ఐసీసీ ఎలైట్ అంపైర్‌గా నితిన్ మీనన్
30-06-202030-06-2020 10:12:55 IST
Updated On 30-06-2020 10:26:12 ISTUpdated On 30-06-20202020-06-30T04:42:55.119Z30-06-2020 2020-06-30T04:42:34.835Z - 2020-06-30T04:56:12.886Z - 30-06-2020

క్రేజీ క్రీడ క్రికెట్లో కీలకంగా భావించే ఐసీసీ ఎలైట్ అంపైర్‌గా నితిన్ మీనన్ ఎంపికయ్యారు. ఇంతకు ముందు భారత్ నుంచి ఎలైట్ అంపైర్లుగా శ్రీనివాస్ వెంకట్రాఘవన్, సుందరం రవి వ్యవహరించారు. అయితే వీరిని గత ఏడాది ప్యానల్ నుంచి తప్పించారు.నితిన్ మీనన్ మూడు టెస్టులు, 24 వన్డేలు, 16 టీ20లకు అధికారిక అంపైర్‌గా వ్యవహరించారు. ఇప్పటి వరకు ఎమిరేట్స్ ఐసీసీ ఇంటర్నేషనల్ అంపైర్స్ ప్యానల్లో నితిన్ ఉన్నాడు. ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డైస్.. భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. మ్యాచ్ రిఫరీలు రంజన్ మదుగలే, డేవిడ్ బూన్లతో కూడిన ప్యానెల్ నితిన్‌ను ఎలైట్ అంపైర్‌గా ఎంపిక చేసింది. ప్రస్తుతం లీడింగ్‌లో ఉన్న అంపైర్లతో కలిసి అంపైరింగ్ బాధ్యతలను చేపట్టడం కల తీరినట్లుగా ఉందని నితిన్ మీనన్ చెప్పారు. ఎలైట్ అంపైర్ల ప్యానెల్‌కు నన్ను ఎంపిక చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానాని అన్నారు. ఐసీసీఎలైట్ అంపైర్ గా ఎన్నికైనందుకు ఎంతో గర్వకారణంగా ఉందని నితిన్ చెప్పారు. ప్రపంచంలోని ప్రముఖ అంపైర్లు, రిఫరీలతో ఉన్న ఎలైట్ ప్యానల్లో చేరాలనేది తన కలగా ఉండేది. ఆ కల ఇన్నాళ్లకు నిజం కావడం అదృష్టంగా భావిస్తున్నా అని నితిన్ మీనన్ ఐసీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన తండ్రి ప్రోత్సాహంతోనే 2004లో మధ్యప్రదేశ్‌లో ఏ లిస్ట్ క్రికెట్ ఆడాడు. నరేంద్ర మీనన్ అంతర్జాతీయ అంపైర్. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 2006లో అంపైర్ల కోసం పరీక్షలు నిర్వహించించింది. ఆయన ప్రోత్సాహాంతో పరీక్షలు రాసి. 23 ఏళ్లకే అంపైర్ గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి దానిపైనే పూర్తి ఫోకస్ పెట్టాన నితిన్ మీనన్ సవాళ్ళను ఎదుర్కొన్నాడు. భారతీయ అంపైర్లను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యం అన్నారు.

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!
4 hours ago

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!
7 hours ago

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
20 hours ago

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
a day ago

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
14-04-2021

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
14-04-2021

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
13-04-2021

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
12-04-2021

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను
12-04-2021

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!
12-04-2021
ఇంకా