newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్2020 న్యూ షెడ్యూల్.. సెప్టెంబర్ 19నుంచే మొదలు

24-07-202024-07-2020 13:55:55 IST
Updated On 24-07-2020 15:47:16 ISTUpdated On 24-07-20202020-07-24T08:25:55.173Z24-07-2020 2020-07-24T08:25:30.127Z - 2020-07-24T10:17:16.647Z - 24-07-2020

ఐపీఎల్2020 న్యూ షెడ్యూల్.. సెప్టెంబర్ 19నుంచే మొదలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యూఏఈ వేదికగా ఐపీఎల్‌ని నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన బీసీసీఐ.. టోర్నీని కూడా 44 రోజుల నుంచి 51 రోజులకి పెంచింది. దాంతో.. షెడ్యూల్‌లో కేవలం ఐదు డబుల్ హెడర్ మ్యాచ్‌లు మాత్రమే ఉండే అవకాశం ఉంది.వాస్తవానికి ఐపీఎల్‌ని తొలుత సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకూ అంటే.. 44 రోజులు 60 మ్యాచ్‌ల షెడ్యూల్‌ని బీసీసీఐ రూపొందించింది. కానీ.. డబుల్ హెడర్ మ్యాచ్‌ల సంఖ్య దాదాపు పదికి చేరగా.. మరో వారం రోజులు టోర్నీని పొడిగించాలని బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్, ఫ్రాంఛైజీలు బీసీసీఐని కోరాయి. 

‘సెప్టెంబరు 19 నుంచే ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. 51 రోజుల ఈ విండోలో మొత్తం 60 మ్యాచ్‌లు జరుగుతాయి.  నవంబరు 8న ఫైనల్ నిర్వహిస్తాం. ఈ షెడ్యూల్ బహుశా టోర్నీలోని ఫ్రాంఛైజీలు, బ్రాడ్‌కాస్టర్లకు ఆమోదంగా వుంటుందని భావిస్తున్నామని బీసీసీఐ అధికారి తెలిపారు. భారతదేశంలో కరోనా వ్యాప్తి తీవ్రస్థాయికి చేరింది. దీంతో భారత్ లో ఐపీఎల్ నిర్వహించడం కష్టసాధ్యం. ప్రభుత్వం కూడా అందుకు సుముఖంగా లేదు. 

మరోవైపు టి20 ప్రపంచకప్ వాయిదా వేయాలనే ఆలోచనే ముందే ప్రకటిస్తే బాగుండేదని పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ అన్నారు. శశాంక్ మనోహరే కుట్రపూరితంగా వ్యవహరించాడని బాసిత్ అలీ ఆరోపించాడు. నిర్ణయాన్ని వాయిదాల మీద వాయిదా వేసి తీసుకున్నారని మండిపడ్డాడు. ఐపీఎల్ జరగవద్దనే శశాంక్ అలా చేశాడన్నారు. మరోవైపు ఐపీఎల్ వారం రోజుల పాటు పెంచాలని బీసీసీఐ భావించడం పట్ల క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle