newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. భారత క్రికెటర్ల జోరు

06-08-202006-08-2020 13:06:09 IST
Updated On 06-08-2020 17:47:49 ISTUpdated On 06-08-20202020-08-06T07:36:09.554Z06-08-2020 2020-08-06T07:35:44.245Z - 2020-08-06T12:17:49.211Z - 06-08-2020

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. భారత క్రికెటర్ల జోరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు జోరు కొనసాగించారు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య మంగళవారం రాత్రితో మూడు వన్డేల సిరీస్ ముగియగా.. బుధవారం వన్డే ర్యాంకింగ్స్‌ని ఐసీసీ ప్రకటించింది.

భారత్ టాప్ క్రికెటర్ల ర్యాంక్‌లో ఎలాంటి మార్పులేదు. కానీ.. ఇంగ్లాండ్, ఐర్లాండ్ ఆటగాళ్లు మాత్రం మెరుగైన ర్యాంక్‌లను అందుకున్నారు.బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 871 పాయింట్లతో నెం.1 స్థానాన్ని కాపాడుకోగా.. 855 పాయింట్లతో ఓపెనర్ రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. 

ఇక ఇంగ్లాండ్‌తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో 142 పరుగులు చేసిన ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్ పాల్ స్టిర్లింగ్ 26వ స్థానానికి ఎగబాకగా.. అదే మ్యాచ్‌లో సెంచరీ (113 రన్స్) బాదిన ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బాల్‌బ్రైన్ 42వ ర్యాంక్‌ని చేజిక్కించుకున్నాడు.ఈ వన్డేలోనే 106 పరుగులు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. 22వ స్థానంలో నిలవగా.. రెండో వన్డేలో 82 పరుగులు చేసిన ఆ జట్టు ఓపెనర్ జానీ బెయిర్‌స్టోకి 13వ స్థానం దక్కింది.

బౌలింగ్ ర్యాంకింగ్స్ పరంగా చూసుకుంటే.. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ విల్లీకి మెరుగైన ర్యాంక్‌ లభించింది. ఫస్ట్ వన్డేలో ఐదు వికెట్లు పడగొట్టిన విల్లీ.. మూడు వన్డేల సిరీస్‌లో మొత్తం 8 వికెట్లని ఖాతాలో వేసుకున్నాడు. అతను 51వ స్థానానికి ఎగబాకగా.. ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఐదు వికెట్లు పడగొట్టడం ద్వారా.. 29వ స్థానం నుంచి 25వ స్థానానికి ఎగబాకాడు.

 

 



      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle