newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఒక్క పర్మిషన్ వస్తే.. దూకుడే

21-07-202021-07-2020 10:43:05 IST
2020-07-21T05:13:05.710Z21-07-2020 2020-07-21T05:10:27.134Z - - 10-04-2021

ఒక్క పర్మిషన్ వస్తే.. దూకుడే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ని ఐసీసీ వాయిదా వేయడంతో ఐపీఎల్ 2020కి మార్గం సుగుమమైంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 26 నుంచి ఐపీఎల్ 2020 సీజన్‌ని ప్రారంభించాలని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించిన బీసీసీఐ.. సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి కోసం వేచిచూస్తోంది. ప్రభుత్వం పర్మీషన్ ఇవ్వగానే.. ఐపీఎల్ 2020 సీజన్ షెడ్యూల్‌ని అధికారికంగా బీసీసీఐ ప్రకటించనుంది.

ఇప్పటికే వెలువడిన వార్తల ప్రకారం సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకూ టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. మొత్తం 44 రోజుల ఈ విండోలో 60 మ్యాచ్‌లు జరగనుండగా.. మరో వారం రోజులు టోర్నీని పొడిగించాలని ఐపీఎల్ బ్రాడ్‌‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ డిమాండ్ చేస్తోంది. దానికి కారణం దీపావళి. ఒకవేళ నవంబరు 15 వరకూ టోర్నీ జరిగితే..? పండగ సీజన్ కావడంతో యాడ్స్ రూపంలో మరింత ఆదాయం చేకూరుతుందని స్టార్‌స్పోర్ట్స్ భావిస్తోంది. కానీ.. బీసీసీఐ మాత్రం స్టార్‌స్పోర్ట్స్ రిక్వెస్ట్‌ని పక్కన పెడుతోంది. 

ఒకవేళ నవంబరు 15 వరకూ ఐపీఎల్ జరిగితే.. డిసెంబరు 3న ఆస్ట్రేలియాతో ప్రారంభంకానున్న నాలుగు టెస్టుల సిరీస్‌కి సిద్ధమయ్యేందుకు టీమిండియాకి టైమ్ చాలా తక్కువగా ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది.

యూఏఈ వేదికగా ఐపీఎల్‌కి కేంద్ర ప్రభుత్వం పర్మీషన్ ఇవ్వగానే.. భారత క్రికెటర్లకి అక్కడ ఓ క్యాంప్‌‌ని ఏర్పాటు చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అలానే విదేశీ క్రికెటర్లని అక్కడికి రప్పించడం.. ఆ తర్వాత క్వారంటైన్‌ తదితర అంశాల్ని పరిగణలోకి తీసుకుని.. వీలైనంత త్వరగా గవర్నమెంట్‌ నుంచి పర్మీషన్ సంపాదించాలని బీసీసీఐ పెద్దలు ప్రయత్నిస్తున్నారు.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle