newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్ 2020... యూఏఈ బాట పట్టిన పంజాబ్, రాజస్థాన్

21-08-202021-08-2020 11:41:53 IST
Updated On 21-08-2020 16:19:00 ISTUpdated On 21-08-20202020-08-21T06:11:53.609Z21-08-2020 2020-08-21T06:10:58.489Z - 2020-08-21T10:49:00.758Z - 21-08-2020

ఐపీఎల్ 2020... యూఏఈ బాట పట్టిన పంజాబ్, రాజస్థాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 కోసం ఫ్రాంచైజీలు యూఏఈ బాటపట్టాయి. ఇప్పటికే మూడు జట్లు అక్కడికి చేరుకున్నాయి. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు గురువారం చార్టెడ్‌ ఫ్లయిట్‌లలో దుబాయ్‌ చేరుకోగా.. సాయంత్రం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అబుదాబీలో దిగింది. 

డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీలు శుక్రవారం దుబాయ్‌కి బయల్దేరతాయి. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ ఈ వారాంతంలో పయనం కానున్నాయి.ఐపీఎల్ 2020 మ్యాచులు వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 60 మ్యాచ్‌లు 53 రోజుల పాటు దుబాయ్, అబుదాబీ, షార్జా మూడు వేదికల్లో జరుగనున్నాయి.

కొవిడ్‌-19 వైరస్‌ కోరలు చాస్తుండటంతో.. లీగ్‌ను బయో సెక్యూర్‌ వాతావరణంలో నిర్వహించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో 2014లో సగం ఐపీఎల్ మ్యాచులు ఇక్కడే నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతకుముందు దక్షిణాఫ్రికాలో మ్యాచులు జరిగాయి.

https://www.photojoiner.net/image/QIFVGAkQ

భారత దేశంలో విమానం ఎక్కేందుకు 24 గంటల ముందే రెండుసార్లు వైరస్ పరీక్షలు చేయించుకున్న ఆటగాళ్లు, సిబ్బంది, యాజమాన్యం యూఏఈలో కూడా మళ్లీ పరీక్షలు చేయించుకోనున్నారు. ఆరు రోజుల పాటు ఉండే ఏకాంతవాసంలో 1, 3 ,6 రోజుల్లో ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయించుకుంటారు. ఈ మూడింటిలో నెగెటివ్‌ ఫలితాలు వచ్చిన వారే జీవ రక్షణ వలయం (బయో బబుల్‌)లోకి వెళ్తారు. ఈ బుడగలో ఉన్నప్పటికీ.. టోర్నీ జరిగినంత కాలం ప్రతీ ఐదు రోజులకోసారి పరీక్షలుజరుగుతూనే ఉంటాయి.

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో యూఏఈ వేదికగా ఐపీఎల్‌ 2020లో పాల్గొననున్న ఆటగాళ్లు నిబంధనలను కచ్చితంగా పాటించాలని బీసీసీఐ హెచ్చరించింది. 

బయో సెక్యూర్‌ వాతావరణాన్ని కాపాడుకుంటూ మ్యాచ్‌లు ఆడాలని సూచించింది. ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, జట్ల యాజమాన్యాలకు నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని చెప్పాం. ఎవరో ఒకరి తప్పదానికి మిగిలిన వాళ్లు ప్రమాదంలో పడొద్దనే ముందస్తుగా హెచ్చరిస్తున్నాం అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే జోఫ్రా ఆర్చర్‌, మొహమ్మద్ హఫీజ్ నిబంధనలను ఉల్లఘించిన నేపథ్యంలో.. బోర్డు ఐపీఎల్‌ ఆటగాళ్లకు ముందస్తుగానే హెచ్చరికలు జారీచేసింది.

ఐపీఎల్‌ మళ్లీ మొదలవనుండడం సంతోషకరమైన విషయమని భారత మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌ అన్నారు. బయో బబుల్‌ వాతావరణంలో ఇంగ్లండ్‌ విజయవంతంగా క్రికెట్‌ సిరీస్‌లు నిర్వహిస్తున్నది. ఐపీఎల్‌ కూడా అదే బాటలో నడుస్తుందనే నమ్మకముంది. ఐపీఎల్‌పై ఆధారపడి చాలామంది ఉన్నారు. వారికిది సంతోషకరమైన విషయం అని గురువారం అజారుద్దీన్‌ పేర్కొన్నారు.

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle