీటర్ల దూరాన్ని అనూహ్యంగా 13.68 సెకన్లలో చేరుకున్నాడు. వంద మీటర్ల లెక్క కడితే కేవలం 9.51 సెకన్లలో పరిగెత్తాడు. ఇది జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ రికార్డు కంటే 0.03 సెకన్లు తక్కువ. ఈ రెండు రికార్డుల దుమ్ము దులిపేశాడు నిశాంత్. శ్రీనివాస గౌడ ప్రతిభను గుర్తించిన కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఆఫీసుకి పిలిపించి శాలువాతో సత్కరించి, రూ. 3 లక్షల నగదు బహుమతి అందించారు. ఆనంద్ మహీంద్రా లాంటి వారు శ్రీనివాస గౌడకు గోల్డ్ మెడల్ ఇవ్వాలని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీనివాసగౌడకు సాయ్ ట్రయల్స్ నిర్వహించాలని ఆదేశించారు. అయితే తాను ఇప్పుడు హాజరుకాలేనన్నాడు. కొంత సమయం కోరాడు. తాజాగా నిషాంత్ శెట్టి విషయంలో ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
12 hours ago

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
16 hours ago

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
a day ago

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
14-04-2021

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
13-04-2021

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
12-04-2021

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను
12-04-2021

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!
12-04-2021

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
11-04-2021

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
11-04-2021
ఇంకా