newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐసీసీలో కుదరని సయోధ్య.. ఏకాభిప్రాయం కోసం వెయిటింగ్

11-08-202011-08-2020 09:30:14 IST
Updated On 11-08-2020 09:35:20 ISTUpdated On 11-08-20202020-08-11T04:00:14.161Z11-08-2020 2020-08-11T03:59:46.892Z - 2020-08-11T04:05:20.405Z - 11-08-2020

ఐసీసీలో కుదరని సయోధ్య.. ఏకాభిప్రాయం కోసం వెయిటింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌ ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు. చైర్మన్‌ పదవి కోసం నామినేషన్ల ప్రక్రియను ఖరారు చేసే ఏకైక ఎజెండాతో సోమవారం సమావేశమైన ఐసీసీ బోర్డు డైరెక్టర్లు తుది నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయారు. చైర్మన్ ఎన్నికలపై ఎటూతేల్చలేకపోయారు.

దాంతో చైర్మన్‌ ఎంపిక వాయిదా పడింది. శశాంక్‌ మనోహర్‌ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. 17 మంది సభ్యులు పాల్గొన్న సమావేశంలో పలు అంశాలపై ఏకాభిప్రాయానికి రాలేకపోయామని ఐసీసీ బోర్డు మెంబర్‌ ఒకరు వెల్లడించారు. 'చాలా అంశాల్లో ఏకాభిప్రాయం లేదు. 

17 మంది సభ్యుల సాధారణ మెజారిటీ లేదా 2/3 మెజారిటీ కోసం ప్రయత్నించాం. కానీ సాధ్యపడలేదు. అందుకే ఏకగ్రీవంగా ఎన్నుకొబడే వ్యక్తినే చైర్మన్‌గా కొనసాగించాలని అనుకున్నాం. ఎన్నికల వల్ల వచ్చే ఒత్తిడిని మేం తట్టుకోలేం. మెంబర్స్ మధ్య బేధాభిప్రాయాలు వస్తాయి'అని ఐసీసీ బోర్డు మెంబర్ వ్యాఖ్యానించారు.

మరోవైపు అందరికీ ఆమోద యోగ్యమైన వ్యక్తి ఇంతవరకు లభించకపోవడం, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ బరిలోకి దిగడంపై స్పష్టత ఇవ్వకపోవడం, పీసీబీ చీఫ్ ఎహ్‌సాన్ మణి కూడా పోటీకి వెనకడుగు వేయడంతో కొత్త అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత కరువైంది.

ఈ పదవిని చేజిక్కించుకునేందుకు పోటీ పడుతున్న కొలిన్‌ గ్రేవ్స్‌ (ఇంగ్లండ్‌), డేవ్‌ కామెరాన్‌ (వెస్టిండీస్‌) లకు కొందరి నుంచి మద్దతు లభిస్తున్నా... వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య కూడా అలాగే ఉంది. చైర్మన్‌ పదవి కోసం ఎన్నికలు నిర్వహిస్తే సభ్య దేశాల మధ్య అనవసరపు భేదాభిప్రాయాలకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని అభిప్రాయం.

అలా జరగకుండా అందరికీ ఆమోద యోగ్యుడైన వ్యక్తిని ఎంచుకునే క్రమంలోనే ఐసీసీ తుది నిర్ణయం తీసుకోలేకపోతోందనేది సమాచారం. భారత్‌కు చెంది కేఎస్ అనంత పద్మనాభన్‌ను అంతర్జాతీయ ప్యానెల్ ఆఫ్ అంపైర్స్‌లోకి తీసుకున్నారు.      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle