newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ నెగ్గిన నైట్ రైడర్స్

11-09-202011-09-2020 12:43:09 IST
2020-09-11T07:13:09.275Z11-09-2020 2020-09-11T07:13:06.951Z - - 12-04-2021

ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ నెగ్గిన నైట్ రైడర్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరేబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ను ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో సెయింట్ లూసియా జూక్స్ ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది నైట్ రైడర్స్ జట్టు.  ఈ టోర్నమెంట్ లో అపజయం ఎరుగకుండా ముందుకు సాగిన నైట్ రైడర్స్ జట్టు ఫైనల్ లో కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది.

మొదట బ్యాటింగ్ కు వచ్చిన సెయింట్ లూసియా జట్టు భారీ స్కోరు దిశగా బాటలు వేస్తూ వెళ్లే తరుణంగా ఈ సారి పొలార్డ్ బౌలర్ గా తన మ్యాజిక్ ను చూపించాడు. 9 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసిన సెయింట్ లూసియా సులువుగా 170-180 పరుగులు చేసేలా కనిపించింది. కానీ పొలార్డ్ తో సహా మిగిలిన బౌలర్లు మంచి బౌలింగ్ ప్రదర్శనను ఇచ్చారు. ఆండ్రీ ఫ్లెచర్‌ (27 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. మార్క్ దెయాల్ 29, ఛేజ్ 22, నజీబుల్లా 24 పరుగులతో రాణించగా.. కీరన్‌ పొలార్డ్‌ (4/30) ఈసారి బౌలింగ్ తో మెరవడంతో 154 పరుగులకే ఆలౌట్ చేశారు.

ఓ మోస్తరు లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన నైట్ రైడర్స్ జట్టు మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. వెబ్ స్టర్ 5 పరుగులు, సీఫర్ట్ 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వడంతో నైట్ రైడర్స్ జట్టులో ఒకింత నిరాశ కనిపించింది. మరో వైపు ఓపెనర్ లెండెల్ సిమన్స్ నిలకడగా ఆడుతూ వెళ్ళాడు. అతడికి డారెన్ బ్రావో మంచి సహకారం అందించాడు. ఓ వైపు రన్ రేట్ పెరుగుతూ ఉన్నా.. మరో వైపు ఈ ఇద్దరు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుంటూ వెళ్లారు. మరో వికెట్ పడకుండా జట్టును విజయ తీరాలకు చేర్చారు.

నైట్‌రైడర్స్‌ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 157 పరుగులు సాధించింది. సిమన్స్‌ (49 బంతుల్లో 84 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), డారెన్‌ బ్రావో (47 బంతుల్లో 58 నాటౌట్‌; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) జట్టును గెలిపించారు. మూడో వికెట్‌కు 88 బంతుల్లో అభేద్యంగా 138 పరుగులు జోడించారు. నాలుగోసారి ట్రినిడాడ్ జట్టు సీపీఎల్ టైటిల్ ను ముద్దాడింది. ఈ టోర్నమెంట్ లో నైట్ రైడర్స్ జట్టు ఒక్క ఓటమిని కూడా దరి చేరనివ్వలేదు. సిమన్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా.. పొలార్డ్  మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను దక్కించుకున్నాడు. 

ఐపీఎల్ 2020 షెడ్యూల్ రిలీజ్...

ఐపీఎల్ 'థీమ్' సాంగ్‌ పై కాపీ వివాదం..


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle