newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ స్ఫాన్సర్‌షిప్‌ ఎవరిదో?

08-08-202008-08-2020 08:44:02 IST
Updated On 08-08-2020 08:47:32 ISTUpdated On 08-08-20202020-08-08T03:14:02.254Z08-08-2020 2020-08-08T03:13:58.875Z - 2020-08-08T03:17:32.034Z - 08-08-2020

ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ స్ఫాన్సర్‌షిప్‌ ఎవరిదో?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ స్ఫాన్సర్‌షిప్‌ రేసు ఆసక్తికరంగా మారింది. చైనాకి చెందిన వివో కంపెనీతో ఉన్న టైటిల్ స్ఫాన్సర్‌షిప్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించిన గంటల వ్యవధిలోనే పెద్ద పెద్ద కంపెనీలు.. ఆ స్ఫాన్సర్‌షిప్‌ని దక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి.

ఇప్పటికే కోకో-కోలా, బైజూస్, డ్రీమ్ ఎలెవన్ తదితర కంపెనీలు కసరత్తులు ప్రారంభించినట్లు వార్తలు వస్తుండగా.. జియో, పతంజలి కూడా రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రేసులోకి అమెజాన్ కూడా వచ్చి చేరింది.

ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్‌షిప్ కోసం.. బీసీసీఐతో 2018లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న వివో.. టైటిల్ స్ఫాన్సర్‌గా ఏటా రూ. 440 కోట్లు చెల్లిస్తోంది. ఈ అగ్రిమెంట్ ఐపీఎల్ 2022 సీజన్‌తో ముగియనుంది.

ఈ ఏడాది కూడా వివోనే టైటిల్ స్ఫాన్సర్‌గా కొనసాగుతుందని.. గత ఆదివారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. కానీ.. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎంతలా అంటే..? బాయ్‌కాట్ చైనా తరహాలోనే బాయ్‌కాట్ ఐపీఎల్‌ అని హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. దాంతో.. వెనక్కి తగ్గిన బీసీసీఐ.. వివోతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది.

వివో కంపెనీ ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్‌షిప్ రూపంలో ఏటా రూ.440 కోట్లు చెల్లించగా.. కొత్త స్ఫాన్సర్‌ అంత చెల్లిస్తుందా..? అని సందేహాలు వ్యక్తమయ్యాయి. దానికి తోడు.. ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు యూఏఈ వేదికగా ఖాళీ స్టేడియాల్లో జరగనున్నాయి. తొలుత పెద్ద స్ఫాన్సర్ దొరకడమే కష్టమని బీసీసీఐలోని పెద్దలు, టోర్నీలోని ఫ్రాంఛైజీల అధికారులు అభిప్రాయపడ్డారు. కానీ.. ఎవరూ ఊహించని రీతిలో స్ఫాన్సర్లు పోటీపడుతున్నారు.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఈ టోర్నీ మధ్యలోనే దసరా (అక్టోబరు), దీపావళి (నవంబరు) పండగలు రానున్నాయి.ఈ ఫెస్టివల్ సీజన్‌ని క్యాష్ చేసుకోవాలని ఆశిస్తున్న అమెజాన్.. పెద్ద మొత్తంలో బిడ్ వేసేందుకు కూడా సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి వివో చెల్లించిన దానిలో 1/3శాతం వచ్చినా చాలని బీసీసీఐ భావిస్తోంది. కానీ.. తాజా పోటీ చూస్తుంటే.. బీసీసీఐ ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయం స్ఫాన్సర్‌షిప్ రూపంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది.

 



      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle