newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ఐపీఎల్ 2020 స్పాన్సర్ షిప్... ఆన్‌లైన్ ఫాంటసీ స్పోర్ట్స్‌కే

18-08-202018-08-2020 19:05:27 IST
Updated On 19-08-2020 08:10:14 ISTUpdated On 19-08-20202020-08-18T13:35:27.478Z18-08-2020 2020-08-18T13:35:03.965Z - 2020-08-19T02:40:14.456Z - 19-08-2020

ఐపీఎల్ 2020 స్పాన్సర్ షిప్... ఆన్‌లైన్ ఫాంటసీ స్పోర్ట్స్‌కే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. యూఏఇలో జరగనున్న ఐపీఎల్ 2020కి కీలక ఘట్టం ఆవిష్కృతమయింది. ఆన్‌లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ సంస్థ డ్రీమ్ 11, రూ.222 కోట్లతో (సుమారు .533.5 మిలియన్లు) ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కుల కోసం బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్నది.

డ్రీమ్‌ 11 ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌ హక్కులను దక్కించుకుందని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ వెల్లడించారు. డ్రీమ్‌ 11 నాలుగు నెలల 13 రోజుల పాటు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ప‌తంజ‌లి, అడిడాస్‌, జియో క‌మ్యూనికేష‌న్స్‌, అన్అకాడ‌మీ, టాటా గ్రూప్‌ తదితర దిగ్గజ కంపెనీలు టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం పోటీపడ్డాయి.ఐపీఎల్-2020 సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకూ యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబిలో నిర్వహించనున్నారు.

వివో 2015 లో రెండేళ్లపాటు టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకుంది. తరువాత 2017 లో ఐదేళ్ల ఒప్పందంతో (2017-22) స్పాన్సర్‌షిప్‌ను కొనసాగించింది. 2018 నుంచి 2022 వ‌ర‌కు ఐపీఎల్ స్పాన్స‌ర్‌గా వివో ఉన్న‌ప్ప‌టికీ.. స‌రిహ‌‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో చైనా కంపెనీల‌ను బ‌హిష్క‌రించాల‌నే డిమాండ్ల మేర‌కు చైనా మొబైల్ కంపెనీ స్వ‌చ్ఛందంగా త‌ప్పుకుంది.

దీంతో బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ అన్వేషణలో పడింది. భారత దిగ్గజ సంస్థ టాటా సన్స్‌ సంస్థ కూడా రేసులో నిలిచింది. వేలంపాటలో అత్యధికంగా కోట్‌ చేసిన సంస్థకి, టోర్నమెంట్‌పై ఆ బ్రాండ్‌ చూపే ప్రభావాన్ని బట్టే ఆ సంస్థకు ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ దక్కింది. ఈ రకంగా చూస్తే స్పాన్సర్‌షిప్‌ రేసులో టాటా సన్స్‌ ముందుంటుందని భావించారు. 

టాటా సన్స్‌ సంస్థ భిన్నమైన రంగాల్లో రాణిస్తూ వినియోగదారులకు అత్యుత్తమ సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. రేసులో ఉన్న అన్ని సంస్థలు రూ.200 కోట్ల స్పాన్సర్‌షిప్‌ అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. టాటా బ్రాండ్‌ విలువను బట్టి ఐపీఎల్‌ టోర్నమెంట్‌కు మరింత క్రేజ్‌ వస్తుందని భావించారు. కానీ అనూహ్యంగా ఆన్‌లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ సంస్థ డ్రీమ్ స్వంతం చేసుకుంది. 

 

ధోని-చెన్నై బంధం అలాంటిదని చెబుతున్న గంభీర్

ధోని-చెన్నై బంధం అలాంటిదని చెబుతున్న గంభీర్

   an hour ago


హార్దిక్-మోరిస్.. కోహ్లీ కల్పించుకున్నా ఆగని గొడవ.. చివరికి..!

హార్దిక్-మోరిస్.. కోహ్లీ కల్పించుకున్నా ఆగని గొడవ.. చివరికి..!

   an hour ago


కోల్‌కతా ఆశలు గల్లంతు.. అదరగొట్టిన చెన్నై

కోల్‌కతా ఆశలు గల్లంతు.. అదరగొట్టిన చెన్నై

   2 hours ago


జడేజా సూపర్ ఫినిషింగ్.. ముంబై ప్లే ఆఫ్స్ లోకి

జడేజా సూపర్ ఫినిషింగ్.. ముంబై ప్లే ఆఫ్స్ లోకి

   2 hours ago


చెన్నై ముందు 173 పరుగుల టార్గెట్

చెన్నై ముందు 173 పరుగుల టార్గెట్

   13 hours ago


సానియా మీర్జా మీద సంచలన ఆరోపణలు చేసిన రాజా సింగ్

సానియా మీర్జా మీద సంచలన ఆరోపణలు చేసిన రాజా సింగ్

   28-10-2020


సందడి.. సందడిగా.. వార్నర్ బర్త్ డే సెలెబ్రేషన్స్

సందడి.. సందడిగా.. వార్నర్ బర్త్ డే సెలెబ్రేషన్స్

   28-10-2020


రోహిత్‌కి ఏమైందో తెలుసుకునే హక్కు ఫ్యాన్స్‌కి లేదా.. గవాస్కర్ ప్రశ్న

రోహిత్‌కి ఏమైందో తెలుసుకునే హక్కు ఫ్యాన్స్‌కి లేదా.. గవాస్కర్ ప్రశ్న

   28-10-2020


పుట్టినరోజు నాడు వీరవిహారం చేసిన వార్నర్.. ఏమి చెప్పాడంటే

పుట్టినరోజు నాడు వీరవిహారం చేసిన వార్నర్.. ఏమి చెప్పాడంటే

   28-10-2020


రబాడాను ఓ ఆటాడేసుకున్న సన్ రైజర్స్.. అరుదైన రికార్డును అందుకోలేకపోయాడు

రబాడాను ఓ ఆటాడేసుకున్న సన్ రైజర్స్.. అరుదైన రికార్డును అందుకోలేకపోయాడు

   28-10-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle